YS Vivekananda Reddy Murder Case: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఓ కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తన్నాయి. ఇన్నాళ్లుగా సీబీఐ కేసును పలు కోణాల్లో విచారణ చేపట్టారు. ఇందులో పలు కీలక విషయాలు వెలుగు చూశాయి. మొదట వివేకాది సహజ మరణమే అని భావించారు తరువాత క్రమంలో అది హత్యగా అనుమానించి లోతుగా అధ్యయనం చేశారు. దీంతో పలు కొత్త కోణాలు వెలుగు చూశాయి.
దీంతో వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి, మరో నిందితుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిలపై చార్జీషీటు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ పెద్ద కేసు కావడంతో రాజకీయంగా వచ్చే పరిణామాలపై ఆలోచించి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వారిపై చార్జీషీటు నమోదు చేయాలని సీబీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కేసు విషయాలు బహిర్గతం కావడంతో వివేకా కేసు ఓ కొలిక్కి వచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం.
Also Read: అమరావతిని అభివృద్ది చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.. హైకోర్టు సంచలన తీర్పు
అప్రూవర్ గా మారిని దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం మేరకు కేసు దాదాపు చిక్కుముడి వీడినట్లే కనిపిస్తోంది. దీంతో దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి తనకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయని తనకు బెయిల్ మంజూరు చేయాలని పెట్టుకున్న అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. నిందితుడికి బెయిల్ ఇస్తే సాక్షులను బెదిరించే అవకాశాలున్నట్లు తేల్చింది. దీంతో కేసు పురోగతిలో వస్తున్న మార్పులతో కేసు తుది దశకు చేరినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్న కోర్టు పలు కోణాల్లో ముందుకు కదులుతోంది. దీంతో ఎక్కువ రోజులు నాన్చకుండా నిందితులపై చర్యలు తీసుకునేందుకు చార్జీషీటు నమోదు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో వివేకా హత్య కేసు త్వరలోనే పరిష్కారం కనుగొనే వీలు కలుగుతుందని తెలుస్తోంది.
దీంతో వివేకా హత్య కేసు విషయంలో ఇంకా ఎక్కువ రోజులు కొనసాగించరనే విషయం తేటతెల్లమవుతోంది. వివేకా కూతురు సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డి లు చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో కూడా వారు చెప్పిన విషయాలపై ఫోకస్ పెట్టనున్నట్లు చెబుతున్నారు. దీంతో త్వరలో కేసు పరిష్కారమయ్యే దిశగా వస్తున్నట్లు సమాచారం.
Also Read: మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్రలో జితేందర్ రెడ్డి, డీకే అరుణ పేర్లు తెరపైకి? అసలు కథేంటి?