నవ్వకుండా ఉండలేరు: సుమ ఇంట్లోని కుక్క కూడా కామెడీ చేస్తుందిగా?

సుమ కనకాల గురించి బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు యాంకర్లో సుమ నెంబర్ వన్ గా ఎప్పటి నుంచో కొనసాగుతోంది. యాంకరింగ్ తోపాటు హోస్టుగా బుల్లితెరపై కన్పిస్తూ ప్రతీఒక్కరిని ఆకట్టుకుంటోంది. ఇక సినిమాకు సంబంధించి ఆడియో రిలీజ్ తదితర వేడుకల్లో సుమ హడావుడి మాములుగా ఉండదు. Also Read: క్వారంటైన్లోకి వెళ్లనున్న రాంచరణ్, ఎన్టీఆర్..! నెలఖారు నుంచి ‘ఆర్ఆర్ఆర్’ యాంకరింగ్ తో స్టార్డమ్ సంపాదించుకోవచ్చని సుమ నిరూపించారు. ఆమెను ఆదర్శంగా తీసుకొని ఇప్పటికే చాలామంది […]

Written By: NARESH, Updated On : October 3, 2020 3:10 pm
Follow us on

సుమ కనకాల గురించి బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు యాంకర్లో సుమ నెంబర్ వన్ గా ఎప్పటి నుంచో కొనసాగుతోంది. యాంకరింగ్ తోపాటు హోస్టుగా బుల్లితెరపై కన్పిస్తూ ప్రతీఒక్కరిని ఆకట్టుకుంటోంది. ఇక సినిమాకు సంబంధించి ఆడియో రిలీజ్ తదితర వేడుకల్లో సుమ హడావుడి మాములుగా ఉండదు.

Also Read: క్వారంటైన్లోకి వెళ్లనున్న రాంచరణ్, ఎన్టీఆర్..! నెలఖారు నుంచి ‘ఆర్ఆర్ఆర్’

యాంకరింగ్ తో స్టార్డమ్ సంపాదించుకోవచ్చని సుమ నిరూపించారు. ఆమెను ఆదర్శంగా తీసుకొని ఇప్పటికే చాలామంది యాంకర్లు బుల్లితెరపై రాణిస్తున్నారు. స్టార్ మహిళ.. క్యాష్.. తదితర షోలతో సుమ కనకాల బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈ షోలలో ఆమె చేసే కామెడీ మాములుగా ఉండదు.

సుమ కనకాల ఎప్పుడూ షూటింగులతో బీజీగా గడుపుతుంటారు. అయితే ఇటీవల కరోనాతో షూటింగులు నిలిచిపోవడంతో ఆమె కావాల్సినంత సమయం దొరికింది. దీంతో ఆమె ఇంటికే పరిమితయ్యారు. తనకు సంబంధించి అప్డేట్స్ ఎప్పటికప్పుడు సుమ సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ అభిమానులతో టచ్లో ఉంటోంది. కరోనా సమయంలో తనవంతుగా పలువురికి సాయం అందించి మానవత్వాన్ని చాటుకుంది.

Also Read: మున్ముందు ఓటీటీ సినిమాలంటే భయపడాలేమో..

తాజాగా సుమ సోషల్ మీడియాలో ఫన్నీ వీడియోను పోస్టు చేసింది. షూటింగ్ లేనపుడు తానేం చేస్తానోతెలుసా? అంటూ సుమ పోస్టుచేసిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇందులో సుమ తన కుక్క బోరోతో కాలక్షేమం చేస్తోంది. బోరో మంచినిద్రలో ఉండగా సుమ సైలెంట్ గా వెళ్లి దానిని డిస్టబ్ చేస్తూ ఉంటుంది. అయితే బోరో మాత్రం సుమను పట్టించుకోకుండా ఒకసారి లేచి.. మళ్లీ పడుకుంటుంది. ఇదంతా ఫన్నీగా ఉండటంతో నెట్టింట్లో వైరల్ అవుతోంది