YSR Family
YSR Family: వైఎస్.వివేకానందరెడ్డి హత్యకేసు విచారణ వేగవంతమైంది. ఈ కేసులో సీబీఐ దూకుడు ప్రదర్శిస్తోంది. ఈనెల చివరి వరకు విచారణ పూర్తి చేయాలని సీబీఐని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో సీబీఐ కూడా విచారణ వేగవంతం చేసింది. ఈ క్రమంలో వైఎస్ ఫ్యామిలీ, వారి సంబంధాలు, అనుబంధాల గురించి, ముఖ్యమంత్రి జగన్, ఆయన భార్యకు నిందితులతో ఉన్న రిలేషన్‌షిప్‌పై వీడియోలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. నెటిజన్లు ఎంత గొప్ప ఫ్యామిలీరా నాయనా అంటూ సెటైర్లు వేస్తున్నారు.
తాతా ముత్తాతల నుంచి..
వైఎస్ కుటుంబంలో బంధాలు తాత ముత్తాతల నుంచి కొనసాగుతున్నాయి. వివేకానంద హత్య కేసులో తాజాగా వైఎస్ కుటుంబ సభ్యుల అరెస్టులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఇటీవల వైఎస్.భాస్కర్‌రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ భాస్కర్‌రెడ్డి ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి భార్య భారతికి సొంత మేనమామ. భారతి తల్లి సుగుణమ్మకు ఆయన సోదరుడు. మరోవైపు భాస్కర్‌రెడ్డి భార్య లక్ష్మి కూడా భారతికి మేనత్త, భారతి తండ్రి ఈసీ గండిరెడ్డి సోదరే లక్ష్మి. భాస్కర్‌రెడ్డి, లక్షిమది కుండ మార్పిడి వివాహం.
రాజశేఖరరెడ్డి తాతక ఇద్దరు భార్యలు..
ఇక దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి తాత వైఎస్.వెంకటరెడ్డికి ఇద్దరు భార్యలు. మొదటి భార్య లక్ష్మమ్మ కుమారుడు చిన్న కుమారుడు చిన్న కొండారెడ్డి తొమ్మిదో కుమారుడు వైఎస్.భాస్కర్‌రెడ్డి. ఆరో కుమార్తె ఈసీ సుగుణమ్మ. వెంకటరెడ్డి రెండో భార్య మంగమ్మ ఐదో కుమారుడు వైఎస్.రాజారెడ్డి. ఆయన ఇద్దరు కుమారులు వైఎస్.రాజశేఖరరెడ్డి, వైఎస్.వివేకానందరెడ్డి. ఇక ఇటీవల అరెస్ట్ అయిన భాస్కర్‌రెడ్డి సీఎం జగన్‌కు సమీప బంధువు, వరుసకు చిన్నాన్న. జగన్ భార్య భారతికి కూడా అత్యంత దగ్గరి బంధువు. జగన్‌కంటే భారతికే భాస్కర్‌రెడ్డి దగ్గరి చుట్టం.
జగన్‌కు చిన్నాన్న… భారతికి మేనమామ..
వైఎస్.భాస్కర్‌రెడ్డి జగన్‌కు చిన్నాన్న అయితే.. భారతికి మేనమామ అవుతారు. భారతి తల్లి ఈసీ సుగుణమ్మ, భాస్కర్‌రెడ్డి అక్క తమ్ముళ్లు. భారతి మేనత్తే భాస్కర్‌రెడ్డి భార్య. ఇక వైఎస్. భారతి తల్లి సుగుణమ్మ వివేకానంద హత్యకేసులో విచారణ ఎదుక్కొంటున్న కడప ఎంపి వైఎస్.అవినాష్‌రెడ్డికి మేనత్త అవుతారు. అవినాష్‌రెడ్డి తల్లి లక్ష్మి భారతికి మేనత్త అవుతుంది. అందుకే కడప ఎంపీ అవినాష్‌రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్‌రెడ్డిపై ముఖ్యమంత్రి దంపతులకు ఆప్యాయత ఎక్కువ.
YSR Family
అవినాష్ అనుచరుడితో జగన్‌కు సబంధం..
అవినాష్‌రెడ్డి అనుచరుడు అయిన శివశంకర్‌రెడ్డికి జగన్‌తో సంబంధాలు ఉన్నాయని చెబుతారు. ఈమేరకు వివేకానంద అనుచరుడు నర్ర రాజశేఖరరెడ్డి గతంలో సీబీఐకి ఇచ్చిన వాగ్మూలంలో వైఎస్ వంశవృక్షం గురించి వివరించాడు. భారతికి భాస్కర్‌రెడ్డి సొంత మేనమామ కావడం, అవినాష్‌రెడ్డి మేనత్త కొడుకు కావడంతో జగన్ కూడా వారివైపే మొగ్గుచూపారని రాజకీయవర్గాల్లో టాక్.
మొత్తంగా ఈ వంశవృక్షం వీడియోపై మీమ్స్, సెటైర్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.