Srileela : అమెరికాలో పుట్టిన తెలుగు అమ్మాయి శ్రీలీల. తల్లి పేరు స్వర్ణలత. భర్తతో విబేధాలు నేపథ్యంలో స్వర్ణలత దంపతులు విడిపోయారు. అనంతరం శ్రీలీల తల్లి ఇండియా వచ్చేశారు. స్వర్ణలత డాక్టర్. బెంగుళూరులో ఫేమస్ గైనకాలజిస్ట్. ఇక బాల్యం నుండి శ్రీలీల చాలా యాక్టీవ్. ఆమె శాస్త్రీయ నృత్యం నేర్చుకుంది. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఒక చిత్రంలో నటించింది. హీరోయిన్ కావాలన్న శ్రీలీల కోరికను కుటుంబ సభ్యులు మొదట్లో వ్యతిరేకించారట. చివరికి అంగీకారం తెలపడంతో ఆ దిశగా అడుగులు వేసింది.
అదే సమయంలో శ్రీలీల ఎంబీబీఎస్ చదువుతుంది. ఇంకా ఆమె చదువు పూర్తి కాలేదు. 2019లో కిస్ మూవీతో శ్రీలీల సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైంది. ఇది కన్నడ చిత్రం. అప్పటికి శ్రీలీల టీనేజ్ లో ఉన్నారు. తెలుగులో శ్రీలీల మొదటి చిత్రం పెళ్లిసందD . ఈ మూవీలో శ్రీలీల డాన్సులకు ఆడియన్స్ ఫిదా అయ్యారు. రెండో చిత్రం ధమాకాతో సూపర్ హిట్ కొట్టింది. శ్రీలీల టాలీవుడ్ మోస్ట్ డిమాండెడ్ హీరోయిన్ గా అవతరించింది.
వరుసగా చిత్రాలు చేసింది. కాగా శ్రీలీలకు తెలియని ఒక రహస్యం వెలుగులోకి వచ్చింది. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. 2022లో శ్రీలీల బై టు లవ్ టైటిల్ తో ఒక చిత్రం చేసింది. ఈ మూవీలో హీరో, హీరోయిన్ ఒక బిడ్డను దత్తత తీసుకుంటారు. ఈ సినిమాను ఫాలో అవుతూ.. శ్రీలీల నిజ జీవితంలో ఇద్దరు పిల్లల్ని దత్తత తీసుకుంది. ఆ పిల్లలు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ కావడం మరొక విశేషం. ఆ విధంగా తనలోని మానవత్వాన్ని, మంచి తనాన్ని శ్రీలీల చాటుకుంది. అదన్నమాట సంగతి.
ప్రస్తుతం శ్రీలీల స్పెషల్ సాంగ్ చేసిన పుష్ప 2 విడుదలకు సిద్ధమైంది. డిసెంబర్ 5న ఈ మూవీ విడులవుతుంది. అయితే 4వ తేదీ రాత్రి నుండే షోలు మొదలు కానున్నాయి. పుష్ప 2లో ఫస్ట్ టైం స్పెషల్ సాంగ్ చేసింది శ్రీలీల. రవితేజ 75, రాబిన్ హుడ్, ఉస్తాద్ భగత్ సింగ్ శ్రీలీల ఖాతాలో ఉన్న చిత్రాలు. ఉస్తాద్ భగత్ సింగ్.. అనుకోని కారణాలతో వాయిదా పడింది. త్వరలో ఈ మూవీ షూటింగ్ సెట్స్ పైకి వెళ్లే అవకాశం కలదు. ఇక రాబిన్ హుడ్ సంక్రాంతి బరిలో నిలిచే ఛాన్స్ ఉంది. రవితేజ మూవీ షూటింగ్ దశలో ఉంది.