Waqf Bill: ఏపీలో ( Andhra Pradesh) ఆసక్తికర రాజకీయాలు వెలుగులోకి వస్తున్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత ఆ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు పదవులు వదులుకొని రాజీనామా బాట పట్టారు. మరికొందరు ముఖ్యులు సైతం పార్టీని వీడారు. ఇటువంటి తరుణంలో మరో ఆసక్తికర పరిణామం జరిగింది. వైసీపీ నిర్ణయానికి వ్యతిరేకంగా రాజ్యసభ సభ్యుడు ఒకరు ఓ బిల్లు విషయంలో ఓటు వేయడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ఇప్పటికే రాజ్యసభకు సంబంధించి ముగ్గురు రాజీనామా చేశారు. విజయసాయిరెడ్డి రాజ్యసభ పదవితో పాటు పార్టీ పదవులను సైతం వదులుకున్నారు. దీంతో రాజ్యసభలో వైయస్సార్ కాంగ్రెస్ బలం ఏడుకు చేరుకుంది. ఆ ఏడుగురులో కూడా ఒకరు పార్టీకి వ్యతిరేకంగా మారారన్న వార్త హల్చల్ చేస్తోంది.
Also Read: హౌతీలపై అమెరికా దాడులు.. వీడియో విడుదల చేసిన ట్రంప్
* పార్లమెంటులో బిల్లు ఆమోదం.. పార్లమెంటులో( parliament) వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదానికి నోచుకుంది. కేంద్రం ప్రవేశపెట్టిన ఈ బిల్లు ముందుగా లోక్ సభలో ఆమోదం నోచుకోగా.. రాజ్యసభలో సైతం మెజారిటీ సభ్యులు జై కొట్టడంతో పాస్ అయింది. అయితే కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా రాజ్యసభలో ఒక ఓటు అధికంగా రావడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు ఒకరు అనుకూలంగా ఓటు వేసినట్లు ప్రచారం జరుగుతోంది. కేంద్రంలో తెలుగుదేశం పార్టీ కీలక భాగస్వామి కావడంతో కొన్ని సవరణలతో ఈ బిల్లుకు మద్దతు తెలిపింది టిడిపి. జనసేన అయితే బాహటంగానే మద్దతు ప్రకటించింది. అయితే ఇది ముస్లింల ప్రయోజనాలకు సంబంధించి బిల్లు కావడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం వ్యతిరేకించింది. వ్యతిరేకంగా ఓటు వేస్తామని చెప్పింది. ఏకంగా విప్ జారీ చేసింది.
* ఆ ఏడుగురులో ఒకరు..
అయితే రాజ్యసభలో( Rajya Sabha ) ఈ బిల్లు ఓటింగ్ సమయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు ఒకరు క్రాస్ ఓటింగ్ కు పాల్పడినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ముగ్గురు రాజ్యసభ సభ్యులు రాజీనామా చేశారు. విజయసాయిరెడ్డి సైతం గుడ్ బై చెప్పారు. అటు తర్వాత కూడా రకరకాల పేర్లు వినిపించాయి. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్లిన రాజ్యసభ సభ్యులు ఎవరనేది ఒక చిక్కుముడిగా ఉండేది. అయితే ఇప్పుడు పార్టీ విప్ జారీ చేసిన వ్యతిరేకంగా ఓటు వేసిన సభ్యుడు ఎవరు అనేది సర్వత్ర చర్చకు దారి తీసింది. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఏడుగురిలో.. క్రాస్ ఓటు చేసింది ఎవరు అనేది ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో ప్రశ్నగా మిగిలింది.
* ఆ ఎంపీ పై అనుమానం..
గతంలో దేశ పారిశ్రామిక దిగ్గజం ఒకరు జగన్మోహన్ రెడ్డిని ( Jagan Mohan Reddy)కలిశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఓ రాజ్యసభ పదవిని సైతం తన సన్నిహితుడికి ఇప్పించుకున్నారు. పారిశ్రామికవేత్త కావడంతో బిజెపితో వారికి అనుబంధం ఉంది. ఇప్పుడు బిజెపి ఈ కీలకమైన బిల్లు ఆమోదించుకునే క్రమంలో సదరు ఎంపీ తో సంప్రదించినట్లు తెలుస్తోంది. అందుకే ఆయన క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారని సమాచారం. మరి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హై కమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.