https://oktelugu.com/

బిగ్‌ బాస్‌ కు నాగార్జున దూరం.. ఏం జరుగనుంది?

బిగ్‌బాస్‌ 4 గేమ్‌ రసవత్తరంగా సాగుతోంది. ఫస్ట్‌ టూ వీక్స్‌ పెద్దగా అలరించకపోయినా.. ఇప్పుడిప్పుడు కంటెస్టెంట్లకు బిగ్‌బాస్‌ చెప్పుకోదగ్గ టాస్క్‌లే ఇస్తున్నాడు. అటు వారం వారం ఎలిమినేషన్‌ ప్రక్రియ కూడా ఉత్కంఠగా సాగుతోంది. ఎలిమినేట్‌ చేసుకునే ప్రక్రియలోనూ భారీ స్థాయిలో డిస్కస్‌ నడుస్తూనే ఉంది. దీంతో ప్రేక్షకులు కూడా ప్రతి ఎపిసోడ్‌ను ఆసక్తిగా తిలకిస్తున్నారు. Also Read: మెగాస్టార్ డైరెక్టర్ తో రవితేజ ఫిక్స్ ! ముఖ్యంగా వీకెండ్‌లో వచ్చే కింగ్‌ నాగార్జున అటు ప్రేక్షకుల్లోనూ.. ఇటు […]

Written By:
  • NARESH
  • , Updated On : October 6, 2020 / 01:03 PM IST
    Follow us on

    బిగ్‌బాస్‌ 4 గేమ్‌ రసవత్తరంగా సాగుతోంది. ఫస్ట్‌ టూ వీక్స్‌ పెద్దగా అలరించకపోయినా.. ఇప్పుడిప్పుడు కంటెస్టెంట్లకు బిగ్‌బాస్‌ చెప్పుకోదగ్గ టాస్క్‌లే ఇస్తున్నాడు. అటు వారం వారం ఎలిమినేషన్‌ ప్రక్రియ కూడా ఉత్కంఠగా సాగుతోంది. ఎలిమినేట్‌ చేసుకునే ప్రక్రియలోనూ భారీ స్థాయిలో డిస్కస్‌ నడుస్తూనే ఉంది. దీంతో ప్రేక్షకులు కూడా ప్రతి ఎపిసోడ్‌ను ఆసక్తిగా తిలకిస్తున్నారు.

    Also Read: మెగాస్టార్ డైరెక్టర్ తో రవితేజ ఫిక్స్ !

    ముఖ్యంగా వీకెండ్‌లో వచ్చే కింగ్‌ నాగార్జున అటు ప్రేక్షకుల్లోనూ.. ఇటు కంటెస్టెంట్లోనూ మరింత ఉత్సాహాన్ని నింపుతున్నారు. దనదైన హోస్టింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు. ఇలాంటి టైమ్‌లో ఈ షోను కీలకంగా, యాక్టివ్‌గా నిర్వహిస్తున్న హీరో నాగార్జునకు ఓ చిక్కు వచ్చింది.

    అటు వైల్డ్ డాగ్ షో, ఇటు బిగ్ బాస్ షో. వైల్డ్ డాగ్ సినిమా కోసం నాగార్జున పది రోజులు అవుట్ డోర్‌‌కు వెళ్లాల్సి వస్తోంది. అది ఎక్కడికి అన్నది ఇంకా డిసైడ్ కాలేదు. హిమాచల్ ప్రదేశ్ లేదా అస్సాం ఏరియాలో షూటింగ్ ప్లాన్ చేసే ఆలోచనలో ఉన్నారట. దీంతో ఓ వీకెండ్‌కు కింగ్‌ నాగార్జున డుమ్మా కొట్టే పరిస్థితులు ఉన్నాయట. ఈ ఒక్క వారం ఎవరినైనా రప్పించాలని అనుకున్నారట. కానీ అలా చేయడం అటు నాగార్జునకు కానీ.. ఇటు బిగ్‌బాస్‌ నిర్వాహకులకు కానీ ఇష్టం లేదని తెలుస్తోంది.

    Also Read: మహేష్ బాబునే ఇంతలా భయపెట్టారంటే?

    అందుకే ఆల్టర్ నేటివ్ ప్లాన్ వేస్తున్నారని సమాచారం. ఇండియాలో ఎక్కడ షూట్ జరిగినా అక్కడి నుంచి హైదరాబాద్‌కు వచ్చి, బిగ్‌బాస్ షోలో పాల్గొని వెళ్లేలా సమాలోచనలు సాగిస్తున్నారు. ఇందుకోసం ఏకంగా చార్టర్‌‌ ఫ్లైట్‌ వినియోగించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఖర్చు మరి బిగ్ బాస్ ఖాతాలో వేస్తారో? వైల్డ్ డాగ్ ఖాతాలో వేస్తారో అన్నది ఇంకా తెలియాల్సి ఉంది.