చెలిమి అంటూనే చైనా దొంగదెబ్బ తీస్తోందా?

చైనా అంటేనే నకిలీ వస్తువులకు కేరాఫ్‌. యాజ్‌ టీజ్‌ డూప్‌ తీసుకురావడంలో తనకు తానే సాటే. కానీ.. మాటల్లోనే అన్నీ డూపేనని నిరూపించుకుంటోంది చైనా. నిత్యం భారత్‌తో ఒప్పందాలు చేసుకోవడం.. వాటిని విస్మరించడం ఆ దేశానికి అలవాటైంది. పంచశీల ఒప్పందంపై సంతకాలు చేసి పదేళ్లైనా కాకుండానే 1962లో వాటికి తూట్లు పొడిచింది. మొన్నటికి మొన్న చైనా–బ్రిటన్‌ ఒప్పందాన్ని తుంగలో తొక్కి హాంకాంగ్‌ను గుప్పిట్లో బంధించింది. ఇలా చైనా కథలు అన్నీఇన్నీ కావు. ఇప్పుడు తాజాగా పాంగాంగ్‌ సరస్సు […]

Written By: NARESH, Updated On : September 13, 2020 5:07 pm

china

Follow us on

చైనా అంటేనే నకిలీ వస్తువులకు కేరాఫ్‌. యాజ్‌ టీజ్‌ డూప్‌ తీసుకురావడంలో తనకు తానే సాటే. కానీ.. మాటల్లోనే అన్నీ డూపేనని నిరూపించుకుంటోంది చైనా. నిత్యం భారత్‌తో ఒప్పందాలు చేసుకోవడం.. వాటిని విస్మరించడం ఆ దేశానికి అలవాటైంది. పంచశీల ఒప్పందంపై సంతకాలు చేసి పదేళ్లైనా కాకుండానే 1962లో వాటికి తూట్లు పొడిచింది. మొన్నటికి మొన్న చైనా–బ్రిటన్‌ ఒప్పందాన్ని తుంగలో తొక్కి హాంకాంగ్‌ను గుప్పిట్లో బంధించింది. ఇలా చైనా కథలు అన్నీఇన్నీ కావు. ఇప్పుడు తాజాగా పాంగాంగ్‌ సరస్సు పైనా భారత్‌ ఇలానే మోసం చేయాలని చూసింది. ఆప్యాయంగా ముందుకొచ్చి వెనుకాల నుంచి సరస్సుపై కన్నేసింది. భారత్‌ ముందే పసిగట్టడంతో చైనా తోక ముడిచింది.

Also Read: అమిత్ షా ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందా?

చైనాకు చెందిన కమాండర్లు చుషూల్‌ వద్ద సైనికాధికారులతో హాట్‌లైన్‌లో చర్చలు జరిపారు. ముందుగా చైనా ఆఫీసర్లే భారత్‌ అధికారులతో మాట్లాడగా.. రాత్రివేళలో ఇరుపక్షాల దళాలు గస్తీలు నిర్వహించకూడదంటూ మాట్లాడుకొచ్చారు. దీంతో అప్పుడే భారత కమాండర్లకు అనుమానం వచ్చింది. గతంలో వారు ఏం చెప్పినా వాటిని పాటించలేదు. గల్వాన్‌ వద్ద కూడా ఇలానే మోసపూరితంగా వ్యవహరించి గొడవకు దారితీసింది.

చైనా వైఖరిపై ముందు నుంచీ అనుమానంగానే ఉన్న భారత కమాండర్లు ఆగస్టు 28న రాత్రి తొలిసారి మాల్డోలో సాయుధ వాహనాల కదలికను గుర్తించాయి. దీంతో డ్రోన్లను రంగంలోకి దించి పీఎల్‌ఏ కదలికలపై నిఘా పెంచారు. డ్రాగన్‌ దళాలు ఎల్‌ఏసీ వైపుగా కదులుతున్నట్లుగా గుర్తించారు. వెంటనే భారత ఎస్‌ఎఫ్‌ఎఫ్‌ దళాలు రంగంలోకి దిగి చుషూల్‌లోని కీలకమైన శిఖరాలపై పట్టు సాధించాయి. దీంతో చైనా బలగాలు అక్కడి నుంచి వెనుదిరిగాయి. ఆ తర్వాత భారత దళాలు పాంగాంగ్‌ సరస్సు వద్ద ఉత్తర భాగంలోని ఫింగర్‌‌ 4 సమీపంలోని కీలక స్థానాలకూ చేరుకున్నాయి.

Also Read: ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్న్ మళ్లీ స్టార్ట్

ఈ ఘటనతో కొంత ఘర్షణ వాతావరణం ఏర్పడగా చైనా దళాలు మోహరింపులో స్పీడ్‌ పెంచాయి. ఆగస్టు 30 నుంచి స్పంగూర్‌‌ గ్యాప్‌ నుంచి గురాంగ్‌హిల్‌, మగర్‌‌హిల్‌ సమీపంలోకి చేరుతున్నాయి. దీంతో భారత్‌ కూడా డ్రాగన్‌కు దీటుగా దళాలను అక్కడికి పంపించింది.