Homeఎంటర్టైన్మెంట్చిత్ర పరిశ్రమకి గత వైభోగం రానున్నదా ?

చిత్ర పరిశ్రమకి గత వైభోగం రానున్నదా ?

Tollywood
కరోనా కారణంగా మూత పడిన థియేటర్లను పెళ్లి మండపాలుగా చేద్దామా లేదా కోల్డ్ స్టోరేజీలుగా మార్చేద్దామా అన్న డైలమాలో ఉన్న సమయంలో ఇటీవలనే ప్రభుత్వాలు తీపి కబురు ప్రకిటించి మోక్షం కలిపించాయి. అయితే 50 శాతం ఆక్యుపెన్సీ నిభంధనతో మాత్రమే సినిమాలు ప్రదర్శించాలని ఆదేశాలు ఇవ్వటంతో అలాంటి ప్రతికూల పరిస్థితుల్లో సినిమాని విడుదల చేస్తే ఫలితం ఆశించిన విధంగా ఉండదని నిర్మాతలు వెనకడుగు వేశారు. దాదాపు అందరూ OTT లలో రిలీజ్ చేసి సాధ్యమైనంతవరకు గండం గట్టెక్కటానికే మొగ్గు చూపారు.

Also Read: ‘అల్లు అర్జున్’ చెల్లిగా స్టార్ హీరోయిన్ !

ఇలా అందరూ భయపడుతున్న తరుణంలో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ధైర్యం చేసి “సోలో బ్రతుకే సో బెటర్” మూవీని థియేటర్లలో క్రిస్మస్ కానుకగా విడుదల చేయటం జరిగింది. సినీ జనాలందరూ ఆ మూవీ ఫలితం కోసం తమ సొంత మూవీ రిలీజ్ అయ్యినంత ఉత్కంఠతో ఎదురు చూసారు. ఆ మూవీకి వచ్చిన స్పందన, కలెక్షన్స్ అనుకూలంగానే రావటంతో ఇక దర్శక నిర్మాతలకి కొండంత బలం వచ్చింది. కొత్త సంవత్సరం మరియు సంక్రాతి సీజన్ రావడంతో వరుసపెట్టి నాలుగు చిత్రాలు రిలీజ్ తేదీలని ప్రకిటించారు. అయితే, ప్రస్తుతమున్న నిబంధనలు మధ్య ఇన్ని సినిమాలు పోటీలో ఉంటే అందరికి ప్రమాదమే అని సినీ జనాలు భయపడుతున్నారు.

Also Read: టాలీవుడ్ అంతా సీక్వెల్స్ మయమే !

తాజాగా తమిళనాడు ప్రభుత్వం వంద శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లని నడుపుకోవచ్చని ప్రకిటించింది. కానీ మన తెలుగు రాష్ట్రాలలో ఇంకా ఇలాంటి ప్రకటన అధికారికంగా వెలువడలేదు. తెలుగు చిత్ర పరిశ్రమకి చెందిన అన్ని విభాగాల పెద్దలందరూ ప్రభుత్వాలతో హుటాహుటిన సంప్రదింపులు జరపటం మొదలెట్టారు. రెండు రాష్ట్రాల ప్రభుత్వాల నుండి రెండు మూడు రోజుల్లో సినీ పరిశ్రమకి అనుకూలంగానే ప్రకటన వస్తుందని ఫిలిం నగర్ నుండి సమాచారం అందుతుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

2 COMMENTS

Comments are closed.

Exit mobile version