చిత్తూరులో అధికారుల నిర్వాకం..!

చిత్తూరు జిల్లాలో అధికారుల నిర్లక్ష్యంతో దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. వివరాలోకి వెళితే జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయిన తిరుపతి సమీపంలోని వికృతమాల క్వారంటైన్ సెంటర్ లో కోవిడ్ 19 బాధితులు చికిత్స పొందుతున్నారు. వీరికి ఇటీవల కరోనా పరీక్షలు నిర్వహించారు. పాజిటివ్ వచ్చిన నలుగురు మహిళలను నెగిటివ్ వచ్చిదని భావించి పొరపాటున నెగిటివ్ వచ్చిన ఇతర మహిళలతో కలిపి ఇంటికి పంపించారు. తరువాత విషయం తెలుసుకుని, పాజిటివ్ వచ్చిన నలుగురు మహిళలను వెనక్కి రప్పించారు. ఈ విషయం […]

Written By: Neelambaram, Updated On : May 13, 2020 6:45 pm
Follow us on

చిత్తూరు జిల్లాలో అధికారుల నిర్లక్ష్యంతో దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. వివరాలోకి వెళితే జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయిన తిరుపతి సమీపంలోని వికృతమాల క్వారంటైన్ సెంటర్ లో కోవిడ్ 19 బాధితులు చికిత్స పొందుతున్నారు. వీరికి ఇటీవల కరోనా పరీక్షలు నిర్వహించారు. పాజిటివ్ వచ్చిన నలుగురు మహిళలను నెగిటివ్ వచ్చిదని భావించి పొరపాటున నెగిటివ్ వచ్చిన ఇతర మహిళలతో కలిపి ఇంటికి పంపించారు.

తరువాత విషయం తెలుసుకుని, పాజిటివ్ వచ్చిన నలుగురు మహిళలను వెనక్కి రప్పించారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ నారాయణ భరత్ గుప్తా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు రాష్ట్రంలో బుధవారం నమోదైన పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా 11 కేసులు చిత్తూరు జిల్లాలోనే ఉన్నాయి. ఎప్పటి వరకూ జిల్లాలో 142 మంది వైరస్ బారిన పడ్డారు. తమిళనాడు రాష్ట్ర సరిహద్దు జిల్లా కావడంతో సరిహద్దు ప్రాంతాల్లో రైతులు కోయంబేడు మార్కెట్ కు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. దీంతో వైరస్ వ్యాప్తి చెందుతుందని భావిస్తున్నారు. రాష్ట్రంలో కోయంబేడు వెళ్లి వచ్చిన వారినందరిని క్వారంటైన్ కు తరలించాలని పోలీసుల శాఖ ఉన్నతాధికారులు ఆదేశించారు.