https://oktelugu.com/

Bandi Sanjay Padayatra: బండి పాదయాత్ర.. ఏం జరుగుతుందో..

Bandi Sanjay Padayatra: బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) పాదయాత్ర (Padayatra) చేపట్టాలని నిర్ణయించుకున్నారు. మొదట ఆగస్టు 9న ప్రారంభించాలని నిర్ణయించుకున్నా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) ప్రజా ఆశీర్వాద యాత్ర చేపట్టడంతో వాయిదా వేసుకున్నారు. తరువాత ఈనెల 24న తలపెట్టాలని భావించినా ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కల్యాణ్ సింగ్ మరణంతో మళ్లీ వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో తిరిగి ఈనెల 28న ప్రారంభించాలని తలపించింది. దీంతో దీనికి ఏర్పాట్లు […]

Written By: , Updated On : August 27, 2021 / 03:04 PM IST
Follow us on

Bandi Sanjay Padayatra fromBandi Sanjay Padayatra: బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) పాదయాత్ర (Padayatra) చేపట్టాలని నిర్ణయించుకున్నారు. మొదట ఆగస్టు 9న ప్రారంభించాలని నిర్ణయించుకున్నా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) ప్రజా ఆశీర్వాద యాత్ర చేపట్టడంతో వాయిదా వేసుకున్నారు. తరువాత ఈనెల 24న తలపెట్టాలని భావించినా ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కల్యాణ్ సింగ్ మరణంతో మళ్లీ వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో తిరిగి ఈనెల 28న ప్రారంభించాలని తలపించింది. దీంతో దీనికి ఏర్పాట్లు కూడా చకాచకా చేస్తున్నారు. పాదయాత్ర ఏర్పాట్ల కోసం 30 కమిటీలను నియమించి సన్నాహాలు చేస్తున్నారు.

తొలి రోజు భాగ్యలక్ష్మి ఆలయం నుంచి పాదయాత్ర ప్రారంభమై మూడు దశలుగా కొనసాగుతోందని చెబుతున్నారు. దీనికి ప్రజా సంగ్రామ యాత్రగా నామకరణం చేశారు. పాదయాత్రలో ప్రజలకు భరోసా ఇచ్చేందుకు నిర్ణయాలు తీసుకుంటున్నారు. కానీ బండి యాత్ర సబబుగా సాగుతుందా లేదా అనే అనుమానాలు అందరిలో నెలకొన్నాయి. హుజురాబాద్ ఉప ఎన్నిక వరకు దశల వారీ పాదయాత్ర చేపడతానని బండి ఇదివరకే ప్రకటించారు. దీంతో పాదయాత్ర ఉప ఎన్నికల వరకు కొనసాగే వీలుందని తెలుస్తోంది.

బీజేపీలో నెలకొన్న అంతర్గత విబేదాల కారణంగా బండి సంజయ్ పాదయాత్ర నిర్వహణపై అందరిలో సందేహాలు వస్తున్నాయి. పార్టీలోని అగ్రనేతలే అడ్డుకునేందుకు వెనుక నుంచి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే పాదయాత్రలో జనం కనిపించకపోతే అధిష్టానానికి ఫిర్యాదులు కూడా అందే వీలున్నందున అన్ని రకాలుగా బేరీజు వేసుకుని పాదయాత్రను సజావుగా సాగేందుకు బండి సంజయ్ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నారు. పార్టీ అధ్యక్షుడిగా అన్ని కార్యక్రమాలు చూసుకోవాల్సిన బాధ్యత ఉన్నందున ఆయన మార్గాలు వెతుకుతున్నారు.

బండి సంజయ్ పాదయాత్రను పార్టీలోని కీలక వ్యక్తులే ఆపాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని పార్టీ నేతలే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో శనివారం నుంచి ప్రారంభమయ్యే పాదయాత్ర విజయవంతం కోసం అందరు కలిసి రావాలని పిలుపునిస్తున్నారు. దీంతో పాదయాత్రను సక్సెస్ చేసి ప్రజల్లో విశ్వాసం పెంపొందేలా చూడాల్సిన నాయకులపై ఉందని చెబుతున్నారు. రాబోయే ఎన్నికలకు పార్టీని బలోపేతం చేయాలని సూచిస్తున్నారు. పార్టీ ప్రతిష్ట ఇనుమడించేలా చేయాల్సిన నాయకత్వం తమ కార్యకలాపాలు విస్తరించాలని యోచిస్తోంది. ఇందులో భాగంగా నేతల్లో ఆత్మస్థైర్యం నింపేలా చూసేందుకు బండి ప్రయత్నాలు చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామే అన్న రీతిలో తమ బలం చూపించాలని భావిస్తున్నారు.