Bhagavanth Kesari Collections: భగవంత్ కేసరి వసూళ్లు బాక్సాఫీస్ వద్ద నిలకడగా ఉన్నాయి. పండగ రోజుల్లో ఈ చిత్రం పుంజుకుంది. పోటీగా విడుదలైన టైగర్ నాగేశ్వరరావు, లియో నెగిటివ్ టాక్ తెచ్చుకున్నాయి. అది భగవంత్ కేసరి ప్లస్ అయ్యింది. భగవంత్ బ్రేక్ ఈవెన్ కి చేరువ అవుతుంది. భగవంత్ కేసరి ఆరు రోజుల వసూళ్లు పరిశీలిస్తే ఈ విధంగా ఉన్నాయి. నైజాంలో రూ.12.7 కోట్లు వసూలు చేసింది. ఇక సీడెడ్ రూ.10.9 కోట్ల వరకు రాబట్టింది.
ఉత్తరాంధ్రలో రూ. 3.8 కోట్లు వసూలు చేసింది. కర్ణాటక రూ. 3.8 కోట్లు, రెస్టాఫ్ ఇండియా రూ.0.5 కోట్లు, ఓవర్సీస్ రూ. 6 కోట్ల షేర్ వసూలు చేసింది. వరల్డ్ వైడ్ భగవంత్ కేసరి రూ.51.8 కోట్ల షేర్ వసూలు చేసినట్లు నిర్మాతలు వెల్లడించారు. ఇది జీఎస్టీతో కలుపుకుని అని చెప్పారు. 6వ రోజు భగవంత్ కేసరి జోరు చూపించింది. ఆ ఒక్క రోజు దాదాపు రూ. 8 కోట్ల షేర్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం.
ఇక భగవంత్ కేసరి వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తే… ఏపీ/తెలంగాణాలలో భగవంత్ కేసరి రూ.55 కోట్ల బిజినెస్ చేసింది. వరల్డ్ వైడ్ రూ. 67 కోట్ల వరకూ థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు సమాచారం. అంటే రూ. 68 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాలయ్య దసరా బరిలో దిగారు. దాదాపు మరో రూ. 16 కోట్ల వసూళ్ళు సాధిస్తే కానీ భగవంత్ కేసరి హిట్ టాక్ తెచ్చుకోదు. అయితే నిర్మాతల నెంబర్స్ కి ట్రేడ్ వర్గాల లెక్కలకు పొంతన లేదు.
భగవంత్ కేసరి చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకుడు. ఎమోషనల్ అంశాలతో కూడిన యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కించారు. బాలయ్యకు కూతురు కాని కూతురు పాత్రలో శ్రీలీల అద్భుతంగా నటించింది. కాజల్ హీరోయిన్ గా నటించింది. ఆమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదు. బాలయ్య తన గత చిత్రాలకు భిన్నంగా ట్రై చేశాడు. భగవంత్ కేసరి చిత్రానికి థమన్ సంగీతం అందించాడు.