ఏపీ సీఎంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి ఏడాది పాలన పూర్తయింది. సంవత్సర కాలంలోనే అనేక ప్రజా సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ దూసుకెళుతున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేస్తూనే ప్రత్యర్థులకు సీఎం జగన్మోహన్ రెడ్డి చుక్కలు చూపిస్తున్నారు. టీడీపీ హయాంలో జరిగిన స్కాములను బయటికి తీస్తూ చంద్రబాబు హయాంలో మంత్రులుగా పని చేసిన వారిని ఒక్కొక్కరుగా జైళ్లకు పంపుతున్నారు.
చినబాబుకు బ్యాడ్ లక్.. అవకాశం మిస్సయిందా?
ఇదిలా ఉంటే సీఎం జగన్ ఏడాది పాలనపై సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే, చంద్రబాబు వియ్యంకుడు బాలకృష్ణ ఎప్పుడూ పెద్దగా మాట్లాడింది లేదు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక బాలకృష్ణ తన నియోజకవర్గ అభివృద్ధి, సినిమాలకే పరిమితమయ్యారు. అయితే ఇటీవల టీడీపీ మహానాడులో మాత్రం జగన్మోహన్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆ తర్వాత కూడా ఓ ఇంటర్వూలో మాట్లాడుతూ సీఎం జగన్ సర్కార్ త్వరలో పడిపోతుందంటూ జోస్యం చెప్పారు. ఆయన వ్యాఖ్యల్లో అప్పట్లో ఏపీలో తీవ్రదుమారం రేపాయి. అలాగే జగన్ తనకు వీరాభిమాని చెప్పుకున్నాడు.
తాజాగా ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసేందుకు కసరత్తులు చేస్తుండగా బాలకృష్ణ సీఎం జగన్ కు లేఖ రాశారు. హిందూపురాన్ని కొత్త జిల్లాగా ఏర్పాటు చేయాలనీ, హిందూపురంకు మంజూరైన మెడికల్ కళాశాలను నియోజకవర్గం మాల్గురులో ఏర్పాటు చేయాలని కోరారు. బాలయ్య కోరికలను పరిశీలించిన సీఎం జగన్ ఆయన అడిగినవిధంగా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. బాలయ్య కోరికల చిట్టా నెరవేర్చడం ద్వారా ఆయనకు ప్రభుత్వంపై మంచి అభిప్రాయం వ్యక్తమవుతుందని జగన్ భావిస్తున్నారట.
నిమ్మగడ్డకు గవర్నర్ అప్పాయింట్మెంట్..సర్వత్రా ఉత్కంఠ
ఈ పనుల ద్వారా బాలయ్యను తనవైపు తిప్పికొనేందుకు జగన్ ప్లాన్ చేస్తున్నారు. బాలయ్య కోరికలు నెరవేర్చడం ద్వారా ఆయనతో ప్రభుత్వానికి జై కొట్టిస్తే ప్రజల్లోకి మంచి సంకేతం వెళుతుందని జగన్ భావిస్తున్నారట. అందుకే బాలయ్య అడిగిందే తడవుగా ఆయన కోరికలను నెరవెర్చేందుకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
గతంలో ఎప్పుడు విమర్శలు చేసే జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైతం ఇటీవల జగన్ కార్యక్రమాలకు చూసి జై కొట్టారు. 108, కోవిడ్-19పై ప్రభుత్వం చర్యలు బేషుగా ఉన్నాయని జగన్ కు పవన్ కితాబిచ్చారు. దీంతో బాలయ్య కోరికను నెరవేర్చి క్రమంగా ఆయనను ముగ్గులోకి లాగాలని జగన్ భావిస్తున్నారు. అయితే బాలయ్య సీఎం జగన్ జై కొడుతారో లేదో వేచి చూడాల్సిందే..!