పార్టీలకు నగరవాసుల జలక్.. ఒక్కశాతం కూడా మించని ఓటింగ్..!

జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగిన సంగతి తెల్సిందే. ప్రధాన పార్టీలన్నీ జాతరను తలపించేలా ప్రచారం చేశాయి. ఎంతో ఉత్సాహంగా నేతలు ప్రచారం చేశారు. తీరా పోలింగ్ తేది వచ్చేనాటికి అన్ని పార్టీలన్నీంటికీ నగరవాసులకు జలక్ ఇచ్చినట్లు కన్పిస్తోంది. నేటి ఉదయం 7గంటల నుంచే జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభంకాగా ఓటర్లు మాత్రం పోలింగ్ కేంద్రాలకు పెద్దగా రావడం లేదు. Also Read: హైకోర్టులో మరో పిటిషన్.. ఆ మంత్రులకు ‘రంగు’ పడుద్దా? కరోనా నిబంధనలను […]

Written By: Neelambaram, Updated On : December 1, 2020 4:23 pm
Follow us on


జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగిన సంగతి తెల్సిందే. ప్రధాన పార్టీలన్నీ జాతరను తలపించేలా ప్రచారం చేశాయి. ఎంతో ఉత్సాహంగా నేతలు ప్రచారం చేశారు. తీరా పోలింగ్ తేది వచ్చేనాటికి అన్ని పార్టీలన్నీంటికీ నగరవాసులకు జలక్ ఇచ్చినట్లు కన్పిస్తోంది. నేటి ఉదయం 7గంటల నుంచే జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభంకాగా ఓటర్లు మాత్రం పోలింగ్ కేంద్రాలకు పెద్దగా రావడం లేదు.

Also Read: హైకోర్టులో మరో పిటిషన్.. ఆ మంత్రులకు ‘రంగు’ పడుద్దా?

కరోనా నిబంధనలను పాటిస్తూ ఎన్నికల అధికారులు ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే నగర ఓటర్లు మాత్రం పోలింగ్ పై పెద్దగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. ఉదయం నుంచి మందకొడిగా సాగిన పోలింగ్ మధ్యాహ్నం వరకు కూడా అలానే సాగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు కూడా కొన్ని డివిజన్లలో ఒక్కశాతం కూడా పోలింగ్ కాకపోవడం గమనార్హం.

జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ సరళిని చూస్తుంటే నగరవాసులంతా అన్ని రాజకీయ పార్టీలకు జలక్ ఇచ్చాయా? అనే సందేహాలు కలుగుతున్నాయి. అక్షరాస్యతలో నెంబర్ వన్ స్థానంలో ఉండే హైదరాబాద్.. ప్రజాస్వామ్యంలో కీలక పాత్ర పోషించే ఎన్నికల పట్ల విముఖత చూపడం ఏంటనే సందేహాలు కలుగుతున్నాయి.

ప్రతీ ఎన్నికలోనూ నగరవాసులు 50శాతానికి అటూ.. ఇటూగా పాల్గొంటుండటం చూస్తున్నాం. అయితే ఈసారి మరీ దారుణంగా ఉండటం శోచనీయంగా మారింది. కేవలం కరోనా పరిస్థితులే కాకుండా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా చేసేదేమీ లేదని నిరాసక్తతోనే నగరవాసులు ఓటింగ్ దూరంగా ఉంటున్నారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.

Also Read: రాజకీయాల్లో సూపర్ స్టార్ కంటే పవర్ స్టార్ నయమా?

ఒంటిగంట వరకు పోలింగ్ శాతం పరిశీలిస్తే..

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ శాతాన్ని పరిశీలిస్తే.. గుడిమల్కాపూర్ డివిజన్‌లో 49.19శాతం అత్యధికంగా పోలింగ్ నమోదైంది. రెయిన్ బజార్‌ డివిజన్‌లో 0.56శాతం నమోదైంది. తలాబ్ చంచలం డివిజన్లో 0.74శాతం.. అమీర్‌పేట్‌లో 0.79శాతం.. జూబ్లీహిల్స్ సర్కిల్‌లోని షేక్‌పేటలో 2.62.. జియాగూడ.. కార్వాన్ డివిజన్లలో 3.85.. చంద్రాయణ్‌గుట్ట సర్కిల్‌లోని కంచన్‌బాగ్‌లో 2.13.. శాలిబండలో 3.85.. దబీర్‌పురలో 5.39.. అత్తాపూర్‌లో 3.85.. బేగం బజార్లో 3.85.. సోమాజీగూడలో 2.77.. కుత్బుల్లాపూర్ సర్కిల్‌లోని సుభాష్‌నగర్‌లో 3.85శాతం పోలింగ్ నమోదైంది.

ఇక శివారు ప్రాంతాలైన రామచంద్రాపురం.. పటాన్‌చెర్వు.. భారతీనగర్.. చిలకానగర్.. హస్తినాపురం.. మూసాపేట్ సర్కిల్‌లోని అల్లాపూర్.. గాజులరామారంలోని జగద్గిరిగుట్ట డివిజన్లో 42.94శాతం, గుడిమల్కాపూర్‌లో 49.19%, గోషామహల్ సర్కిల్‌లోని దత్తత్రేయనగర్‌లో 40.86శాతం చొప్పున అత్యధికంగా పోలైందని సమాచారం. అయితే సాయంత్రం 6గంటల వరకు పోలింగ్ సమయం ఉండటంతో కొద్దిగా పోలింగ్ శాతం పెరిగే అవకాశం కన్పిస్తోంది. ప్రస్తుత పోలింగ్ సరళి చూస్తుంటే మాత్రం నగరవాసులు జీహెచ్ఎంసీ ఎన్నికలపట్ల విముఖతగా ఉన్నట్లు స్పష్టంగా కన్పిస్తోంది.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్