https://oktelugu.com/

‘ఆత్మ నిర్భర్‌ భారత్‌’ అర్థాన్ని వివరించిన సీతారామన్!

కరోనా విజృంభణ నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా దేశంలో నెలకొన్న విపత్కర పరిస్థితుల వల్ల నష్టపోయిన వారికి, ఉపాధి కోల్పోయిన వారికి చేయూతనందించేందుకు ప్రధాని మోడీ భారీ ఆర్థిక ప్యాకేజీ ప్రకటించారు. ఆత్మ నిర్భర్‌ భారత్‌ అభియాన్‌ పేరిట రూ.20లక్షల కోట్లతో ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ఆయన ప్రకటించారు. అయితే ఈ ప్యాకేజీ వివరాలను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ వెల్లడించారు. ఈ క్రమంలోనే ఆమె మోడీ ప్రస్తావించిన ‘ఆత్మ నిర్భర్‌ భారత్‌ అభియాన్‌’ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : May 13, 2020 / 06:35 PM IST
    Follow us on

    కరోనా విజృంభణ నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా దేశంలో నెలకొన్న విపత్కర పరిస్థితుల వల్ల నష్టపోయిన వారికి, ఉపాధి కోల్పోయిన వారికి చేయూతనందించేందుకు ప్రధాని మోడీ భారీ ఆర్థిక ప్యాకేజీ ప్రకటించారు. ఆత్మ నిర్భర్‌ భారత్‌ అభియాన్‌ పేరిట రూ.20లక్షల కోట్లతో ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ఆయన ప్రకటించారు.

    అయితే ఈ ప్యాకేజీ వివరాలను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ వెల్లడించారు. ఈ క్రమంలోనే ఆమె మోడీ ప్రస్తావించిన ‘ఆత్మ నిర్భర్‌ భారత్‌ అభియాన్‌’ పథకం యొక్క అర్థం, విశిష్టతను ఆమె వివరించారు. అభివృద్ధిని ఆకాంక్షిస్తూ.. స్వయం సమృద్ధితో కూడిన భారత్‌ నిర్మాణం కోసమే భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించినట్లు నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలతో చర్చించిన తర్వాతే ప్రధాని నరేంద్ర మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.

    ‘ఆత్మ నిర్భర్‌ భారత్‌’ అంటే స్వయం ఆధారిత భారత్‌ అని.. ఐదు మూల స్థంభాల ఆధారంగా దీనిని రూపొందించినట్లు పేర్కొన్నారు. స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యమిస్తూ.. లోకల్‌ బ్రాండ్లను విశ్వవ్యాప్తం చేయడమే తమ లక్ష్యమన్నారు. కరోనాతో కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థను పునరుత్తేజపరిచే దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన.. ‘ఆత్మ నిర్భర్‌ భారత్‌ అభియాన్‌’ పథకం గురించి నిర్మల బుధవారం మీడియాతో మాట్లాడాతూ.. దేశ వ్యాపార వర్గాల్లో ఆత్మవిశ్వాసం నింపే అద్భుతమైన పథకం అని వ్యాఖ్యానించారు.

    తమ ప్రభుత్వం గతంలో తీసుకువచ్చిన సంస్కరణలు.. ఇప్పుడు మంచి ఫలితాలనిస్తున్నాయని నిర్మలా సీతారామన్‌ అన్నారు. బ్యాంక్ అకౌంట్ల కారణంగా కరోనా కష్టకాలంలో.. పేదల అకౌంట్లలోకి నేరుగా నగదు బదిలీ చేయగలిగామని పేర్కొన్నారు. కోట్లాది మంది ప్రజలకు ధాన్యం, ఉచిత సిలిండర్లు అందజేశామని తెలిపారు. ఇప్పటి వరకు గరీబ్ కళ్యాణ్‌ ప్యాకేజీ ద్వారా ఆర్థిక ఉద్దీపన అమలు చేశామని.. స్వయం ఆధారిత భారత్‌ కు కావాల్సిన పునాదులు ఇప్పటికే మోదీ సర్కారు పూర్తి చేసిందని వెల్లడించారు. పదిహేను రకాల ఉద్దీపన పథకాలను ఈరోజు ప్రకటించబోతున్నామని హర్షం వ్యక్తం చేశారు. చిన్న మధ్యతరహా పరిశ్రమలకు… ప్రభుత్వ గ్యారంటీతో మూడు లక్షల కోట్ల రూపాయల అప్పులు ఇస్తామని స్పష్టం చేశారు. అక్టోబర్ 31 వరకు ఎంఎస్‌ఎంఈలు ఈ పథకం ద్వారా అప్పులు తీసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు.