2021 Roundup: 2021 ఏడాది మరొక వారం రోజుల్లో పూర్తి అవ్వబోతుంది. అయితే ఈ ఏడాదిలో సింహభాగం విషాదాలు ఉన్నాయి.. అయినా కొన్ని ఊరటనిచ్చే విషయాలు మాత్రం జరిగాయి. కరోనా మహమ్మారి కి కళ్లెం వేసే టీకా కూడా కనిపెట్టింది ఈ ఏడాది లోనే.. ఇంకా ఒలంపిక్స్ లో స్వర్ణం సాధించింది కూడా ఈ ఏడాది లోనే.. ఇదే సమయంలో చాలా విషాదాలు కూడా జరిగాయి.. అవేంటో క్లుప్తంగా తెలుసుకుందాం..
కరోనా వ్యాక్సిన్ పంపిణీ : కరోనా వచ్చిన సంవత్సరం తర్వాత ఈ ఏడాది జనవరిలో వాక్సినేషన్ ను స్టార్ట్ చేసారు. జనవరి 16 నుండి కరోనా టీకాను పంపిణీ చేయడం స్టార్ట్ చేసారు.
సెకండ్ వేవ్ : కరోనా తగ్గింది అని ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో మళ్ళీ సెకండ్ వేవ్ తో విలయతాండవం సృష్టించింది. ఏప్రిల్, మే నెలల్లో సుమారు 1 లక్ష 69 వేళా మంది మరణించారు. ఆక్సిజన్ అందక చాలా మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు.
రైతుల మార్చ్ : ఈ ఏడాది ఎక్కువ విషాదాలు మాత్రమే చోరు చేసుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు సాగు చట్టాలను రద్దు చేయాలనీ రైతులు గణాంతంత్ర దినోత్సవానికి ఢీల్లీ కి ట్రాక్టర్ లతో మార్చ్ చేపట్టారు. ఈ క్రమంలో లాఠీ ఛార్జ్ జరిగింది. అంత భద్రత సిబ్బందిని కూడా ;లెక్కచేయకుండా రైతులు ఎర్రకోట ఎక్కారు. దీంతో ఎర్రకోట పైన కలకలం రేగింది.
ప్రధాని క్షమాపణలు : సాగు చట్టాల రద్దు, కనీస మద్దతు చట్టబద్ధ హామీ, ఇతర డిమాన్లతో ధర్నా చేసిన రైతులు అనుకున్న డిమాండ్ లను సాధించారు. నవంబర్ లో నరేంద్ర మోడీ తన ప్రసంగంలో రైతులకు క్షమాపణలు చెప్పారు.
ప్రకృతి విలయతాండవం : అసలే కరోనా తో దేశ ప్రజలు అల్లాడి పోతుంటే మరొక పక్క ప్రకృతి కూడా మానవులకు పరీక్ష పెట్టింది. ఉత్తరాఖండ్ ఛమోలీ సమీపం లోని హిమానీనదం బ్రేక్ కావడంతో వాటర్ ఫోర్స్ గా వచ్చి 200 మంది మిస్సయ్యారు. మరొక నెల రోజుల వ్యవధి లోనే తుఫాన్లు రావడంతో ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, బీహార్ లో వర్షాలు ముంచెత్తి జనజీవనం స్తంభించి పోవడమే కాకుండా జన నష్టం కూడా వాటిల్లింది.
22 మంది జవాన్ల వీర మరణం : ఛతీస్ ఘడ్ బీజాపూర్ లో ఈ ఏడాది ఏప్రిల్ లో మావోయిస్టు నేత సారథ్యంలో ఒక మావోయిస్టు గుంపు ఉందని సమాచారం అందుకున్న భద్రత బలగాలు అడవి లోపలికి వెళ్ళింది.. అప్పుడే భీకర ఎంకౌంటర్ జరిగింది. ఇందులో 22 మంది జవాన్ల వీర మరణం పొందారు.
నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్ : భారత క్రీడాకారుడు నీరజ్ చోప్రా ఒలంపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించి 87.5 మీటర్ల దూరం దిగ్విజయంగా బల్లేన్ని విసిరి ఆయన మెడల్ సాధించారు.
ఎయిర్ ఇండియా : టాటా సన్స్ ఎట్టకేలకు వారు స్థాపించిన విమాన సంస్థను తిరిగి సాధించు కున్నారు. ప్రభుత్వం నుండి 100 శాతం ఎయిర్ ఇండియా స్టేక్ ను సంపాదించుకుంది. ఎయిర్ ఇండియా సంస్థను టాటా లు 1932 లో స్థాపించారు. దీన్ని కేంద్రం 1953లో జాతీయం చేసింది.
పౌరులపై కాల్పులు : నాగాలాండ్ లో ఉగ్రవాదులు కోల్ మైనింగ్ లో పని చేస్తున్న కార్మికులపై ఫైరింగ్ చేసాయి. ఆ కాల్పుల్లో ఆరుగురు పౌరులు మరణించారు. ఈ ఘటనలో మరొక ఎనిమిది మంది పౌరులు భద్రత బలగాల కాల్పుల్లో మరణించినట్టు తెలుస్తుంది. ఈ ఘటన ఆందోళనకు దారి తీసింది.
Also Read: 2021 Political Roundup: ఈ ఏడాది దేశంలో జరిగిన అతిపెద్ద ఘటనలివీ
బిపిన్ రావత్ మరణం : ఈ ఏడాదిలో మరొక విషాద ఘటనగా మిగిలి పోయింది ఈయన మరణం. తమిళనాడులోని కూనూరు సమీపంలో ఎయిర్ ఫోర్స్ హెలికాఫ్టర్ క్రాష్ అయినా ఘటనలో సీనియర్ మోస్ట్ ఆఫీసర్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక రావత్ తో పాటు 12 మంది మరణించారు.
Also Read: 2021 Tollywood Musical Hits : టాలీవుడ్ మ్యూజికల్ హిట్స్