https://oktelugu.com/

కరోనా వేళ పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నట్టు?

తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రజాదరణ ఉన్న రాజకీయ పార్టీకి ఆయన చీఫ్. కోట్లాది మంది అభిమానగణం ఆయన సొంతం. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ సీట్లు గెలవకపోయినా.. ఒక వర్గం ఓట్లను రాబట్టుకోవడంలో పవన్ కాసింత విజయం సాధించారు. ఇప్పటికీ పార్టీపై.. దాని నాయకుడిపై యువతకు పిచ్చి బాగా ఉంది. కరోనా కష్టకాలంలో ఇతర అన్ని పార్టీల రాజకీయ నాయకులంతా చురుకుగా ఉన్నారు. కానీ ఈ నాయకుడు మాత్రం మౌనంగా ఉండడం.. రాజకీయ యవనికపై లేకపోవడం స్పష్టంగా కనిపిస్తోంది. […]

Written By:
  • NARESH
  • , Updated On : July 18, 2020 / 12:23 PM IST
    Follow us on


    తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రజాదరణ ఉన్న రాజకీయ పార్టీకి ఆయన చీఫ్. కోట్లాది మంది అభిమానగణం ఆయన సొంతం. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ సీట్లు గెలవకపోయినా.. ఒక వర్గం ఓట్లను రాబట్టుకోవడంలో పవన్ కాసింత విజయం సాధించారు. ఇప్పటికీ పార్టీపై.. దాని నాయకుడిపై యువతకు పిచ్చి బాగా ఉంది. కరోనా కష్టకాలంలో ఇతర అన్ని పార్టీల రాజకీయ నాయకులంతా చురుకుగా ఉన్నారు. కానీ ఈ నాయకుడు మాత్రం మౌనంగా ఉండడం.. రాజకీయ యవనికపై లేకపోవడం స్పష్టంగా కనిపిస్తోంది.

    మందుబాబులు బేజారు…అక్రమార్కులు హుషారు..!

    ఆ నాయకుడు మరెవరో కాదు.. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్. కరోనా-లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి జనసేనాని నుంచి ఎటువంటి వార్తలు రాలేదు. ఒక ప్రకటన లేదా ప్రత్యక్ష కార్యాచరణ లేదు. కనీసం ఇతర రాజకీయ పార్టీల నేతలు చేస్తున్నట్టు పార్టీ కార్యకర్తలతో వీడియో కాన్ఫరెన్స్ కూడా లేదు. టీడీపీ, బీజేపీ సహా ప్రతిపక్ష నాయకులందరూ వీడియో కాన్ఫరెన్స్ ల ద్వారా కార్యకర్తలతో మాట్లాడడం.. వారిని ఉత్సాహ పరచడం.. కార్యోన్ముఖులను చేయడం చేస్తున్నారు. కానీ పవన్ కల్యాణ్ లో అవేమీ కనిపించడం లేదు. వినిపించడం లేదు. అసలు పవన్ కళ్యాణ్ నోరే విప్పడం లేదు.

    ప్రస్తుతం జనసేన పార్టీకి సంబంధించిన ప్రతీది పార్టీలో నంబర్ 2 అయిన నాదెండ్ల మనోహర్ చూసుకుంటున్నారు. ఆయన నుంచే ప్రకటనలు వస్తున్నాయి. ప్రతీపార్టీ కార్యక్రమంలోనూ ఆయనే పాల్గొంటూ యాక్టివ్ గా ఉన్నారు. అధికారిక ప్రకటనలు ఆయనే ఇస్తున్నారు.

    కాంగ్రెస్-టీడీపీ తెరచాటు బంధానికి ఇదే నిదర్శనం..!

    నిజానికి పవన్ కళ్యాణ్ ఇప్పుడు సినిమాలతోనూ బీజీగా లేరు. ఆయన నటిస్తున్న సినిమాలన్నీ కరోనాతో షూటింగ్ బంద్ చేశారు.ఈ పరిస్థితుల్లో ఆయన పార్టీలో యాక్టివ్ అయ్యి కార్యకర్తలు, నేతలతో సంప్రదింపులు జరుపుతూ ఉత్సాహ పరచవచ్చు. కరోనా క్లిష్ట సమయంలో పేదలకు సేవ చేసే కార్యక్రమాల్లో అభిమానులు, జనసైనికులు పాల్గొనమని కోరవచ్చు. కానీ పవన్ మాత్రం అవేమీ చేయడం లేదు. కోట్ల మంది ఫ్యాన్స్.. లక్షలమంది జనసైనికులున్నా కూడా పవన్ వారిని ఉపయోగించుకోకుండా మౌనంగా ఉండడం అంతుచిక్కని విషయంగా ఉంది.