బీజేపీకి పూర్తి విధేయుడిగా మారిపోయిన బాబు..!

40ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం అని చెప్పుకొనే బాబు…గత మంతా లోపభూయిష్టమే. ప్రయోజనాలే పరమావధికగా సాగే ఆయన రాజకీయాలు విలువలు, నైతికతకు చాలా దూరం. అందితే కాళ్లు లేకపోతే జుట్టు పట్టుకొనే రకం. పదవుల కోసం పొత్తులు. ప్రయోజనాల కోసం కూటములు అనేది చంద్రబాబుకి తెలిసిన సిద్ధాంతం. తన ఈ సిద్ధాంతంతో ఏళ్లుగా ఆయనకు ప్రయోజనం చేకూరుతుండగా…అదే పద్దతిలో రాజకీయాలు చేస్తూ వస్తున్నాడు. గత ఎన్నికల ముందు కాంగ్రెస్ తో కూటమి కట్టి చంద్రబాబు ఎంతటి దిగగజారుడు […]

Written By: Neelambaram, Updated On : July 3, 2020 4:11 pm
Follow us on


40ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం అని చెప్పుకొనే బాబు…గత మంతా లోపభూయిష్టమే. ప్రయోజనాలే పరమావధికగా సాగే ఆయన రాజకీయాలు విలువలు, నైతికతకు చాలా దూరం. అందితే కాళ్లు లేకపోతే జుట్టు పట్టుకొనే రకం. పదవుల కోసం పొత్తులు. ప్రయోజనాల కోసం కూటములు అనేది చంద్రబాబుకి తెలిసిన సిద్ధాంతం. తన ఈ సిద్ధాంతంతో ఏళ్లుగా ఆయనకు ప్రయోజనం చేకూరుతుండగా…అదే పద్దతిలో రాజకీయాలు చేస్తూ వస్తున్నాడు. గత ఎన్నికల ముందు కాంగ్రెస్ తో కూటమి కట్టి చంద్రబాబు ఎంతటి దిగగజారుడు రాజకీయాలు చేస్తాడో నిరూపించాడు. ఆయన బీజేపీని విమర్శించడానికి, విభేదించడాని కారణం ఆయన అడిగినట్లు ఆర్థిక ప్యాకేజి ఇవ్వక పోవడమే.

మూడు ప్రాంతాలను ముగ్గురికి పంచిన జగన్?

బీజేపీ ప్రత్యేక హోదా అంశం తుంగలో తొక్కితే బాబు ప్యాకేజీకి ఒప్పుకున్నాడు. స్నేహం కొనసాగింత కాలం హోదాతో ఒరిగేదేముంది అన్నాడు. ప్యాకేజి ద్వారా హోదా కంటే మోడీ ఎక్కువ ప్రయోజనం చేకూర్చారు అన్నారు. ఇచ్చిన నిధులకు లెక్కలు అడగడంతో పాటు, కొత్త నిధులు ఆపేయడంతో బీజేపీతో బాబుకు చిక్కొచ్చిపడింది. కొన్నాళ్ళు బేరాలు చేసి నిధులు తెచుకున్నామని ప్రయత్నించి విఫలమైన బాబు మోడీపై తిరుగుబాటు ప్రకటించారు. నాలుగేళ్ళ పాలనలో ప్రజలకు చేసిందేమి లేదని గ్రహించి వెంటనే ఈ నేరాన్ని మోడిపైకి నెట్టాయలని, బీజేపీ నుండి విడిపోతున్నట్లు ప్రకటించారు. రెండు లక్షలకు పైగా అప్పు చేసిన బాబు ఐదేళ్ల పాలనలో కనీసం అమరావతి, పోలవరం పూర్తి చేయలేదు. మరి అన్ని లక్షల కోట్ల అప్పులు ఈ దార్శనికుడు ఎందుకు చేశాడో. దానికితోడు రూ. 50వేల కోట్ల వరకు పెండింగ్ బిల్లులు.

మద్యం ప్రియులకు ముచ్చెమటలు పట్టించిన న్యూస్ ఇదే..!

కాగా నేడు కాన్ఫరెన్స్ పెట్టిన చంద్రబాబు కరోనా కాలంలో రాష్ట్రాన్ని ఆదుకుంది బీజేపీ మాత్రమే అని వంత పాడుతున్నారు. దానికి రుజువుగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలు గుర్తు చేస్తున్నారు. కరోనా కష్టకాలంలో జగన్ ప్రజల్ని ఆదుకోవడంలో ఫెయిల్ అయ్యాడు అంటున్నారు. నేను ప్రతి కుటుంబానికి ఐదువేలు డిమాండ్ చేస్తే వెయ్యి ఇచ్చి చేతులు దులుపుకున్నారు అన్నారు. రాష్ట్రంలో జరిగే సంక్షేమమం అంతా కేంద్ర ప్రభుత్వ చలవే అని మోడీ భజన చేస్తున్నాడు. రాష్ట్రంలో కరోనా సమయంలో ప్రభుత్వం ఫెయిల్ అయ్యింది అంటున్న బాబు…దేశ వ్యాప్తంగా లక్షల్లో కరోనా కేసులు నమోదు అవుతుంటే మోడీని ఎందుకు ప్రశ్నించరు?. అది మోడీ వైఫల్యం కదా?జాతీయ పార్టీ నాయకుడు అని చెప్పుకొనే బాబు విమర్శ కేవలం ఏపీకే ఎందుకు పరిమితం అవుతుంది. బాబు అవకాశవాద రాజకీయం చూసిన ప్రజలు ఆయన్ని నమ్మడం మానేశారు.