విగ్రహాలు ధ్వంసం చేస్తున్నా.. నిఘా ఏం చేస్తోంది..?

ఏపీలో జగన్‌ అధికారం చేపట్టినప్పటి నుంచి హిందూ దేవాలయాల్లో ఎక్కడో ఒక చోట దాడులు జరుగుతున్నాయి. విగ్రహాల ధ్వంసం.. రథాల దగ్ధం చూస్తూనే ఉన్నాం. గతేడాది బిట్రగుంటలో రథం దగ్ధానికి మందు మొదలైన ఈ అరాచకాల పర్వం రాష్ట్రంలో మతసామరస్యాన్ని దెబ్బతీసేలా ఉంది. కొన్ని నెలలుగా వరుసగా విగ్రహాల ధ్వంసం జరుగుతున్నా చెప్పుకోదగిన స్ధాయిలో చర్యలు లేకపోవడం, నిందితులను గుర్తించడం, శిక్షించే విషయంలో ప్రభుత్వం చూపుతున్న అలసత్వం, అంతిమంగా నిఘా వైఫల్యం వైసీపీ సర్కారు ప్రతిష్టను మంటగలుపుతున్నాయి. […]

Written By: Srinivas, Updated On : January 2, 2021 11:41 am
Follow us on


ఏపీలో జగన్‌ అధికారం చేపట్టినప్పటి నుంచి హిందూ దేవాలయాల్లో ఎక్కడో ఒక చోట దాడులు జరుగుతున్నాయి. విగ్రహాల ధ్వంసం.. రథాల దగ్ధం చూస్తూనే ఉన్నాం. గతేడాది బిట్రగుంటలో రథం దగ్ధానికి మందు మొదలైన ఈ అరాచకాల పర్వం రాష్ట్రంలో మతసామరస్యాన్ని దెబ్బతీసేలా ఉంది. కొన్ని నెలలుగా వరుసగా విగ్రహాల ధ్వంసం జరుగుతున్నా చెప్పుకోదగిన స్ధాయిలో చర్యలు లేకపోవడం, నిందితులను గుర్తించడం, శిక్షించే విషయంలో ప్రభుత్వం చూపుతున్న అలసత్వం, అంతిమంగా నిఘా వైఫల్యం వైసీపీ సర్కారు ప్రతిష్టను మంటగలుపుతున్నాయి.

Also Read: బాబు ఏ మాత్రం మారలేదట.. : గంటల తరబడి అదే సోదీ

అయినా.. ఇప్పటికీ వీటిపై ప్రభుత్వం నిర్దిష్టమైన చర్యలు తీసుకునేందుకు వెనకాడుతుండటం విపక్షాలకు వరంగా మారుతోంది. అసలేం జరుగుతోందన్న ప్రశ్న సాధారణ ప్రజలను సైతం వేధిస్తోంది. ఈ పరంపర కొత్త ఏడాదిలోనూ కొనసాగుతోంది. గతేడాది చివర్లో విజయనగరం జిల్లా రామతీర్థంలో రాములోరి విగ్రహం తల నరికిన వ్యవహారం సద్దుమణగకముందే డిసెంబర్ 31 అర్ధరాత్రి అంటే తెల్లారితే జనవరి 1న రాజమండ్రిలో మరో విగ్రహం ధ్వంసమైంది. నగరంలోని వరసిద్ధి విఘ్నేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో ఉన్న సుబ్రమణ్యేశ్వరస్వామి విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు.

సరిగ్గా ఇదే సమయంలో విశాఖ మన్యం పాడేరులో గ్రామదేవత కొమాలమ్మ విగ్రహ పాదాలను ఎవరో ధ్వంసం చేశారు. ఈ రెండు ఘటనలపైనా పోలీసులు కేసులు నమోదు చేశారు. రాష్ట్రంలో గతేడాది అంతర్వేది రథం దగ్ధం ఘటన భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసింది. అంతకుముందే బిట్రగుంటలోనూ రథం దగ్ధమైంది. వందల సంఖ్యలో గుళ్లలో విగ్రహాల ధ్వంసం కొత్త ఏడాదిలోనూ కొనసాగుతోంది. అయితే ఇలా మాస్‌ హిస్టిరియీ తరహాలో సాగుతున్న ఈ ఘటనలను గుర్తించడంలో నిఘా విభాగం పూర్తిగా విఫలమైంది. కనీసం ముందుగా తెలుసుకుని ప్రభుత్వాన్ని హెచ్చరించే పరిస్ధితీ కనిపించడం లేదు. దీంతో ప్రభుత్వం కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలోకి వెళ్లిపోతోంది.

Also Read: గంటా శ్రీనివాస్ కు వైసీపీలో నో ఎంట్రీ వెనుక అతడేనా?

రాష్ట్రంలో వరుసగా విగ్రహాల ధ్వంసం కొనసాగుతున్నా, ఏడాది నుంచి ఈ విధ్వంసం సాగుతున్నా నిందితులెవరో గుర్తించలేకపోవడం బహుశా రాష్ట్ర చరిత్రలో సైతం ఇదే తొలిసారని చెప్పవచ్చు. కానీ.. ప్రభుత్వం చర్యలు తీసుకునే విషయంలో వెనకాడుతుండటం కూడా అంతే నిజంగా కనిపిస్తోంది. ఇన్ని గుళ్లలో విగ్రహాల ధ్వంసం జరిగితే ఇందులో కనీసం కొందరి పాత్ర అయినా నిరూపించే ఆధారాలు లభించలేదని అధికారులు కానీ, ప్రభుత్వం కానీ సమర్థించుకోగలదా ? అంతిమంగా ఎవరి లబ్ధి కోసమే జరుగుతున్న రాజకీయానికి వైసీపీ సర్కారు ప్రత్యక్ష సాక్షిగా మిగిలిపోవాలని భావిస్తోందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. అయితే.. ప్రతీసారి మీటింగ్‌లో మాట్లాడుతున్న జగన్‌ ఆలయాలపై దాడులకు పాల్పడుతున్న వారిని ఆ దేవుడే శిక్షిస్తాడు అన్నట్లుగా చెబుతున్నారు. అంతేకానీ.. ఎక్కడా ఇప్పటివరకు నిందితులను పట్టుకున్నదైతే లేదు.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్