Karan Johar : ది గ్రేట్ డైరెక్టర్ రాజమౌళి గురించి పరిచయం అవసరం లేదు. ఈయన తెరకెక్కించిన బాహుబలి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ పేరు ఓ రేంజ్ లో మారుమోగింది. ఒక్కసారిగా టాలీవుడ్ ఇండస్ట్రీ బాలీవుడ్ రేంజ్ ను కూడా దాటిపోయింది. ఆ తర్వాత వచ్చిన బాహుబలి సిరీస్ 2 టాలీవుడ్ రేంజ్ ను మరింత హద్దులు దాటేలా చేసింది. ఆ తర్వాత వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఏకంగా ప్రపంచ వ్యాప్తంగా టాలీవుడ్ ఇండస్ట్రీ టాక్ మారుమోగింది. కేజీఎఫ్, కాంతార, హనుమాన్, కల్కి వంటి సినిమాలు లైన్ గా హిందీ ఇండస్ట్రీని బిత్తరపోయేలా చేశాయి. ముఖ్యంగా తెలుగు నుంచి భవిష్యత్తులో మరిన్ని పాన్ ఇండియా సినిమాలు సిద్దం అవుతున్నాయి కాబట్టి అందరి దృష్టి కూడా ఈ ఇండస్ట్రీ మీదనే పడింది.
గతంలో బాలీవుడ్ లో బడా దర్శక నిర్మాత కరణ్ జోహార్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. దీనికి రీజన్ కూడా ఉందండోయ్. బాహుబలి, ఈగ చిత్రాల గురించి కొన్ని విషయాలు తెలిపారు. ఇప్పుడు పుష్ప 2 రిలీజ్ సందర్భంగా ఆ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. నార్త్ లో కరణ్ జోహార్ బాహుబలి పార్ట్ 1 పార్ట్ 2 లని రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా కరణ్ జోహార్ మాట్లాడుతూ.. హాలీవుడ్ అయినా, బాలీవుడ్ అయినా, టాలీవుడ్ అయినా సినిమాలో ఎమోషన్స్ మాత్రం ఒకే మాదిరి ఉంటాయి. అందరి ఎమోషన్స్ ఒకటే. ఈ విషయాన్ని గ్రహించిన మొదటి దర్శకుడు రాజమౌళి అంటూ కొనియాడారు.
ఎమోషన్స్ వర్కౌట్ అయినా సరే అన్ని చిత్రాలు అన్ని భాషల్లో వర్కౌట్ అవడం అంటే కష్టమే. దానికి భారీతనం ఉంటే మాత్రమే హిట్ అవుతాయి. బాహుబలి చిత్రంతో రాజమౌళి అది చేసి చూపించారని పేర్కొన్నారు. ఒక కాన్సెప్ట్ అనుకొని దానికి సంబంధించిన సినిమా చేస్తే అది ఆ భాషలో మాత్రమే విజయం సాధిస్తుందని.. గ్రాండ్ విజువల్స్, భారీ స్కేల్ ఉంటే మాత్రమే ఇండియా మొత్తం ఆదరణ లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. అయితే తనకు మొదట బాహుబలి చిత్ర రష్ ఫుటేజ్ చూపించారని.. అది చూసిన తర్వాత ఆయన ఒకటే చెప్పారట. బాహుబలి ఇండియాస్ బిగ్గెస్ట్ మూవీ అవుతుందని.. ప్రొమోషన్స్ చేయండి అన్నారట.
బాహుబలి నిజంగానే ఇండియాలో బిగ్గెస్ట్ సినిమా. అందులో ఎలాంటి అనుమానం లేదు. ఆడియన్స్ అది నమ్మి థియేటర్స్ కు తండోపతండాలుగా తరలి వచ్చారు. మ్యాజిక్ జరిగింది అని ఈ నిర్మాత కూడా అన్నారు. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈగ చిత్రం అయినా సరే అదే రేంజ్ లో ఉంది. ఎందుకంటే ఈగ రివేంజ్ తీర్చుకోవడం అనేది అల్టిమేట్ కాన్సెప్ట్ అన్నారు. కానీ ఒక డిస్ట్రిబ్యూటర్ గా ఆ చిత్రాన్ని నార్త్ లో రిలీజ్ చేయాలంటే ఆలోచిస్తామన్నారు ఆయన. ఎందుకంటే అది పెద్ద సినిమా కాదు. బట్ అద్భుతమైన కాన్సెప్ట్ అన్నారు ఆయన.
అయితే కరణ్ జోహార్ వ్యాఖ్యలపై నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు. బాలీవుడ్ ని లాగిపెట్టి కొట్టే మరో చిత్రం వస్తుందని అదే పుష్ప 2 అంటూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంటున్నారు. పుష్ప 2 సినిమాను సుకుమార్ గ్రాండ్ విజువల్స్, యాక్షన్ తో తెరకెక్కించారు. ఇండియాలోని భారీ హిట్ సినిమాల లిస్ట్ లో ఈ సినిమా నిలిచే అవకాశం ఉంది. అయితే పుష్ప సినిమా హిట్ అయింది కానీ ఈ పుష్ప 2 ఎలాంటి రిజల్ట్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.