2019 ఎన్నికల్లో ఏపీలో ఫ్యాన్ గాలి జోరుగా వీయడంతో వైసీపీ అధికారంలోకి వచ్చింది. సీఎంగా జగన్మోహన్ రెడ్డి ఏడాది పాలన ఇటీవలే పూర్తయింది. సంవత్సర కాలంలోనే వైసీపీ సర్కార్ అనేక సంక్షేమ పథకాలు ప్రజల్లోకి దూసుకెళుతూ వారి మన్నలను పొందుతోంది. ఇదిలా ఉంటే ఈ ఏడాదిలోనే జగన్ ప్రభుత్వంపై ప్రజలతోపాటు సొంత పార్టీ నేతలు అసంతృప్తిగా ఉన్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీనిపై సీఎం జగన్ నజర్ వేసినట్లు తెలుస్తోంది.
మందుబాబులు బేజారు…అక్రమార్కులు హుషారు..!
కరోనా లాంటి విపత్కర పరిస్థితులను కొన్ని రాష్ట్రాలు ఎదుర్కొలేక చతికిలపడితే ఏపీలో మాత్రం జగన్ పకడ్బంధీ చర్యలు చేపడుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. దేశంలో కరోనా టెస్టులు అత్యధికంగా ఏపీలో చేస్తుండటం జగన్ సర్కార్ పనితీరుకు నిదర్శనంగా నిలుస్తుంది. ప్రజారోగ్యంపై నిత్యం సమీక్షలు చేస్తూ ఎప్పటికప్పుడు ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ ముందుకెళుతున్నారు. కరోనా సమయంలోనూ ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హామీలను నెరవెర్చుతూ ముందుకెళుతున్నారు. వీటన్నింటికి ప్రజల ప్రశంసలు రావాల్సిపోయి వ్యతిరేకత వస్తుందని ప్రచారం జరుతుండటంపై జగన్ సీరియస్ అయినట్లు తెలుస్తోంది.
ప్రభుత్వంపై వ్యతిరేక ప్రచారం రావడానికి సొంతపార్టీ నేతలే కారణమని జగన్ గుర్తించారట. పార్టీలో పదవులు రాని, ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ వైసీపీలో అసంతృప్తి ఉందనే సంకేతాన్ని బయటికి పంపుతున్నారని జగన్ గుర్తించినట్లు తెలుస్తోంది. ప్రతిపక్షాల కంటే సొంత పార్టీ నేతలే పార్టీ సమావేశాల్లో, మీడియా ముందు జగన్ సర్కార్ ను డ్యామేజ్ చేస్తున్నారని గ్రహించారు. దీంతో వారందరికి సీఎం జగన్ త్వరలో ఓ స్పెషల్ క్లాస్ తీసుకోనున్నారనే ప్రచారం జరుగుతోంది.
పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న వారి వివరాలను ఇప్పటికే నిఘావర్గాల ద్వారా జగన్ తెప్పించుకున్నారు. వీరిలో ఎక్కువగా టీడీపీ నుంచి వైసీపీలోకి వలస వచ్చిన నేతలు ఉన్నారట. జగన్ అధికారంలోకి వచ్చాక తమకు కీలక పదవులు దక్కుతాయని ఆశించి రాకపోవడంతో ప్రభుత్వంపై వ్యతిరేక ప్రచారానికి పూనుకుంటున్నారట. పార్టీకి సంబంధించిన లీకులను ప్రతిపక్షాలకు ఇస్తూ పార్టీని అబాసుపాలు చేస్తున్నారని జగన్ గుర్తించినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ నేతలను సీఎం తన వద్దకు పిలుచుకొని క్లాస్ పీకేందుకు సిద్ధమవుతున్నారట. ఈ నేతలపై జగన్ తీసుకునే చర్యలు ఏమేరకు ఫలిస్తాయో వేచి చూడాల్సిందే..!