ఎంఎస్‌ఎంఈ లకు రూ.3 లక్షల కోట్లు!

కరోనా వ్యాప్తి కారణంగా లాక్ డౌన్ నేపథ్యంలో తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ఎలాంటి గ్యారంటీ లేకుండా రూ.3లక్షల కోట్లు రుణాలుగా ఇవ్వనున్నట్లు ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. కరోనా సంక్షోభ సమయంలో దేశం తీవ్ర ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయింది. దేశ అభివృద్ధిని ఆకాంక్షిస్తూ.. స్వయం సమృద్ధితో కూడిన భారత్‌ నిర్మాణం కోసమే రూ.20 లక్షల కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించినట్లు మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. అన్ని […]

Written By: Neelambaram, Updated On : May 13, 2020 6:13 pm
Follow us on

కరోనా వ్యాప్తి కారణంగా లాక్ డౌన్ నేపథ్యంలో తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ఎలాంటి గ్యారంటీ లేకుండా రూ.3లక్షల కోట్లు రుణాలుగా ఇవ్వనున్నట్లు ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. కరోనా సంక్షోభ సమయంలో దేశం తీవ్ర ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయింది. దేశ అభివృద్ధిని ఆకాంక్షిస్తూ.. స్వయం సమృద్ధితో కూడిన భారత్‌ నిర్మాణం కోసమే రూ.20 లక్షల కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించినట్లు మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలతో చర్చించిన తర్వాతే ప్రధాని నరేంద్ర మోడి ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.

ఈ రోజు (బుధవారం) సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. సూక్ష్మ, మధ్య, లఘు, కుటీర పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈ)కు రూ.3లక్షల కోట్లు ఎలాంటి పూచీకత్తు లేకుండా రుణాలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు.

ఎంఎస్‌ఎంఈలకు ఆరు అంశాల్లో ఆర్థిక ప్యాకేజీతో ప్రయోజనం చేకూరనుంది. తీవ్రమైన రుణ ఒత్తిడిలో ఉన్న ఎంఎస్‌ఎంఈలకు రూ.20వేల కోట్లు; ఎంఎస్‌ఎంఈల్లో ఈక్విటీ పెట్టుబడుల కోసం రూ.50వేల కోట్లు కేటాయించారు. 12 నెలల మారటోరియంతో ఈ రుణాలు మంజూరు చేయనున్నట్లు సీతారామన్‌ ప్రకటించారు.