AP Senior Leaders: వారంతా హేమాహేమీలు. దశాబ్దాలుగా రాజకీయాలను శాసించిన కుటుంబాలు వారివి. పదవులు వారికి కొత్త కాదు. ఎమ్మెల్యే, ఎంపీ, అమాత్య పదవులు సైతం అలంకరించారు. అటువంటి వారు ఉన్నట్టుండి తెరమరుగయ్యారు. ప్రధానంగా ఉభయ గోదావరి జిల్లాకు చెందిన సీనియర్ నేతలు రాష్ట్ర రాజకీయాలను శాసించారు. అధికార స్థానం మారినా వీరి హవా చెదిరేదే కాదు. సుదీర్ఘ కాలంపాటు కాంగ్రెస్, తెలుగుదేశంతో సహా మిగతా పార్టీల్లో ఉన్న సీనియర్లు ఎందరో మూడేళ్లుగా రాజకీయ, వ్యక్తిగత కారణాలతో సైలెంట్ అయ్యారు. వయోభారంతో కొందరు.. రాజకీయాల్లో ఇమడలేక మరికొందరు పక్కకు తప్పుకున్నారు. సుదీర్ఘ కాలం పాటు పార్లమెంటు సభ్యుడుగా ఓ వెలుగు వెలిగిన కావూరి సాంబశివరావు కొన్నాళ్ళ క్రితం కాంగ్రెస్‌ను వీడి కమల దళంలో చేరారు. తన పాత అనుచరవర్గాన్ని సైతం బీజేపీలో చేర్చేందుకు ప్రయత్నించారు. తన కంపెనీ పరం గా ఒడిదుడుకులు ఎదురైనా తట్టుకుని నిలబడ్డారు. ఈ క్రమంలోనే బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీలో కొనసాగారు.
కొద్ది మాసాలుగా అనారోగ్యంతో బాధప డుతూ క్రియాశీలక రాజకీయాలకు దూరమయ్యారు. హైదరాబాద్‌లోని తన ఇంటి వద్ద చికిత్స పొందుతున్నారు. కాంగ్రెస్, తెలుగుదేశంలలో ఏలూరు నుంచి ఢిల్లీ వరకు ఎగబాకిన మాగంటి బాబుది దాదాపు ఇదే పరిస్థితి. ఏడా దిలోపే ఇద్దరు కుమారులను కోల్పోయి ఆయన మానసికం గా కొంత ఒత్తిడిని ఎదుర్కొన్నారు.
Also Read: KCR vs BJP: కేసీఆర్ ను అధికారంలోంచి దించడం బీజేపీకి సాధ్యమేనా?
క్రియాశీల రాజకీయాల కు దూరంగా ఉన్నారు. గడిచిన ఏడాదిన్నరగా ఆయన తెలుగుదేశం వ్యవహారాల్లో ఏ మాత్రం పాలు పంచుకోవ డం లేదు. కోల్పోయిన కుమారుల సంవత్సరీకాలు పూర్త యిన తరువాతే తిరిగి రాజకీయాల్లో పుంజుకుంటారనేది ఆయన అనుచరుల లు చెబుతున్నారు.
ఎమ్మెల్యేగా, ఎంపీగా ఒకప్పుడు కాంగ్రెస్‌లో అందరి మన్న నలు పొంది టీటీడీ చైర్మన్‌గా రాణించి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన కనుమూరి బాపిరాజు ఇప్పటికీ కాంగ్రెస్‌లోనే ఉన్నారు. అయినప్పటికీ క్రియాశీల రాజకీయా లకు ఆయన అంటీముట్టనట్టుగానే మిగిలారు. తన స్వగ్రా మం అయి భీమవరంలో కొన్నాళ్ళు, మిగతా ప్రాంతాల్లో మరికొన్నాళ్ళు ఉంటున్నారు. ఒకప్పుడు నరసాపురం ఎంపీ గా ఆయనను వైసీపీ ప్రతిపాదించినా దీనికి ఆయన సున్ని తంగా తిరస్కరించారు. పార్టీలు మారడం తనకు ఇష్టం లేదన్నట్టు బాపిరాజు వ్యవహరించారు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జిల్లా రాజకీయాలను శాసించిన మాజీ మంత్రి వట్టి వసంతకుమార్ గడిచిన పదేళ్లుగా క్రియాశీలక రాజకీయాలకు దూరంగానే ఉన్నారు. ఇప్పుడు ఆయన వైజాగ్‌లో ఉంటున్నారు. అయిన ప్పటికీ ఆయనంటే అభిమానం ఉన్న వారంతా రాజకీయా ల్లో ఎలాంటి పాత్ర పోషించాలో ఆయన సలహాలను స్వీకరిస్తూనే ఉన్నారుఏలూరు మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. కైకలూరులో సీనియర్ నేత డాక్టర్ కామినేని శ్రీనివాసరావు కమలదళంలోనే ఉన్నారు.
జనసేన వైపు చూపు..
అయితే ఇందులో ఎక్కువ మంది ఇప్పడు జనసేన వైపు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ క్లీన్ ఇమేజ్ ఉండడంతో జనసేన సరైన వేదికగా భావిస్తున్నారు. చివరి సారిగా జనసేన పార్టీ నుంచి బరిలో దిగి గౌరవప్రదంగా రిటైర్మెంట్ కావాలని భావిస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో మళ్లీ యాక్టివ్ కావాలని భావిస్తున్నారు. ఇప్పటికే జనసేన నేతలతో కొంతమంది టచ్ లో ఉన్నారు. కొందరైతే జనసేనకు అవసరమైన సలహాలు, సూచనలు అందిస్తున్నట్టు తెలుస్తోంది. మరో ఆరు నెలల తరువాత దీనిపై మరింత స్పష్టత వచ్చే అవకాశముంది.
Also Read:Congress Party: కాంగ్రెస్ కోలుకుంటుందా? పునర్వైభవం సాధ్యమేనా?