మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం చేస్తోన్న ‘ఆచార్య’ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో శరవేగంగా జరుగుతుంది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా మరో రెండు మూడు నెలల్లో పూర్తి అయ్యే అవకాశం ఉందట. అందుకే మెగాస్టార్ తన తరువాత సినిమాలను కూడా వరుసగా లైన్ లో పెడుతున్నారు. ఆచార్య సినిమా తర్వాత చిరు రెండు సినిమాలను ఇప్పటికే కన్ఫర్మ్ చేసాడు. తమిళ హిట్ మూవీ ‘వేదాళం’ రీమేక్ తో పాటు లూసిఫర్ రీమేక్ ఒకటి. కాగా తెలుగులో వేదాళంను డైరెక్ట్ చేయబోతున్న దర్శకుడు మెహర్ రమేష్ ఒరిజినల్ స్క్రిప్ట్ లో చాలా మార్పులు చేర్పులు చేశాడు.
Also Read: ప్రజలకు మన స్టార్ హీరోల పిలుపు
అయితే ఇప్పటివరకూ అధికారికంగా ఈ సినిమా ప్రకటన అయితే రాలేదు కాని, సినిమాకు సంబంధించిన పనులు మాత్రం చాలా నెలలుగా జరుగుతున్నాయి. తాజాగా ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ ను బట్టి మెహర్ రమేష్ ఈ సినిమాలో చిరంజీవి లేకుండానే కొన్ని కీలకమైన సన్నివేశాలను కోల్‌కత్తాతో పాటు కీలక ప్రాంతాల్లో చిత్రీకరణ కూడా జరిపాడట. టైటిల్స్ వేయకముందు వచ్చే ఈ సీన్స్ లో ఎక్కువ మోంటేజ్ షాట్స్ ఉంటాయని.. ఆ షాట్స్ ను మెహర్ రమేష్ షూట్ చేశాడని తెలుస్తోంది. అలాగే సినిమాలో భాగంగా ఒక దసరా ఉత్సవం ఉంటుంది. దాన్ని కూడా షూట్ చేశారట.
Also Read: రాజమౌళియా మాజాకా? యాక్షన్ సీన్ కోసం అన్ని రోజులా?
మొత్తానికి చిరంజీవి వేదాళం.. చిరు లేకుండానే పట్టాలెక్కింది అన్నమాట. ఇక ఆచార్య షూటింగ్ పూర్తి అయిన వెంటనే ఏమాత్రం గ్యాప్ లేకుండా ఈ రీమేక్ షూటింగ్ లో చిరు కూడా జాయిన్ అవుతాడట. అన్నట్లు ఆచార్య వచ్చిన కేవలం రెండు నెలలకే వేదాళం రీమేక్ తో కూడా చిరంజీవి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఏది ఏమైనా మెహర్ రమేష్ కెరీర్ కు ఈ సినిమా ఎంతో కీలకం. వరుస ఫ్లాప్ లతో ఆరు సంవత్సరాలు ఖాళీగా ఉన్న మెహర్ రమేష్ కి చిరు ఛాన్స్ ఇవ్వడం నిజంగా గొప్ప విషయమే.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్