https://oktelugu.com/

Nani: నాని వ్యాఖ్యల వల్ల స్టార్ హీరోలకే ఇబ్బంది !

Nani:  ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సినిమా టికెట్‌ ధరలను చాలా సీరియస్ గా తీసుకుంది. ఈ విషయంలో జగన్ అసలు వెనక్కి తగ్గడం లేదు. అయితే, జగన్ నిర్ణయం పై పెదవి విప్పడానికి కూడా ఇప్పటివరకు ఏ హీరో ధైర్యం చేయలేదు. నిజంగానే ఒక్క బాలయ్య తప్ప ఏ తెలుగు స్టార్ హీరో ఈ అంశం పై కనీసం స్పందించలేదు. కానీ తాజాగా నాని పెదవి విప్పాడు. సినిమా టికెట్‌ ధరల విషయంలో అలాగే జగన్ నిర్ణయం పై […]

Written By: , Updated On : December 23, 2021 / 06:20 PM IST
Follow us on

Nani:  ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సినిమా టికెట్‌ ధరలను చాలా సీరియస్ గా తీసుకుంది. ఈ విషయంలో జగన్ అసలు వెనక్కి తగ్గడం లేదు. అయితే, జగన్ నిర్ణయం పై పెదవి విప్పడానికి కూడా ఇప్పటివరకు ఏ హీరో ధైర్యం చేయలేదు. నిజంగానే ఒక్క బాలయ్య తప్ప ఏ తెలుగు స్టార్ హీరో ఈ అంశం పై కనీసం స్పందించలేదు. కానీ తాజాగా నాని పెదవి విప్పాడు.

Nani

Nani

సినిమా టికెట్‌ ధరల విషయంలో అలాగే జగన్ నిర్ణయం పై కూడా నాని కాస్త హీట్ పెంచే వ్యాఖ్యలే చేశాడు. అసలు నానికి ఇంత ధైర్యం ఎక్కడ నుంచి వచ్చింది ? అన్నట్టు చూస్తున్నారు మిగిలిన హీరోలు. నాని వ్యాఖ్యల ప్రకారం నిజంగానే ప్రేక్షకుల్ని అవమానించేలా జగన్ నిర్ణయం ఉందా ? అసలు ప్రజలకు లాభం చేయడానికే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నాడనేది ఏపీ ప్రభుత్వం మాట.

అలాంటప్పుడు టికెట్‌ ధరలు తగ్గించడం తమకు అవమానం అని ప్రేక్షకులు ఎందుకు భావిస్తారు ? అయినా సినిమా టికెట్లు తగ్గించి ప్రజలను అవమానించడమే అంటూ మాట్లాడటానికి నానికి ఏ హక్కు ఉంది ? పైగా నాని మరో కామెంట్ కూడా చేశాడు. థియేటర్ల కంటే పక్కన ఉన్న కిరాణా షాపుల కలెక్షన్‌ ఎక్కువగా ఉందని,

పైగా పది మందికి ఉద్యోగం ఇచ్చి థియేటర్ నడుపుతున్న వారికంటే, కిరాణా షాప్ కలెక్షన్స్ ఎక్కువగా వుండటం నిజంగా సెన్స్ లెస్ అంటూ నాని సీరియస్ అయ్యాడు. అయితే, తన సినిమా రేపు రిలీజ్ ఉంది కాబట్టి, తన సినిమాకు కలెక్షన్స్ తగ్గుతాయి కాబట్టి ఇప్పుడు నాని ఈ కామెంట్స్ చేసి ఉండొచ్చు. కానీ, టికెట్‌ కొనే సామర్థ్యం ప్రేక్షకులకు ఉందా ? లేదా ? అని చెప్పే హక్కు మాత్రం నానికి లేదు.

Also Read: Kamal Haasan: కమల్ ‘విక్రమ్’ పై స్పీడ్ పెంచాడు.. మార్చిలోనే రిలీజ్ !

ఒక్కటి మాత్రం నిజం ఇలాంటి వ్యాఖ్యల వల్ల పెద్ద సినిమాలకే, స్టార్ హీరోలకే ఇబ్బంది. సినిమా విడుదలైన తొలి రెండు రోజులు రేట్లు పెంచుకునే అవకాశం లభిస్తుందనే టాక్ వినిపిస్తోన్న నేపథ్యంలో నాని ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు. నాని వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకుని, ప్రభుత్వ తదుపరి కార్యాచరణ మొదలు పెడితే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ పరిస్థితి ఏమిటీ ? ఇక నుంచైనా మాట్లాడే ముందు నాని ఆలోచించుకోవాలి.

Also Read: Radhe shyam: సోషల్ మీడియా లో వైరల్ గా మారిన “రాధే శ్యామ్” ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫోటోలు…

Tags