Vladimir Putin- Yevgeny Prigozhin: శత్రువును ఇంటికి పిలిచిన రష్యా అధ్యక్షుడు.. ఆ మీటింగ్ ఏమైంది? యెవ్జెనీ ప్రిగోజిన్‌ ఎక్కడున్నాడు…?

35 మంది వాగ్నర్‌ కమాండర్లలో కిరాయి సైనిక బృందానికి నాయకత్వం వహిస్తున్న ప్రిగోజిన్‌ మాస్కోలో జరిగిన సమావేశానికి వచ్చాడని తెలిసింది.

Written By: Raj Shekar, Updated On : July 11, 2023 2:06 pm

Vladimir Putin- Yevgeny Prigozhin

Follow us on

Vladimir Putin- Yevgeny Prigozhin: రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం మొదలై 500 రోజులు దాటింది. కానీ ఇప్పటికీ రష్యా దాడులు ఆపడం లేదు. ఉక్రెయిన్‌ వెనక్కి తగ్గడం లేదు. ఈ క్రమంలో గత నెలలో రష్యా కిరాయి సైన్యం వాగ్నర్‌ గ్రూపు అధ్యక్షుడిపై తిరుగుబాటు చేసింది. అయితే దీనిని ఆదిలోనే అణచివేశాడు రష్యా అధినేత వ్లాదిమిర్‌ పుతిన్‌. అయితే ఈ పరిణామం తర్వాత వాగ్నర్‌ గ్రూపు అధినేత యెవ్జెనీ ప్రిగోజిన్‌ దేశం విడిచి వెళ్లాడని ప్రచారం జరిగింది. కానీ, అతడితో రష్యా అధ్యక్షుడు మంతనాలు జరిపినట్లు క్రెమ్లిన్‌ తెలిపింది. తిరుబాటు దారునితో పుతిన్‌ మంతనాలు జరపడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ప్రిగోజిన్‌ ఎక్కడున్నాడు.. చర్చల సారాంశం ఏమై ఉంటుందన్న ఇప్పుడు కీలకంగా మారింది.

కిరాయి సైన్యానికి నాయకుడు..
35 మంది వాగ్నర్‌ కమాండర్లలో కిరాయి సైనిక బృందానికి నాయకత్వం వహిస్తున్న ప్రిగోజిన్‌ మాస్కోలో జరిగిన సమావేశానికి వచ్చాడని తెలిసింది. ఈమేరకు అధ్యక్షుడు పుతినే ఆహ్వానించినట్లు క్రెమ్లిన్‌ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్‌ తెలిపారు. జూన్‌ 23న ప్రారంభించిన తిరుగుబాటు కేవలం 24 గంటలు మాత్రమే కొనసాగింది. తిరుగుబాటును ముగించే ఒప్పందం ప్రకారం, వాగ్నెర్‌ దళాలు ఒక నగరాన్ని స్వాధీనం చేసుకుని, మాస్కోపై కవాతు చేయాలనుకున్నాయని ప్రిగోజిన్‌పై ఆరోపణలు వచ్చాయి. తిరుగబాటు అణచివేత తర్వాత ప్రిగోజిన్‌ బెలారస్‌ వెళ్లాడని, అందుకు పుతినే అవకాశం క్పించాడని సమాచారం. తాజాగా సమావేశానికి ఆహ్వానించడం చర్చనీయాంశమైంది. ఈ సమావేశంలో అధ్యక్షుడు కంపెనీ చర్యలను అంచనా వేశారు’ అని మిస్టర్‌ పెస్కోవ్‌ ఇంటర్‌ఫాక్స్‌ వార్తా సంస్థ ద్వారా చెప్పబడింది. భవిష్యత్‌ ఉపాధి మరియు పోరాటంలో వారి భవిష్యత్తు ఉపయోగం వైవిధ్యాలను సూచించారని పేర్కొన్నారు.

వాగ్నర్‌ చీఫ్‌ ఆచూకీపై అస్పష్టత..
పుతిన్‌ తిరుగుబాటుదారుని కలిసినప్పుడు పుతిన్‌ చెఫ్‌ నుండి రెబల్‌ ఇన్‌ చీఫ్‌ ప్రిగోజిన్‌ రష్యాలో ఉన్నారని చెప్పారు. తర్వాత ప్రిగోజిన్‌ ప్రైవేట్‌ జెట్‌ జూన్‌ చివరలో బెలారస్‌కు ఎగురుతున్నట్లు గుర్తించారు. అదే రోజు సాయంత్రం రష్యాకు తిరిగి రావడాన్ని బీబీసీ ట్రాక్‌ చేసింది.