Vizag: ఒక కోడి, క్వార్టర్ మద్యం.. దసరా పండుగ చేసుకోండి

జగన్ సర్కార్ రాజధానిగా భావిస్తున్న విశాఖలో మాత్రం వైసిపి ముందస్తుగానే ఎన్నికల క్యాంపెయిన్ను ప్రారంభించింది.దసరా సందర్భంగా విశాఖ తూర్పు నియోజకవర్గం ఇంచార్జ్, విశాఖ ఎంపీ ఎంవిబి సత్యనారాయణ అయితే నియోజకవర్గంలో స్వీట్లు పంచి పెట్టారు.

Written By: Dharma, Updated On : October 25, 2023 12:39 pm

Vizag

Follow us on

Vizag: ఏపీలో ఎన్నికల ఫీవర్ నెలకొంది. ఇప్పటికే నాయకులు ఎన్నికలకు సమాయత్తమవుతున్నారు.అన్ని రాజకీయ పక్షాలు దూకుడు పెంచాయి. ఈ ఆరు నెలల పాటు ప్రజల మధ్య ఉండేందుకు ప్లాన్ చేశాయి. అధికార వైసీపీ బస్సు యాత్రకు సిద్ధపడుతుండగా.. నారా భువనేశ్వరి సంఘీభావ యాత్ర.. నారా లోకేష్ భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంతో ప్రజల మధ్యకు వెళ్ళనున్నారు. అటు పవన్ సైతం వారాహి యాత్రతో ఎన్నికల శంఖారావాన్ని పూరించారు.

జగన్ సర్కార్ రాజధానిగా భావిస్తున్న విశాఖలో మాత్రం వైసిపి ముందస్తుగానే ఎన్నికల క్యాంపెయిన్ను ప్రారంభించింది.దసరా సందర్భంగా విశాఖ తూర్పు నియోజకవర్గం ఇంచార్జ్, విశాఖ ఎంపీ ఎంవిబి సత్యనారాయణ అయితే నియోజకవర్గంలో స్వీట్లు పంచి పెట్టారు. ప్రతి ఇంటికి అరకిలో స్వీట్లు పంపిణీ చేశారు. నియోజకవర్గంలో 80,000 ఇళ్లు ఉండగా.. వార్డు వాలంటీర్ల ద్వారా సీట్లను అందించారు. కొద్ది రోజుల కిందటే ఎంపీ ఎంపీపీ సత్యనారాయణ ను తూర్పు నియోజకవర్గ ఇన్చార్జిగా జగన్ ప్రకటించారు. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే గా ఉన్న వెలగపూడి రామకృష్ణ బాబును దెబ్బ కొట్టాలంటే.. ఆర్థిక బలమున్న ఎంవీవీ అయితేనే సరిపోతారని భావించారు.అందుకు తగ్గట్టుగానే ఎంవివి సత్యనారాయణ లక్షలాది రూపాయలు ఖర్చుపెట్టి స్వీట్లు పంపిణీ చేయడం విశేషం. మున్ముందు నియోజకవర్గంలో పంపిణీ ఎలా ఉంటుందో సంకేతాలు ఇచ్చారు.

ఒక విశాఖ దక్షిణ నియోజకవర్గంలో చిత్ర విచిత్రాలు చోటుచేసుకున్నాయి. ఇక్కడ టిడిపి సిట్టింగ్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ వైసీపీలో చేరారు. వచ్చే ఎన్నికల్లో ఆయన్నే పోటీ చేయించేందుకు వైసిపి డిసైడ్ అయ్యింది. ఈ నేపథ్యంలో అక్కడ ఆయన గట్టి పోటీని ఎదుర్కోనున్నారు. ఈ తరుణంలో ఆయన ముందస్తుగానే తాయిలాలు ప్రకటించడం విశేషం. దసరా సందర్భంగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న దక్షిణ నియోజకవర్గంలో ఎంపిక చేసిన కొంతమందికి ఏకంగా కుక్కర్లు పంపిణీ చేశారు. అదే నియోజకవర్గానికి చెందిన.. 31,32,33, 34 వార్డులకు వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న దొడ్డి బాబు ఆనంద్ తన అనుచరులకు ఒక్కొక్కరికి ఒక కోడి, ఒక మద్యం సీసాను అందించడం విశేషం. ప్రస్తుతం ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా విశాఖలో దసరాకు తాయిలాలు పంపిణీ చేయడం విశేషం.