AP Employees strike: తమను అత్యంత దారుణంగా ఏపీ ప్రభుత్వం మోసం చేసిందని ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అంటున్నారు. ఉద్యోగులకు ఇటీవల ఏపీ సర్కారు 43 శాతం పీఆర్సీ ఇచ్చింది. కానీ, దాని వలన ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ క్రమంలోనే ఏపీ సర్కారు తీరును నిరసిస్తూ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయం వలన తాము తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు. ఈ క్రమంలోనే ఉద్యోగులు ఐక్యత చూపుతున్నారు.

ఏపీలోని ఉద్యోగ సంఘాల నేతలందరూ ఒకే తాటిపైకి వచ్చారు. అన్ని శాఖల వాళ్లు కలిసి సమ్మెకు సిద్ధమవుతున్నారు. సోమవారం నుంచి ఆందోళనల్లో పాల్గొంటున్నారు. ఈ ఆందోళనల్లో ప్రజారోగ్య సిబ్బందితో పాటు ఆర్టీసీ ఉద్యోగులూ పాల్గొంటారని వివరిస్తున్నారు. అలా అన్ని శాఖల ఉద్యోగులు ప్రభుత్వంపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఉద్యోగులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోటీసు ఇవ్వనున్నారు. పోలీసు శాఖ మినహా మిగతా అన్ని శాఖలూ సమ్మెలోకి వెళ్లడం ఖాయమనిపిస్తోంది.
Also Read: ఈ టైంలో ప్రభుత్వ ఉద్యోగుల సమ్మె సమంజసమేనా?
ఏపీ సర్కారు నిర్ణయాలపై ఏ ఒక్క శాఖ వారూ సానుకూలంగా లేరని తెలుస్తోంది. ఇకపోతే సమ్మెలో అనుకున్న ప్రకారంగా అన్ని శాఖల వాళ్లు పాల్గొన్నట్లయితే అది తెలంగాణాలో మాదిరి సకల జనుల సమ్మె అవుతుంది. తెలంగాణ ఉద్యమం సమయంలో అలా ఉద్యోగులందరూ సమ్మె చేశారు. వారి సమ్మె సక్సెస్ అయింది కూడా. ఉమ్మడి రాష్ట్రంలో అటువంటి సమ్మె జరిగింది. కాగా, మళ్లీ ఇప్పుడు విభజిత ఏపీలో అటువంటి సమ్మె జరగబోతున్నది.
ప్రభుత్వం ఉద్యోగుల సమ్మె విషయమై ఏ విధంగా స్పందిస్తుందనేది కూడా కీలకంగా మారనుంది. హెచ్ఆర్ఏను మళ్లీ సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకుగాను సిద్ధంగా లేమని, ఆ ప్రశ్నే లేదని సీఎం జగన్ పేర్కొన్నారు. కాగా, ఇప్పుడు సమ్మె విషయమై సర్కారు వ్యూహం ఎలా ఉంటుందనేది చర్చనీయాంశమవుతున్నది. ఉద్యోగుల సమ్మెను అలాగే వదిలేస్తారా? అనే చర్చ కూడా జరగుతున్నది. అలా ఉద్యోగుల సమ్మె వలన కలిగే నష్టాలపైన ప్రజలకు వివరిస్తారా? అనేది చూడాలి. ఒక వేళ అలాగే చేస్తే కనుక.. ఉద్యోగుల వలన ప్రభుత్వానికి నష్టం కలుగుతుందనే వాదన కూడా ఉంది. అయితే, ప్రభుత్వం మాత్రం ఉద్యోగుల పట్ల సానుకూల వైఖరి కలిగి లేదనే అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు.
Also Read: జగన్ బుజ్జగించినా తగ్గేదేలే.. 7 నుంచి సమ్మెకు ఏపీ ఉద్యోగులు..