https://oktelugu.com/

ఏపీతో నీటి వివాదాలపై కేసీఆర్ కోపానికి కారణమేంటి?

ఏపీతో నీటి యుద్ధానికి తెలంగాణసీఎం కేసీఆర్ దిగాడు. తీవ్రంగా ఏపీపై ఫిర్యాదులు చేస్తున్నాడు. కేసీఆర్ దూకుడు వెనుక రహస్యం ఏమిటీ? ప్రస్తుతం తెలంగాణ ఉద్యమంలో చూపించిన దూకుడును కేసీఆర్ ప్రదర్శిస్తున్నాడు. కృష్ణా నది బోర్డు ఆదేశాలను సైతం కేసీఆర్ ధిక్కరిస్తున్నాడు. 100శాతం విద్యుత్ ఉత్పత్తిని సాధించడానికి నీటి కేటాయింపులను మించి ప్రాజెక్టుల్లోని నీటిని ఖాళీ చేస్తున్నాడు. ప్రస్తుతం కేసీఆర్ తెలంగాణలోని నీటి పారుదల ప్రాజెక్టుల వద్ద పెద్ద సంఖ్యలో భద్రతా దళాలను మోహరించాడు. ఇది ఎవ్వరూ ఊహించని […]

Written By:
  • NARESH
  • , Updated On : July 3, 2021 / 01:28 PM IST
    Follow us on

    ఏపీతో నీటి యుద్ధానికి తెలంగాణసీఎం కేసీఆర్ దిగాడు. తీవ్రంగా ఏపీపై ఫిర్యాదులు చేస్తున్నాడు. కేసీఆర్ దూకుడు వెనుక రహస్యం ఏమిటీ? ప్రస్తుతం తెలంగాణ ఉద్యమంలో చూపించిన దూకుడును కేసీఆర్ ప్రదర్శిస్తున్నాడు. కృష్ణా నది బోర్డు ఆదేశాలను సైతం కేసీఆర్ ధిక్కరిస్తున్నాడు. 100శాతం విద్యుత్ ఉత్పత్తిని సాధించడానికి నీటి కేటాయింపులను మించి ప్రాజెక్టుల్లోని నీటిని ఖాళీ చేస్తున్నాడు.

    ప్రస్తుతం కేసీఆర్ తెలంగాణలోని నీటి పారుదల ప్రాజెక్టుల వద్ద పెద్ద సంఖ్యలో భద్రతా దళాలను మోహరించాడు. ఇది ఎవ్వరూ ఊహించని చర్య. నీటిపారుదల ప్రాజెక్టులో పోలీసులు ఇంత పెద్ద సంఖ్యలో మోహరించడం ఇదే తొలిసారని చెబుతున్నారు. ఇది కేసీఆర్ లోని విశ్వాసాన్ని చూపిస్తోంది.

    కేంద్రంతో స్నేహంగా ఉంటూ.. అదే సమయంలో కేంద్రం ఆదేశాలను పాటించకుండా వ్యతిరేకిస్తానని కేసీఆర్ నిర్ణయాలు చెప్పకనే చెప్తున్నాయి. తనపై ఎలాంటి కేసులు లేనందున, కేంద్రం నుంచి భయపడాల్సిన అవసరం తనకు లేదని కేసీఆర్ నమ్మకంగా ఉన్నట్టు అర్థమవుతోంది.

    నీటిపారుదల ప్రాజెక్టులపై ఈ దురాక్రమణ, ఏపీతో నీటి వివాదం ద్వారా తెలంగాణ ప్రజల దృష్టిలో కేసీఆర్ హీరో అయిపోయాడని.. నీటి కోసం ఎంతటి ఫైట్ అయినా చేయగలనని నిరూపించాడని పలువురు వాదిస్తున్నారు.

    అంతేకాదు.. మూడో ఫ్రంట్ ను రూపొందించడానికి ప్రయత్నిస్తున్న ప్రాంతీయ పార్టీలకు తన బలం.. బలగం.. మోడీ సర్కార్ ను ఎదురించే నైపుణ్యం గురించి తెలియజేయడానికి కూడా ఈ ఉదంతాన్ని కేసీఆర్ ఉపయోగించుకున్నారని చెబుతున్నారు.

    వాస్తవానికి 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు కేసీఆర్ బీజేపీని గద్దెదించేందుకు ఫెడరల్ ఫ్రంట్ కోసం తీవ్రంగా కృషి చేశారు. కొన్ని రాష్ట్రాలలో సైతం పర్యటించాడు. మూడో ఫ్రంట్ కు నాయకత్వం వహించడానికి ప్రయత్నించాడు.కానీ బీజేపీ ఏకపక్ష విజయంతో కేసీఆర్ ఆశలు నెరవేరలేదు. ఇప్పుడు తెలంగాణ సీఎంగా బలంగా నిలబడుతున్నానన్న సంకేతాలు పంపడం ద్వారా వచ్చే సారి దేశంలో హంగ్ వస్తే ఫెడరల్ ఫ్రంట్ కు నాయకత్వం వహించే అవకాశం కోసమే కేసీఆర్ ఇలా దూకుడుగా ముందుకెళుతున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.