మనల్ని ఎవరైనా గుర్తించాలంటే ఏదో ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలి. అది మంచి కానీ, చెడు కానీ నలుగురు దృష్టి మనవైపు మరలేలా చేసుకోవాలి. ముఖ్యంగా రాజకీయాలలో ఇది చాల అవసరం. అధికార పక్షాన ఉన్నా, ప్రతిపక్షాన ఉన్నా ఆరోపణలో… ఎదుటివారి ఆరోపణలకు గట్టి సమాధానాలు చెవుతూనో మీడియాలో కనబడుతూ ఉండేవారిని జనాలు బాగా గుర్తు పెట్టుకుంటారు. పార్టీల అధినాయకుల దృష్టిలో కూడా వారికి ప్రత్యేక స్థానం ఉంటుంది. ఒక్కోసారి గెలిచిన మరియు అధికారంలో ఉన్న పార్టీలో ఉన్న నేతలు కూడా వ్యతిరేక గళం, అసహనం అధినేతపై తెలియజేస్తారు. వీరి చర్యలు ప్రజలు మరియు ప్రతి పక్షాల దృష్టిని మరింత ఆకర్షిస్తాయి. అధికార పార్టీలో గెలిచిన ఎంఎల్ఏనో లేక ఎంపీనో సొంత పార్టీని తిట్టడం, ప్రశ్నించడం అరుదుగా జరిగే అంశం. అధికార పార్టీలో ఉంటూ అధినాయకుడుకి ఎదురుతిరిగి సమస్యలు తెచ్చుకోవాలని ఎవరూ అనుకోరు…కానీ వారికి ప్రత్యామ్నాయం, భద్రతకు భరోసా ఉన్నప్పుడు మాత్రమే ఈ సాహసానికి ఒడిగడతారు.
మూడు ప్రాంతాలను ముగ్గురికి పంచిన జగన్?
ఇంత సుదీర్ఘ వివరణ తరువాత మీకు ఖచ్చితంగా వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు గుర్తుకు వచ్చే ఉంటాడు. ఒక వారం రోజులుగా ఆంధ్రా రాజకీయాలలో రఘురామ కృష్ణం రాజు అనే పేరు హాట్ టాపిక్ మారింది. ఆయన ప్రెస్ మీట్ పెడితే ఏమి మాట్లాడుతారు అనే ఆసక్తి నేతలలో…సామాన్య ప్రజల్లో నెలకొంది. వైసీపీ ప్రభుత్వ పనితీరుతో మొదలుపెట్టిన ఆయన ఏకంగా పార్టీ మూలాలు దాని అస్తిత్వం, వ్యవస్థీకృత విధానాలు ప్రశ్నించే వరకు వెళ్లారు. ఓ సందర్భంలో వైసీపీ కాళ్ళ బేరానికి వస్తేనే నేను ఆ పార్టీలో చేరాను అని..పరుష వ్యాఖ్యలు చేశారు. కారణం ఏదైనా… ఆయన ఆశిస్తున్న ప్రయోజనం ఏదైనా కానీ, జగన్ కి విధేయుడిని అంటూనే ఆయనతో యుద్ధం ప్రకటించారు.
మద్యం ప్రియులకు ముచ్చెమటలు పట్టించిన న్యూస్ ఇదే..!
దీనిలో భాగంగానే ఆయన ఢిల్లీ వెళ్లి ఎలక్షన్ కమిషన్ మరియు బీజేపీ నేతలను కలిసి వైసీపీని భయపెట్టే ప్రయత్నం చేశాడు. తనపై ఎటువంటి చర్యలు తీసుకోవాలన్నా తనకు బీజేపీ అండ ఉందని చెప్పడమే రఘురామ కృష్ణం రాజు అసలు ఉద్దేశం. ఇంత చేసినా ఆయనకు జరిగిన ప్రయోజనం ఏమిటీ?. ధైర్యంగా జగన్ ని ఎదిరించి ప్రజల పక్షాన నిలిచాడు అనుకుందామంటే..ఆయన ఒక్క ప్రజా సమస్య గురించి మాట్లాడిన దాఖలాలు లేవు. ఇక బీజేపీతో స్నేహం వలన ఆయనకు పదవులు దక్కవు…ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ నాయకుడిగా అగ్రతాంబూలం కూడా అందదు. ఈయన ఎంపీగా కొనసాగే నాలుగేళ్లు అటు వైసీపీ దృష్టిలో నమ్మక ద్రోహిగా…ఇటు బీజేపీ దృష్టిలో అక్కరలేని మిత్రుడిగా మిగిలిపోవడం తప్ప…!