Mahesh Tweet About Namrata: టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రేమ జంటల్లో ‘మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్’ జంట ఒకటి. పైగా ఈ టాలీవుడ్ మోస్ట్ లవింగ్ కపుల్స్ లో ఎంతో అన్యోన్యంగా ఉంటారు. కాగా శనివారం నమ్రత పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమెకు ప్రత్యేకంగా బర్త్ డే విషెస్ తెలిపారు ప్రిన్స్ మహేష్ బాబు. “పుట్టినరోజు శుభాకాంక్షలు నమ్రత. నువ్వు నా రాక్.. నాతో నా ప్రపంచాన్ని పంచుకుంటున్నందుకు కృతజ్ఞతలు” అని నమ్రత ఫొటోను ట్విట్‌లో పోస్ట్ చేశారు మహేష్ బాబు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతుంది.

ఈ ట్వీట్ కి నమ్రత సోదరి శిల్పా శిరోద్కర్ తో పాటు పలువురు స్పందిస్తూ కామెంట్లు చేశారు. కాగా నమ్రత 50వ పుట్టిన పుట్టిన రోజు జరుపుకుంది. ఈ సందర్భంగా తన భార్యపై ఉన్న తన ప్రేమను తెలుపుతూ.. మహేష్ సోషల్ మీడియా వేదికగా ఓ ఫోటోని షేర్ చేస్తూ తనదైన శైలిలో విషెస్ తెలిపాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫోటో బాగా వైరల్ అవుతుంది. అలాగే సెలబ్రెటీలు, ఫ్యాన్స్ కూడా తమ సూపర్ స్టార్ సతీమణి నమ్రతకు సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ తెలుపుతూ కామెంట్స్ చేశారు.
Also Read: ఆ సంస్థపై ట్రోల్స్ చేస్తున్న మహేష్ ఫ్యాన్స్..!
ఇక మహేష్ ప్రస్తుతం కరోనా నుంచి కోలుకున్నాడు. సర్కారు వారి పాట కొత్త షెడ్యూల్ షూటింగ్ నిమిత్తం తన కుటుంబంతో కలిసి వచ్చే వారం నుంచి గోవా వెళ్లనున్నాడు. ఇక పుట్టినరోజు వేడుకలకు నమ్రతా శిరోద్కర్ దూరంగా ఉంది. రమేష్ బాబు మరణం మహేష్ కుటుంబాన్ని బాగా బాధ పెట్టింది. మహేష్ కూడా తన అన్నయ్య చావును జీర్ణయించుకోలేకపోయాడు.
Happy birthday NSG… You are my rock ♥️♥️♥️ Thank you for sharing my world with me.. 🤗🤗🤗 pic.twitter.com/YwjokokKtz
— Mahesh Babu (@urstrulyMahesh) January 22, 2022
[…] […]