
ఏపీ–తెలంగాణల మధ్య నెలకొన్న జల జగడం ఎటూ తేలడం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమం అంటూ జగన్ సర్కార్ నిలదీస్తుండగా.. ఇప్పుడు కేసీఆర్ నాటి శిలాఫలకం అంశాన్ని తెరమీదకు తెచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఇనాగ్రేషన్‌కు సీఎం జగన్ కూడా హాజరయ్యారంటూ చెప్పుకొస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రి హోదాలో ఆయన వచ్చారని జలవనరుల శాఖకు లేఖ రాశారు. ప్రాజెక్టు ఇనాగ్రేషన్‌కు వచ్చి ఇప్పుడు అక్రమం అని అంటున్నారని పేర్కొన్Cనారు. ఇదెక్కడి అన్యాయమని ప్రశ్నిస్తున్నారు.
Also Read: గ్రేటర్‌లో టీడీపీ బరిలో దిగుతుందంట.? ఏం జరుగుతుంది?
తెలంగాణలో నిర్మిస్తున్నప్రాజెక్టులన్నీ సక్రమం అని చెప్పడమే కాదు.. మళ్లీమళ్లీ వివాదాలు రాకుండా ఉండాలంటే శ్రీశైలం ప్రాజెక్టును కూడా తమకు అప్పగించడం ఒక్కటే మార్గమం అన్నట్లుగా కేసీఆర్ లేఖ రాశారు. కేసీఆర్ రాసిన 14 పేజీల లేఖ ఇప్పుడు కలకలం రేపుతోంది. శ్రీశైలం ప్రాజెక్టుపై ఏపీ సర్కార్ నిర్మిస్తున్న ఎత్తిపోతల స్కీం అక్రమమని కేసీఆర్ హైకోర్టుకు, సుప్రీం కోర్టు వరకూ వెళ్లారు. జలవనరుల శాఖకూ ఫిర్యాదు చేశారు. దీనిపై అపెక్స్ కౌన్సిల్ భేటీ నిర్వహించాల్సి ఉంది.
అయితే.. ఈ భేటీ కోసం తెలంగాణ సీఎం కేసీఆర్ వరుసగా మీటింగ్‌లు పెడుతూనే ఉన్నారు. అపెక్స్ కౌన్సిల్ భేటీలో వ్యవహరించాల్సిన విధానాన్ని ఖరారు చేసుకున్నారు. ఆ మేరకు కీలకమైన పాయింట్లతో ముందుగానే కేంద్ర జలవనరుల శాఖ మంత్రికి లేఖ రాశారు. అపెక్స్ కౌన్సిల్ భేటీ జలవనరుల మంత్రి అధ్యక్షతనే జరుగుతుంది. అందుకే వ్యూహాత్మకంగా కేసీఆర్ ఈ లేఖను ముందుగానే పంపినట్లుగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను కూడా అక్రమం అని చెబుతోంది. ఆ ప్రాజెక్టుతోపాటు దానికి అనుబంధంగా ఇతర ప్రాంతాల్లో కట్టిన ప్రాజెక్టులన్నీ సక్రమం అనే వాదిస్తోంది.
Also Read: జగన్ ఆ వ్యాధితో బాధ పడుతున్నారన్న చినబాబు..?
అయితే.. కేసీఆర్ లేఖకు ఏపీ సీఎం జగన్ కూడా కౌంటర్ లేఖ రాసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కొత్తగా అపెక్స్ కౌన్సిల్ భేటీ తేదీలు ఖరారయ్యాక ముఖ్యమంత్రి జగన్ ఎలాంటి అధికారిక సమావేశం నిర్వహించలేదు. సమీక్ష చేయలేదు. అధికారులు మాత్రం తమ కసరత్తు పూర్తి చేశారు. కేంద్రం ముందు అనుసరించాల్సిన విధానంపై ఓ ముసాయిదా సిద్ధం చేశారు. అపెక్స్ భేటీలో అనసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేశారు. ముఖ్యమంత్రి ఆమోద ముద్ర వేసిన తరువాత ఓ లేఖను కేంద్రానికి పంపే అవకాశం ఉంది. కేసీఆర్ శ్రీశైలం ప్రాజెక్టును అడిగితే.. ఏపీ సర్కార్ నాగార్జున సాగర్ పై పూర్తి పెత్తనం అడిగే అవకాశం ఉందని తెలుస్తోంది. మొత్తానికి జలజగడంపై ఏ సీఎం కూడా తగ్గే పరిస్థితులైతే కనిపించడం లేదు.
Comments are closed.