జగన్ విశాఖ ప్రయాణం!

విశాఖపట్నం సమీపంలోని ఆర్ఆర్ వెంటకటాపురంలో ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో గ్యాస్ లీక్ కారణంగా మరణించిన వారి కుటుంబాలను సీఎం జగన్ పరామర్శించనున్నారు. అలాగే గ్యాస్ లీక్  సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవడానికి సీఎం వైజాగ్ వెళ్లనున్నారు. ఇప్పటికే ఈ ఘటనపై సీఎం జగన్ విశాఖ కలెక్టర్‌ వినయ్‌ చంద్‌ కు ఫోన్‌ చేసి సమాచారం తెలుసుకున్నారు. తక్షణమే సహాయ కార్యక్రమాలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. కాగా గ్యాస్ తీవ్రత చాలా వరకు తగ్గిందని అధికారులు చెబుతున్నారు. గ్యాస్‌ […]

Written By: Neelambaram, Updated On : May 7, 2020 1:53 pm
Follow us on

విశాఖపట్నం సమీపంలోని ఆర్ఆర్ వెంటకటాపురంలో ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో గ్యాస్ లీక్ కారణంగా మరణించిన వారి కుటుంబాలను సీఎం జగన్ పరామర్శించనున్నారు. అలాగే గ్యాస్ లీక్  సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవడానికి సీఎం వైజాగ్ వెళ్లనున్నారు. ఇప్పటికే ఈ ఘటనపై సీఎం జగన్ విశాఖ కలెక్టర్‌ వినయ్‌ చంద్‌ కు ఫోన్‌ చేసి సమాచారం తెలుసుకున్నారు. తక్షణమే సహాయ కార్యక్రమాలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. కాగా గ్యాస్ తీవ్రత చాలా వరకు తగ్గిందని అధికారులు చెబుతున్నారు.

గ్యాస్‌ ప్రభావానికి రహదారిపై అపస్మారక స్థితిలో పడిపోయిన వారిని చూసి బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. ఏం జరుగుతుందో తెలియక ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని ఒక్కసారిగా  పరుగులు తీశారు. కన్నబిడ్డలు కళ్లెదుట ఊపిరాడక విల్లవిల్లాడుతుంటే చూసి  కన్నీరుమున్నీరవడం తప్ప ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు వారి తల్లిదండ్రులు.

గ్యాస్‌ లీకేజ్‌ అవడంతో గంగరాజు అనే స్థానికుడు ప్రాణ భయంతో పరుగులు తీస్తూ కళ్లు సరిగా కనిపించకపోవడంతో నేల బావిలో పడి మృతి చెందాడు. గ్యాస్ తీవ్రతకు పలు ప్రాంతాల్లో పశువులు మృతి చెందగా, చెట్లు, మొక్కలు నల్లగా మాడిపోయాయి. మంత్రి అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్యే అదీప్ రాజ్ తదితరులు కూడా సహయా చర్యలు పర్యవేక్షిస్తున్నారు.