రేవంత్‌ చేసిన ఆ వ్యాఖ్యలే దెబ్బకొట్టాయా

తెలంగాణ పీసీసీ రేస్‌ ఇంకా నడుస్తూనే ఉంది. పీసీసీ చీఫ్‌ ఎవరనేది ఇంకా అధిష్టానం తేల్చడం లేదు. ఆ కసరత్తు ఇంకా కొలిక్కిరావడం లేదు. నేడు.. రేపు ప్రకటిస్తారని లీకులు వస్తున్నా.. వాయిదా పడుతూ వస్తూనే ఉంది. మరోవైపు.. ఇంకా పీసీసీ చీఫ్‌ను అధిష్టానం సెలక్ట్‌ చేయలేదనే వార్తలూ వినిపిస్తున్నాయి. ఎవరికి వారుగా ప్రయత్నాలు సాగిస్తుండడంతో అధిష్టానం సైతం ఎటూ తేల్చలేకపోతోంది. Also Read: వాళ్లు రాజీకి వచ్చారు..! : ఇక ప్రపంచ వ్యాప్తంగా ఆ వ్యాక్సిన్లు […]

Written By: Srinivas, Updated On : January 6, 2021 1:47 pm
Follow us on


తెలంగాణ పీసీసీ రేస్‌ ఇంకా నడుస్తూనే ఉంది. పీసీసీ చీఫ్‌ ఎవరనేది ఇంకా అధిష్టానం తేల్చడం లేదు. ఆ కసరత్తు ఇంకా కొలిక్కిరావడం లేదు. నేడు.. రేపు ప్రకటిస్తారని లీకులు వస్తున్నా.. వాయిదా పడుతూ వస్తూనే ఉంది. మరోవైపు.. ఇంకా పీసీసీ చీఫ్‌ను అధిష్టానం సెలక్ట్‌ చేయలేదనే వార్తలూ వినిపిస్తున్నాయి. ఎవరికి వారుగా ప్రయత్నాలు సాగిస్తుండడంతో అధిష్టానం సైతం ఎటూ తేల్చలేకపోతోంది.

Also Read: వాళ్లు రాజీకి వచ్చారు..! : ఇక ప్రపంచ వ్యాప్తంగా ఆ వ్యాక్సిన్లు

టీపీసీసీ కొత్త అధ్యక్షుడి నియామకం రోజుకో మలుపు తిరుగుతోంది. కాంగ్రెస్‌ ఎంపీలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్‌రెడ్డిల్లో ఎవరో ఒకరికి ఆ పదవి దక్కుతుందని ఇప్పటివరకూ చర్చ జరిగింది. ఒకానొక సందర్భంలో రేవంత్‌రెడ్డి పేరు ఫైనల్‌ అని కూడా వినిపించింది. కానీ.. ఉన్నట్టుండి కొత్త పేర్లు వెలుగులోకి వచ్చాయి. పార్టీ సీనియర్‌ నాయకులు కె.జానారెడ్డి, డి.శ్రీధర్‌బాబు, టి.జీవన్‌రెడ్డి, మర్రి శశిధర్‌రెడ్డి పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. త్వరలో జరుగనున్న ఎన్నికల నేపథ్యంలో టీపీసీసీ పదివి ఎవరికిస్తే బాగుంటుందో అని అధిష్టానానికి తలనొప్పిగా మారింది.

అయితే.. ఇటీవల టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి ఓ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలతో కలకలం రేగింది. తానే టీపీసీసీ అధ్యక్షుడిననే ధీమాతో ఉన్న రేవంత్‌ తనకు అధ్యక్ష పదవే ముఖ్యం కాదని, ప్రచార కమిటీ చైర్మన్‌ పదవి ఇచ్చినా ఇబ్బంది లేదంటూ చేసిన వ్యాఖ్యలతో గందరగోళం ఏర్పడింది.

Also Read: బ్రేకింగ్: కేసీఆర్ బంధువుల కిడ్నాప్.. భూమా అఖిలప్రియ అరెస్ట్

ఈ నేపథ్యంలోనే జీవన్‌రెడ్డి అధ్యక్షుడు, రేవంత్‌ ప్రచార కమిటీ చైర్మన్‌గా అధికారిక ప్రకటన వెలువడుతుందనే ప్రచారం జరిగింది. టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌ పదవి ఇచ్చినా ఫర్వాలేదని రేవంత్‌ చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీ వర్గాలు పలు రకాలుగా పేర్కొంటున్నారు. ఆ పదవి ఎవరికిచ్చినా సమన్వయంతో పనిచేస్తానని సూచికలు చేసినట్లు ఓ వైపు చర్చ జరుగుతుండగా అధిష్టానం నుంచి అలాంటి సంకేతాలు ఉంటాయని ముందే తెలిసి రేవంత్‌ రెడ్డి ఇలా అంటున్నారని మరికొందరు చర్చించుకుంటున్నారు.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్