https://oktelugu.com/

పబ్జి ఆటకు మంగళం?

టిక్‌ టాక్‌ తో స‌హా మొత్తం 59 చైనా యాప్స్‌ పై భార‌త ప్రభుత్వం నిషేధం విధించిన విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలో ఆ దేశ గేమింగ్ దిగ్గజం టెన్‌ సెంట్‌ కు కొత్త భయం పట్టుకుంది. ఇన్ని యాప్స్‌ ను ఒక్కసారిగా బ్యాన్ చేసిన భారత్ పబ్‌ జీ మొబైల్‌ ను కూడా నిషేధిస్తుందేమోనని వణికిపోతోంది. పబ్‌ జీ మొబైల్ ద్వారా భారత్‌ నుంచి వేల కోట్ల రూపాయలు టెన్‌ సెంట్ జేబులోకి చేరుతున్నాయి. అయితే […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 2, 2020 / 08:20 PM IST
    Follow us on


    టిక్‌ టాక్‌ తో స‌హా మొత్తం 59 చైనా యాప్స్‌ పై భార‌త ప్రభుత్వం నిషేధం విధించిన విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలో ఆ దేశ గేమింగ్ దిగ్గజం టెన్‌ సెంట్‌ కు కొత్త భయం పట్టుకుంది. ఇన్ని యాప్స్‌ ను ఒక్కసారిగా బ్యాన్ చేసిన భారత్ పబ్‌ జీ మొబైల్‌ ను కూడా నిషేధిస్తుందేమోనని వణికిపోతోంది. పబ్‌ జీ మొబైల్ ద్వారా భారత్‌ నుంచి వేల కోట్ల రూపాయలు టెన్‌ సెంట్ జేబులోకి చేరుతున్నాయి. అయితే ఇటీవల భారత్ నిషేధించిన చేసిన అప్లికేషన్ల జాబితాలో టెన్‌సెంట్‌కు చెందిన వియ్ చాట్ కూడా ఉంది. దీంతో తమ సంస్థకు చెందిన పబ్‌జీని కూడా భారత్ బ్యాన్ చేస్తుందేమోనని టెన్‌సెంట్ యాజమాన్యం భయపడిపోతోంది. ఒకవేళ అదే జరిగితే సంస్థకు వేల కోట్ల నష్టం వాటిల్లుతుంది. తిరిగి కోలుకోలేని దెబ్బ తగులుతుంది.

    మరోవైపు టిక్‌ టాక్ యాప్‌ ను భారత ప్రభుత్వం నిషేధించిన చేసిన తర్వాత స్వదేశీ యాప్ మిత్రోన్‌ దూసుకుపోతోంది. గూగుల్ ప్లే స్టోర్‌లో రెండు నెలల్లోనే కోటి డౌన్‌ లోడ్ల మైలురాయిని అందుకున్న మిత్రోన్ యాప్.. ఆ తర్వాత వారంలోనే 1.7 కోట్ల డౌన్‌ లోడ్లకు చేరుకోవడం విశేషం. యాప్‌ కు పాప్యులారిటీ పెరుగుతున్న నేపథ్యంలో రెండు వెంచర్ క్యాపిటలిస్ట్ సంస్థలు ‘3 వన్ 4’, ‘లెట్స్ వెంచర్’ల నుంచి నుంచి రెండు కోట్ల రూపాయలను సమకూర్చుకుంది. ఈ నిధులతో ప్రొడక్ట్ డెవలప్‌ మెంట్‌ ను మరింత వేగవంతం చేయనుంది. అంటే నైపుణ్యం ఉన్న కొత్త వారిని తీసుకోవడం, మౌలిక సదుపాయాల కల్పన, ఇండియన్ కంటెంట్ క్రియేటర్లతో ఎంగేజ్ కావడం వంటివి చేయనుంది. కంటెంట్ నిర్మాణంతోపాటు దేశీయ కంటెంట్ క్రియేటర్లపై దృష్టి సారిస్తామని ‘మిత్రోన్’ వ్యవస్థాపకుడు శివాంక్ అగర్వాల్ తెలిపారు.