Potatoes : శీతాకాలంలో, బంగాళదుంపలు రెండు రకాలుగా లభిస్తుంటాయి. ఒకటి కొత్తది, మరొకటి పాతది. వీటిలో, కొత్త బంగాళాదుంపలు కాలానుగుణంగా లభిస్తుంటాయి. ఇవి శీతాకాలంలో మాత్రమే మనకు మార్కెట్ లో అందుబాటులో ఉంటాయి. వాటి పై తొక్క చాలా సన్నగా ఉంటుంది. అంతేకాదు వీటిలో చాలా మట్టి ఉంటుంది. అయితే పాత బంగాళాదుంపలను ఏడాది పొడవునా తినవచ్చు. వాటి పొట్టు మందంగా ఉంటుంది కాబట్టి వాటి తొక్క తీయడం పెద్దగా కష్టం కాదు. వీటి కోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా ఉండదు.
అయితే చలికాలంలో కొత్త బంగాళదుంపలు మార్కెట్‌లో అందుబాటులోకి వస్తున్నాయి. అయినప్పటికీ వాటి రుచి కూడా పాత వాటి కంటే కాస్త భిన్నంగా ఉంటుంది. అందుకే వాటిని తినడానికి ఇష్టపడతారు. కానీ మట్టిని శుభ్రం చేయడం చాలా కష్టం. ఇక బంగాళాదుంపల తొక్క తీయడం మరింత కష్టం. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ టిప్ గురించి చూస్తే జస్ట్ లైక్ ఏ వావ్ అంటారు. కొందరు తిడుతారు కూడా. ఇంతకీ ఏంటి ఆ మ్యాటర్ అంటే?
మీరు వాషింగ్ మెషీన్ లో బట్టలు మాత్రమే ఉతుకుతారా? కానీ ఇప్పుడు ఆలు గడ్డ పొట్టును కూడా తీయవచ్చు. మట్టితో పాటు సన్నని పొట్టును ముఖ్యంగ కొత్త బంగాళాదుంపలను కడగాలనుకుంటే వాషింగ్ మిషన్ చాలా ఉపయోపగడుతుంది. దీంతో పాటు మీకు స్టెయిన్లెస్ స్టీల్ స్పాంజ్ అవసరం. ఎక్కువ బంగాళాదుంపలు ఉంటే, మీరు 2 స్పాంజ్లను కూడా ఉపయోగించవచ్చు. ఇప్పుడు బంగాళాదుంపలతో పాటు స్పాంజిని యాడ్ చేసి తర్వాత వాషింగ్ మెషీన్ ను స్ట్రార్ట్ చేయాలి. బంగాళాదుంపలు స్పాంజ్ లు రెండు కూడా మిషన్ లో తిరుగుతూ ఉంటాయి కాబట్టి మురికి తొలగిపోతుంది. సన్నని తొక్కలు కూడా వాటికి అవే వస్తుంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం. ఈ సులభమైన ట్రిక్‌తో అస్సలు కష్టపడాల్సిన అవసరం లేదన్నమాట. అయితే ఇలాంటి వాటికంటే మీరు మీ చేతులతోటి వీటిని వాష్ చేసి ఆ తర్వాత వాటి పొట్టు తీయడమే చాలా ఉత్తమం. ఇక ఈ వీడియోలో మీరు గమనించినట్లు అయితే సోప్ వేసి మరీ వాష్ చేశారు. ఆ సోప్ ఆలూకు అంటుకొని కడుపులోకి వెళ్లే ప్రమాదం కూడా ఉంది కాబట్టి పైకి వెళ్లే అవకాశాలు కూడా ఉంటాయి మరి జాగ్రత్త సుమ.
సోమరి ప్రజలకు మరొక ఉపాయం ఉపయోగపడుతుంది
వాషింగ్ మెషీన్‌లో బంగాళాదుంపలను కడగడమే కాకుండా, ముల్లంగిని ఎండబెట్టడం కూడా చాలా వైరల్‌గా మారింది. పరాటాలు చేయడానికి, ముల్లంగిని తురిమిన తర్వాత, పరాటాలు మంచిగా మారడానికి దాని నీటిని పారవేయాలి. కానీ ఇది చాలా కష్టపడి పని చేస్తుంది, కాబట్టి వాషింగ్ మిషన్ డ్రైయర్ లో తురిమిన ముల్లంగిని ఎండబెట్టడం కూడా చాలా మంచి ఎంపికగా అంటున్నారు కొందరు. అయితే ఇలాంటివి నచ్చని వారు మాత్రం చారాన కోడికి బారాణ మసాలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు మా తెలంగాణలో కరెంట్ బిల్ ఫ్రీ అని ఇలాంటివి మరింత పెంచవద్దు అంటూ ఫన్నీగా స్పందిస్తున్నారు మరికొందరు.