AP High Court: చేతిలో అధికారం ఉంది కదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే కుదరదు. మొన్నటికి మొన్న ఎనిమిది మంది ఐఏఎస్ లకు సేవా శిక్ష విధించిన న్యాయ స్థానం కోర్టు ధిక్కారణకు పాల్పడిన మరో ఐఏఎస్ పై కొరడా ఝుళిపించింది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి వీధి వ్యాపారులను ఖాళీ చేయించిన వ్యవహారంలో గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్(జీవీఎంసీ) పూర్వకమిషనర్ ఎం. హరినారాయణ్‌కు మూడు నెలల సాధారణ జైలు శిక్షతో పాటు రూ.2,000 జరిమానా విధించింది. వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న విశాఖ న్యూపోర్ట్ పోలీస్ స్టేషన్ సీఐ సోమశేఖర్, గాజువాక మాజీ ఎమ్మెల్యే పి. శ్రీనివాస్ పై కోర్టు ధిక్కరణ కేసు మూసివేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ఇటీవల తీర్పు ఇచ్చారు. హరినారాయణ తరఫు న్యాయవాది అభ్యర్థన మేరకు అప్పీల్ వేసుకొనేందుకు వీలుగా తీర్పు అమలును ఆరు వారాలు సస్పెండ్ చేశారు. అప్పీల్ దాఖలు చేయడంలో విఫలమైనా, అప్పీల్‌పై ధర్మాసనం స్టే విధించకపోయినా జూన్ 16న సాయంత్రం 5 గంటలులోగా రిజిస్ట్రార్ (జ్యుడీషియల్) ముందు సరెండర్ కావాలని ఎం.హరినారాయణ్‌ను ఆదేశించారు.
అసలేం జరిగిందంటే?
విశాఖలోని పెదగంట్యాడ జంక్షన్ వద్ద బీసీ రోడ్డులో తమ సంఘం సభ్యుల నిర్వహిస్తున్న 70 షాపులను జీవీఎంసీ అధికారులు తొలగిస్తున్నారని పే ర్కొంటూ శ్రీపెంటమాంబ గ్రామదేవత ఆర్.హెచ్. కాలనీ, పెదగంట్యాడ కాయగూరలు మరి యు చిల్లర వ్యాపారాల సంఘం ఉపాధ్యక్షురాలు కె.కౌసల్య 2017 లో హైకోర్టును ఆశ్రయించారు. స్ట్రీట్ వెండార్ చట్టం 2014 మేరకు కార్పొరేషన్ తమకు వెండార్ కార్డులు జారీ చేసిందని, ఎప్పటికప్పుడు పన్నులు చెల్లిస్తున్నామని అందులో పేర్కొన్నారు. తమను ఖాళీ చేయిస్తే జీవనోపాధి కోల్పోతామని, అధికారులను నిలువరించాలని కోరారు.
Also Read: AP Senior Leaders: ఆ సీనియర్ నాయకులకు ఏమైంది?..వారి సైలెంట్ వెనుక కారణాలేంటి?
ఆ వ్యాజ్యాన్ని విచారించిన కో ర్టు చట్ట నిబంధనలు అనుసరించకుండా పిటిషనర్ సంఘం విషయంలో జోక్యం చేసుకోవద్ద ని జీవీఎంసీ అధికారులను 2017 జూన్ 21న ఆదేశించింది. అయితే కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ.. 2018 జనవరి 29న ఉదయం 10 గంటల సమయంలో జీవీఎంసీ అధికారులు పెద్ద ఎత్తున పోలీసు బలగాలతో వచ్చి చిల్లర దుకాణాలను, బడ్డీ కొట్లను తొలగించారని పేర్కొంటూ ధిక్కరణ వ్యాజ్యం వేశారు. పిటిషనర్ సంఘం తరఫున న్యాయవాది గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ నిబంధనలు ప్రస్తావిస్తూ వాదనలు వినిపించారు. అదే సమయంలో పిటీషనర్లు రోడ్డ మార్జిన్ ను ఆక్రమించి షాపులు ఏర్పాటుచేశారని.. దానిని తొలగించాలని నోటీసులు జారీచేశామే తప్ప.. కోర్టు ఆదేశాలను ధిక్కరించలేదని కమిషనర్ పేర్కొన్నారు. ఇరువైపుల వా దనలు పరిగణలోకి తీసుకున్న జస్టిస్ బట్టు దేవానంద్.. స్ట్రీట్ వెండార్ చట్టం-2014 నిబంధనలు పాటించకపోవడం, నోటీసుల జారీ ప్రక్రియలో జాప్యం, కోర్టు ఆదేశాలను ధిక్కరించడం తదితర కారణాలు చూపుతూ జీవీఎంసీ కమిషనర్ హరినారాయణ్‌పై శిక్ష విధించారు. ఆయన్ను బాధ్యుడి గా తేలుస్తూ శిక్ష ఖరారు చేశారు.
Also Read:Amit Shah: అంతర్గత నివేదికలతో అమిత్ షా కీలక దిశానిర్ధేశం