https://oktelugu.com/

Hyderabad: హైదరాబాద్ లో లేక్ వ్యూ క్యాంప్ ఆఫీసు ముస్తాబులో ఆంతర్యమేమిటో?

Hyderabad: ఆంధ్రప్రదేశ్ సీఎం క్యాంపాఫీస్ ను ముస్తాబు చేస్తున్నారు. ఏపీ విభజన సమయంలో ఆ స్టేట్ కు కేటాయించిన భవనాలను తరువాత కాలంలో తెలంగాణకు అప్పగించినా లేక్ వ్యూ గెస్ట్ హౌస్ ను మాత్రం ఇవ్వలేదు. దీంతో ప్రస్తుతం దాన్ని సుందరీకరిస్తున్నారు. దీంతో సీఎం జగన్ హైదరాబాద్ వస్తే అక్కడే ఉండే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇన్నాళ్లు క్యాంప్ ఆఫీసును పట్టించుకోకున్నా ప్రస్తుతం దాన్ని మరమ్మతులు చేపట్టడంతో జగన్ ఇక్కడికి వస్తే గెస్ట్ హౌస్ లోనే ఉండాలని భావిస్తున్నట్లు […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 23, 2021 / 06:39 PM IST
    Follow us on

    Hyderabad: ఆంధ్రప్రదేశ్ సీఎం క్యాంపాఫీస్ ను ముస్తాబు చేస్తున్నారు. ఏపీ విభజన సమయంలో ఆ స్టేట్ కు కేటాయించిన భవనాలను తరువాత కాలంలో తెలంగాణకు అప్పగించినా లేక్ వ్యూ గెస్ట్ హౌస్ ను మాత్రం ఇవ్వలేదు. దీంతో ప్రస్తుతం దాన్ని సుందరీకరిస్తున్నారు. దీంతో సీఎం జగన్ హైదరాబాద్ వస్తే అక్కడే ఉండే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇన్నాళ్లు క్యాంప్ ఆఫీసును పట్టించుకోకున్నా ప్రస్తుతం దాన్ని మరమ్మతులు చేపట్టడంతో జగన్ ఇక్కడికి వస్తే గెస్ట్ హౌస్ లోనే ఉండాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

    Lake view guest house

    అయితే ఇటీవల కురిసిన వర్షాలకు గెస్ట్ హౌస్ మొత్తం నీటితో నిండిపోయింది. దీంతో దానికి మరమ్మతులు చేస్తున్నారు. సీఎం జగన్ కు లోటస్ పాండ్ లోనే ఇల్లు ఉన్నా క్యాంప్ ఆఫీసును శుభ్రం చేయించుకోవడంతో ఇకపై హైదరాబాద్ వస్తే అక్కడే ఉండాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో చంద్రబాబు సైతం ఇక్కడ నుంచే తన కార్యకలాపాలు కొనసాగించినట్లు తెలిసిందే. దీంతో జగన్ కూడా క్యాంప్ ఆఫీసును వాడుకునేందుకు నిర్ణయించినట్లు సమాచారం.

    జగన్ పై ఉన్న సీబీఐ కేసులు విచారణ తుది దశకు చేరుకున్న నేపథ్యంలో కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. దీంతో ఇక్కడకు వచ్చినప్పుడు క్యాంప్ ఆఫీసులోనే ఉండాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దాని కోసమే దాన్ని రిపేర్ చేయిస్తున్నట్లు చెబుతున్నారు. దీంతో లేక్ వ్యూ ను సీఎం జగన్ ఉండేందుకు తయారు చేస్తున్నట్లు సమాచారం. మొత్తంగా జగన్ కేసుల్లో ఓ కొలిక్కి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయని తెలుస్తోంది.

    Also Read: Revanth Reddy: రేవంత్ సీరియస్ గా తీసుకుంటేనే ఛాన్స్.. లేదంటే?

    కోర్టు తీర్పుల దృష్ట్యా జగన్ కు ముందే సమాచారం అందినట్లు తెలుస్తోంది. దీంతోనే ఆయన క్యాంప్ ఆఫీసును రిపేర్ చేయించుకుని అధికారిక నివాసంగా ఇక్కడి నుంచే కోర్టుకు హాజరయ్యేందుకు నిర్ణయించుకున్నారని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఏపీలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఓ క్లారిటీ వస్తున్నట్లు చెబుతున్నారు.

    Also Read: Hyderabad: చల్ చల్ రే.. ఉద్యోగానికి కేరాఫ్ హైదరాబాద్

    Tags