Homeఆంధ్రప్రదేశ్‌Jagan Delhi Tours: జగన్ తో కేంద్రం ఏం చేస్తోంది? మళ్లీ ఢిల్లీకి వెనుక కథేంటి?

Jagan Delhi Tours: జగన్ తో కేంద్రం ఏం చేస్తోంది? మళ్లీ ఢిల్లీకి వెనుక కథేంటి?

Jagan Delhi Tours: ఏపీ సీఎం జగన్ ఇటీవల వరుసగా ఢిల్లీ వెళుతున్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఢిల్లీ పెద్దలను కలుస్తున్నట్టు చెబుతున్నారు. పోలవరానికి నిధులు, నిర్వాసితుల సమస్యలు, విద్యుత్ బకాయిలు వంటి వాటిని ప్రస్తావిస్తున్నట్టు ప్రెస్ నోట్లు రిలీజ్ చేస్తున్నారు. విపక్షాలు మాత్రం వ్యక్తిగత,రాజకీయ ప్రయోజనాలకే సీఎం ఢిల్లీ బాట పడుతున్నట్టు ఆరోపణలు చేస్తున్నాయి.కేంద్రం నుంచే ఏయే అంశాలపై చర్చించారో వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేస్తున్నాయి. జగన్ ఢిల్లీ వెళ్లి పట్టుమని పదిరోజులు కూడా కాలేదు. మరోసారి ఆయన హస్తిన బాట పడతారన్న ప్రచారం సాగుతోంది. ఢిల్లీ పర్యటన కోసం ఆయన ఏకంగా కేబినెట్ సమావేశాన్నే వాయిదా వేశారని తెలియడం హాట్ టాపిక్ గా మారుతోంది. మొన్నే వెళ్లి ప్రధాని మోదీని, కేంద్ర విద్యుత్ శాఖ మంత్రిని కలిసివచ్చిన జగన్ ..ఇప్పుడు ఉన్నపలంగా మరోసారి ఢిల్లీ టూర్ కు సన్నాహాలు చేస్తుండడం ఎవరికీ అంతు పట్టడం లేదు.

Jagan Delhi Tours
Jagan, MODI

కేబినెట్ భేటీ వాయిదా..
వాస్తవానికి ఈ నెల 29న మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించి షెడ్యూల్ కూడా ఖరారు చేశారు. ఈ మేరకు అన్ని మంత్రిత్వ శాఖకు సాధారణ మంత్రిత్వ శాఖకు సమాచారం సైతం చేరవేశారు. దీనికి సంబంధించి సర్క్యులర్ కూడా జారీచేశారు. ఇటీవల ఢిల్లీ పర్యటనలో తనకు లభించిన హామీలు, ప్రధాని మోదీ, విద్యుత్ శాఖ మంత్రితో జరిపిన చర్చలు గురించి సీఎం జగన్ మంత్రుల సమావేశంలో వెల్లడిస్తారని కూడా తెలిసింది. కానీ కేబినెట్ సమావేశాన్ని సెప్టెంబరు 1కు వాయిదా వేశారు. జగన్ ఢిల్లీ పర్యటన ఉంటుందన్న నేపథ్యంలో కేబినెట్ భేటీ వాయిదాపడినట్టు సమాచారం. ఈ నెల చివర్లో ఢిల్లీ వెళ్లాల్సిన అవసరం ఉండడంతో సమావేశాన్ని వాయిదా వేశారని తెలుస్తోంది. సెప్టెంబరు 1న ఉదయం 10.30 గంటలకు సీఎం అధ్యక్షతన కేబినెట్ సమావేశం నిర్వహిస్తున్నట్టు సాధారణ మంత్రిత్వ శాఖ తెలిపింది.

Also Read: AP Govt- New File Jumping System: ఏపీలో ఫైల్స్ కు సింగిల్ విండో క్లీయరెన్స్..అస్మదీయులైతే ఒకే

Jagan Delhi Tours:
Jagan, amit shah

అధికార, విపక్షాల్లో చర్చోప చర్చలు..
అయితే కేబినెట్ మీటింగ్ వాయిదా వేసుకొని మరీ ఢిల్లీ వెళ్లాల్సిన పరిస్థితి ఏమిటన్న చర్చ అటు అధికార పార్టీలో, ఇటు విపక్షాల్లో మొదలైంది. ఎవరికి వారు దీనిపై అన్వయించుకుంటున్నారు. పోలవరం నిర్వాసితుల సమస్యలు, విద్యుత్ బకాయిల విషయంలో అటు ప్రధాని, ఇటు విద్యుత్ శాఖ మంత్రి సానుకూలంగా స్పందించారని.. నిధుల విడుదలకు సంకేతాలు రావడంతో జగన్ ఢిల్లీ వెళుతున్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో కలవరపాటుకు గురైన సీఎం జగన్ ఢిల్లీ పెద్దలను కలుస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. లిక్కర్ కుంభకోణంలో ఒక ఎంపీతో పాటు పార్టీ కీలక నేత సమీప బంధువు పేరు బయటకు రావడంతో జగన్ ఆందోళనకు గురవుతున్నారని.. ఎన్నికలు సమీపిస్తుండడంతో విపక్షానికి ఒక ఆయుధంగా భావిస్తున్నారని..దీనిని ముగింపు పలకాలన్న ఉద్దేశ్యంతో ఆయన మరోసారి ఢిల్లీ వెళుతున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. గతసారి ఢిల్లీ వెళ్లినప్పుడు హోం మంత్రి అమిత్ షాను కలవలేకపోయారని..అందుకే మరోసారి వెళుతున్నారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికైతే సీఎం జగన్ తో కేంద్ర ప్రభుత్వం ఏదో చేస్తుందన్న అనుమానం ఏపీ పొలిటికల్ సర్కిల్ లో నడుస్తోంది.

Also Read:Congress President: కాంగ్రెస్ పగ్గాలు అశోక్ గెహ్లాట్ కు.? వృద్ధ జంబూకాలతో పార్టీ నడుస్తుందా?

 

 

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular