https://oktelugu.com/

మహేష్ బాబునే ఇంతలా భయపెట్టారంటే?

  ఇటీవల నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన ‘సోషల్ డైలామా’ వెబ్ చిత్రం ప్రతీఒక్కరిని ఆలోచింపజేసేలా చేస్తోంది. మానవులపై సోషల్ మీడియా ప్రభావం ఎంత తీవ్రంగా ఉందో ‘సోషల్ డైలామా’ చిత్రం కళ్లకుకట్టినట్లు చూపించింది. ఈ మూవీని చూస్తే సోషల్ మీడియా వాడుతున్న ప్రతీఒక్కరి వెన్నులో వణుకుపుట్టడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. Also Read: బిగ్‌ బాస్‌ కు నాగార్జున దూరం.. ఏం జరుగనుంది? ‘సోషల్ డైలామా’ మూవీపై సూపర్ స్టార్ మహేష్ బాబు స్పందించారు. ఇటీవల […]

Written By:
  • NARESH
  • , Updated On : October 6, 2020 / 01:09 PM IST
    Follow us on

     

    ఇటీవల నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన ‘సోషల్ డైలామా’ వెబ్ చిత్రం ప్రతీఒక్కరిని ఆలోచింపజేసేలా చేస్తోంది. మానవులపై సోషల్ మీడియా ప్రభావం ఎంత తీవ్రంగా ఉందో ‘సోషల్ డైలామా’ చిత్రం కళ్లకుకట్టినట్లు చూపించింది. ఈ మూవీని చూస్తే సోషల్ మీడియా వాడుతున్న ప్రతీఒక్కరి వెన్నులో వణుకుపుట్టడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

    Also Read: బిగ్‌ బాస్‌ కు నాగార్జున దూరం.. ఏం జరుగనుంది?

    ‘సోషల్ డైలామా’ మూవీపై సూపర్ స్టార్ మహేష్ బాబు స్పందించారు. ఇటీవల కాలంలో చాలామంది సెలబెట్రీలు ఈ మూవీని చూసి తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. తాజాగా మహేష్ బాబు ఈ మూవీపై తన అభిప్రాయాన్ని అభిమానులతో పంచుకున్నారు. ఇప్పటివరకు తాను చూసిన హర్రర్ చిత్రాల్లో ‘సోషల్ డైలామా’ అత్యంత భయంకరంగా ఉందన్నారు. ఈ మూవీ గురించి రాస్తున్నపుడు వణుకు పుట్టిందని.. అయితే ఈ జానర్ కు తను ఫ్యాన్ అయిపోనట్లు చెప్పారు. ఇది ప్రతీఒక్కరు చూడదగ్గ చిత్రమని మహేష్ పేర్కొన్నాడు.

    సోషల్ మీడియాను ఒక్కొక్కరు ఒక్కోవిధంగా వినియోగించుకున్నారు. అయితే మనం వెతకబోతున్నాం అన్నది కూడా గుగుల్ సెర్చ్ ఇంజన్ కు ముందే తెలిసిపోతుంది..? అని తెలుసుకుంటే ఫీజ్ లు ఎగిరిపోవాల్సిందే..! మనం సోషల్ మీడియాలో ఏదైనా సెర్చ్ చేస్తే దానికి సంబంధించిన అంశాలు వస్తుండటం గమనించి ఉండే ఉంటారు.. ఇదంతా సెట్టింగ్స్ భాగమని అనుకుంటాం. కానీ కొందరు మనల్నీ గమనిస్తున్నారని మాత్రం అనుకోం.. ఈ సినిమా చూస్తే మనభావన తప్పని తేలిపోవడం ఖాయం.

    Also Read: మెగాస్టార్ డైరెక్టర్ తో రవితేజ ఫిక్స్ !

    సోషల్ మీడియాలో కొందరు నిత్యం మనల్నీ గమనిస్తూ ఉంటారు.. వీరే మనం వెతుకున్నది మనం ముందు ప్రత్యక్ష్యమయ్యేలా చేస్తారు.. ఎమోషన్స్ ను అటువైపు మళ్లీస్తుంటారు. దీన్నే ప్రధాన అంశంగా తీసుకొని ‘సోషల్ డైలామా’ వెబ్ చిత్రం రూపొందించబడింది. రోజురోజుకు పెరుగుతున్న సాంకేతికత వల్ల మానవాళికి ఏమేరకు ముప్పు వాటిల్లనుందనేది ‘సోషల్ డైలామా’లో ప్రధానంగా చూపించారు. మహేష్ ను భయపెట్టిన ‘సోషల్ డైలామా’ ప్రతీఒక్కరిలోనూ అదేతరహా ఫీలింగ్ కలిగించడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.