bengal citizenship bill : పశ్చిమ బెంగాల్లో దశాబ్దాలుగా కొనసాగుతున్న మతపరమైన వివక్ష, అక్రమ వలసలు, పౌరసత్వ సమస్యలపై కీలక పరిణామం చోటుచేసుకోనుంది. రాష్ట్ర అసెంబ్లీలో నేడు నూతన బీజేపీ సీఎం సువేందు అధికారి ఉమ్మడి పౌరసత్వ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. ఈ బిల్లు ద్వారా పౌరుల హక్కులకు రక్షణ కల్పించడంతో పాటు, అక్రమ వలసల నియంత్రణకు మరింత బలమైన చట్టపరమైన వ్యవస్థ ఏర్పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
మరోవైపు, ప్రతిపక్షాలు ఈ బిల్లుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. దీంతో అసెంబ్లీలో తీవ్ర చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. బంగ్లాదేశ్ అక్రమ వలసల అరికట్టడంతోపాటు బంగ్లా నుంచి వచ్చిన హిందువులకు రక్షణ కల్పించేందుకు ఈ చారిత్రాత్మక బిల్లును బెంగాల్ లో ప్రవేశ పెట్టనున్నారు.
బెంగాల్ అసెంబ్లీలో నేడే ఉమ్మడి పౌరసత్వ బిల్లు.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
