https://oktelugu.com/

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఆరోగ్యంపై డాక్టర్లు ఏమన్నారంటే?

అసలే అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. ఇప్పటికే ప్రత్యర్థి అభ్యర్థి బిడెన్‌ ప్రచారంలో దూసుకెళ్తున్నాడు. మరోసారి అధ్యక్ష సీటును కైవసం చేసుకోవాలని ట్రంప్‌ ఉవ్విళ్లూరుతున్నాడు. కానీ.. ఇంతలోనే ట్రంప్‌ కరోనా బారిన పడ్డారు. వెంటనే వాల్టర్‌‌ రీడ్‌ సైనిక ఆస్పత్రిలో చేరిపోయారు. నాలుగే రోజులు చికిత్స పొందారు. వెంటనే శ్వేతసౌధానికి చేరిపోయారు. అక్కడ మరో వారం పాటు డాక్టర్లు చికిత్స చేశారు. అయితే.. మహమ్మారి నుంచి తాను పూర్తిగా కోలుకున్నట్లు ట్రంప్‌ ప్రకటించారు. కొవిడ్‌ గురించి ఎవరూ భయపడాల్సిన […]

Written By:
  • NARESH
  • , Updated On : October 6, 2020 3:49 pm
    Follow us on


    అసలే అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. ఇప్పటికే ప్రత్యర్థి అభ్యర్థి బిడెన్‌ ప్రచారంలో దూసుకెళ్తున్నాడు. మరోసారి అధ్యక్ష సీటును కైవసం చేసుకోవాలని ట్రంప్‌ ఉవ్విళ్లూరుతున్నాడు. కానీ.. ఇంతలోనే ట్రంప్‌ కరోనా బారిన పడ్డారు. వెంటనే వాల్టర్‌‌ రీడ్‌ సైనిక ఆస్పత్రిలో చేరిపోయారు. నాలుగే రోజులు చికిత్స పొందారు. వెంటనే శ్వేతసౌధానికి చేరిపోయారు. అక్కడ మరో వారం పాటు డాక్టర్లు చికిత్స చేశారు. అయితే.. మహమ్మారి నుంచి తాను పూర్తిగా కోలుకున్నట్లు ట్రంప్‌ ప్రకటించారు. కొవిడ్‌ గురించి ఎవరూ భయపడాల్సిన పనిలేదని సూచించారు.

    Also Read: రాహుల్ హడావుడి.. అంతేనా? కొత్తదేమీ కాదా?

    అంతేకాదు.. కరోనా నియంత్రణకు అవసరమైన మందులు అందుబాటులో ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఆస్పత్రి నుంచి శ్వేతసౌధం చేరిన ట్రంప్‌ ఆరోగ్యంగానే కనిపించారు. సౌత్‌ పోర్టికో మెట్ల ద్వారా పైకి చేరుకొని విలేకరులకు అభివాదం చేశారు. పోర్టికోలో నిలబడి ఆయన వచ్చిన హెలికాప్టర్‌‌ ‘మెరైన్‌ వన్‌’కు సైనిక వందనం చేశారు. అనంతరం ట్విట్టర్‌‌ ద్వారా తన అనుభవాన్ని పంచుకున్నారు.

    ‘కొవిడ్‌కు ఎవరూ భయపడవద్దు. నా పాలనలో అద్భుతమైన మందులు అభివృద్ధి అయ్యాయి. అందరం కలిసి ఈ మహమ్మారిని ఓడించాలి’ అంటూ పిలుపునిచ్చారు. తనకు మద్దతుగా నిలిచిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు చెప్పారు. అందుకే ఆదివారం కాసేపు బయటకు వచ్చిన సందర్భాన్ని గుర్తుచేశారు. త్వరలోనే ఎన్నికల ప్రచారంలోకి దిగుతానని ధీమా వ్యక్తం చేశారు.

    Also Read: అన్ లాక్ 5: స్కూళ్ల ఓపెన్ మార్గదర్శకాలివీ

    మరోవైపు డాక్టర్లు కూడా ట్రంప్‌ ఆరోగ్య పరిస్తితిపై వివరించారు. గత 72 గంటల్లో ట్రంప్‌కు జ్వరం రాలేదని డాక్టర్‌‌ సియాన్‌ కాన్లే చెప్పారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కావడానికి అన్ని అర్హతలూ ఉన్నాయని వెల్లడించారు. సోమవారం మరోసారి రెమిడెసివర్‌‌ అందించామన్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు తెలిపారు.