Hit 3 : తెలుగు సినిమా ఇండస్ట్రీలో కామెడీ, ఫ్యామిలీ సినిమాలను చేస్తూ తనకంటూ ఒక మంచి గుర్తింపును తెచ్చుకున్న హీరో నాని…మొదట్లో ఇలాంటి సినిమాలు చేసినప్పటికి దసర (Dasara) మూవీతో మాస్ అవతారం ఎత్తాడు. ఈ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించడంతో ఆ తర్వాత నుంచి మాస్ సినిమాలు చేయడానికి ఆయన ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం హిట్ 3 సినిమాలో కూడా నాని ఒక డిఫరెంట్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. ఇక ఈ సినిమాలో ఒక సైకో టైప్ ఆఫ్ పాత్రను కూడా పోషించినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమా టీజర్ ని కనక మనం చూసినట్టయితే సినిమా మొత్తం లో నాని స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్నారు అనే విషయమైతే చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఈ సినిమాలో తమిళ్ స్టార్ హీరో అయిన కార్తీ కూడా ఒక క్యామియో పాత్ర పోషించబోతున్నాడనే వార్తలైతే వస్తున్నాయి. ఇక దాంతో పాటుగా హిట్ 4 ఫ్రాంచైజీలో మెయిన్ హీరోగా నటించబోతున్నాడు అనే విషయం కూడా తెలుస్తోంది. మొత్తానికైతే హిట్ ఫ్రాంచైజ్ ని చాలా సక్సెస్ ఫుల్ గా ముందుకు తీసుకెళుతున్న డైరెక్టర్ శైలేష్ కొలన్ మీద నాని భారీ అంచనాలైతే పెట్టుకున్నాడు. ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమా హిట్ అవుతూ ఉండడంతో హిట్ సీక్వెల్స్ పరంపరం కొనసాగిస్తూ ముందుకు సాగుతున్నారు.
ఇక వీళ్ళందర్నీ సినిమాలో ఏకం చేయాలనే ఉద్దేశ్యంతోనే దర్శకుడు శైలేష్ కొలన్ ఈ ప్రాంచైజ్ ను కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇంతకు ముందు సైంధవ్ (Saindhav) సినిమా తో భారీ డిజాస్టర్ ని మూట గట్టుకున్న శైలేష్ కొలన్ హిట్ 3 మూవీతో సక్సెస్ బాట పట్టాలనే ప్రయత్నంలో ఉన్నాడు.
మరి తను అనుకున్నట్టుగానే భారీ సక్సెస్ ని సాధించి ఆ తర్వాత మరో సినిమాతో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నంలో ఉన్నాడు. ఇక మొత్తానికైతే ఒక ప్రాంచైజ్ ను ముందుకు తీసుకురావాలనే ఉద్దేశ్యంతో దర్శకుడు శైలేష్ కొలన్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక నాని కూడా ఈ ఈ ఫ్రాంచైజీలను చాలా గొప్పగా తీర్చిదిద్దాలనే ప్రయత్నంలో ఉన్నాడు. అందుకోసమే ప్రతి సినిమాను నెక్స్ట్ లెవెల్ లో నిలిపే ప్రయత్నం చేస్తున్నాడు…
మరి కార్తీ క్యామియో ఏ రేంజ్ లో ఉంటుంది హిట్ 3 సూపర్ సక్సెస్ అయి హిట్ 4 కి లీడ్ ఇస్తుందా? లేదా అనే విషయాలు తెలియాలంటే మాత్రం ఈ సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే… నాని పాత్ర ప్రేక్షకుల్లో ఎంతటి ఇంపాక్ట్ ను క్రియేట్ చేస్తుంది అనేది ఇప్పుడు కీలకంగా మారబోతోంది…
Also Read : ‘హిట్ 3′ ప్రపంచం లోకి ‘ఖైదీ’..ఇదేమి ప్లానింగ్ సామీ!