https://oktelugu.com/

Heroine Trisha Marriage: ఆ స్టార్ హీరోయిన్ కి అర్జెంట్ గా వరుడు కావాలట !

Heroine Trisha Marriage: సీనియర్ బ్యూటీ త్రిష వయసు రెండు నెలలు తక్కువ 39 సంవత్సరాలు. అంటే, కరెక్ట్ ఏజ్ లో పెళ్లి చేసుకుని ఉండి ఉంటే.. త్రిష కూతురు కూడా ఈ పాటికి హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వాలని కలలు కంటూ ఉండేది. కానీ పెళ్లి వేళ రాలేదు, ఇంకా త్రిషకే పెళ్లి కాలేదు. ఒకపక్క త్రిష పెళ్లి అంటూ గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఓ వార్త తెగ వైరల్ అవుతుంది. మరి […]

Written By:
  • Shiva
  • , Updated On : March 3, 2022 / 02:18 PM IST
    Follow us on

    Heroine Trisha Marriage: సీనియర్ బ్యూటీ త్రిష వయసు రెండు నెలలు తక్కువ 39 సంవత్సరాలు. అంటే, కరెక్ట్ ఏజ్ లో పెళ్లి చేసుకుని ఉండి ఉంటే.. త్రిష కూతురు కూడా ఈ పాటికి హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వాలని కలలు కంటూ ఉండేది. కానీ పెళ్లి వేళ రాలేదు, ఇంకా త్రిషకే పెళ్లి కాలేదు. ఒకపక్క త్రిష పెళ్లి అంటూ గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఓ వార్త తెగ వైరల్ అవుతుంది. మరి ఇందులో నిజానిజాల పరిస్థితి ఏమిటయ్యా అని ఎంక్వైరీ చేస్తే.. త్రిషకు ప్రస్తుతం సంబంధాలు చూస్తున్నారు.

    Heroine Trisha Marriage

    కోలీవుడ్ సినీ వర్గాల్లో ఈ టాపిక్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. అయితే, త్రిషకు ఇంకా సరైన పార్టనర్ మాత్రం దొరకలేదు. ఆమె లైఫ్ పార్టనర్ కోసం చూస్తోంది. కాబట్టి, త్రిష పెళ్లికి ముహూర్తం సెట్ అయిపోయింది అని వస్తున్న వార్తలకు సంబంధించిన మేటర్ లో ఎలాంటి వాస్తవం లేదు. అయినా.. త్వరలోనే త్రిష పెళ్లి అంటూ తమిళ మీడియా వర్గాలు రెండు సంవత్సరాల నుండి వార్తలను వండి వడ్డిస్తూనే ఉంది.

    Also Read:  సుడిగాలి సుధీర్ కు మళ్లీ పెళ్లి.. ఈసారి ఆ కొత్త అమ్మాయి ఎవరో తెలుసా?

    అసలు, త్రిష పెళ్లి చేసుకుంటుందంటూ పుకార్లు అయితే గట్టిగానే పుట్టిస్తున్నారు గానీ, త్రిష మాత్రం పెళ్లి చేసుకోవడం లేదు. నిజానికి హీరో శింబు, త్రిష చాన్నాళ్లు డేటింగ్ చేశారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య వ్యవహారం చెడింది. దాంతో శింబు నయనతారను వదిలించుకున్నట్టే త్రిషను కూడా పక్కన పెట్టాడు. కట్ చేస్తే.. త్రిష పై చాలా రూమర్స్ వచ్చాయి. రానాతో కూడా ఆమె ప్రేమలో ఉందని ఆ మధ్య బాగా వినిపించింది.

    Heroine Trisha Marriage

    కానీ రానా, మిహీక బజాజ్ ని పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయాడు. మరోపక్క హీరో శింబు కూడా ఇప్పుడు సీరియస్ గా పెళ్లి గురించి థింక్ చేస్తున్నాడట. అతనికి ఓ నిర్మాత కుమార్తెతో పెళ్లి సెట్ అయిందని తెలుస్తోంది. కాబట్టి, శింబు – త్రిష పెళ్లి అనే మరో వార్తలో కూడా కనీస నిజం కూడా లేదు. సో.. త్రిష పెళ్లి చేసుకోబోతుంది అంటూ వచ్చిన తంతంగం మొత్తంలో కేవలం గాసిప్ రాయుళ్ల తాపత్రయం మాత్రమే ఉందన్నమాట.

    ఏది ఏమైనా ఒకప్పుడు తెలుగు, తమిళ భాషల్లో వరుస సినిమాలతో టాప్ హీరోయిన్‌ గా ఒక వెలుగు వెలిగిన త్రిష అంటే.. ఇప్పటికీ అభిమానుల్లో ఫుల్ క్రేజ్ ఉంది. నిజానికి కొన్నాళ్ల క్రితమే త్రిష పెళ్లి చేసుకునేందుకు ప్లాన్ చేసుకుంది. వ్యాపారవేత్త వరుణ్ మణియన్‌ తో త్రిషకు ఎంగేజ్‌మెంట్ కూడా అయిన సంగతి తెలిసిందే. అయితే అతనితో కొన్నాళ్ళు డేటింగ్ కూడా చేసిన త్రిష, చివరకు అతనికి కూడా దూరం అయ్యింది. ఫైనల్ గా త్రిష పుకార్లతో ఇలా వార్తల్లో నిలుస్తోంది పాపం. కానీ.. అర్జెంట్ గా వరుడు కావాలంటుంది త్రిష.

    Also Read:  ఐశ్వర్య రాయ్, త్రిష’ లుక్స్ తో అదరగొట్టిన లెజెండరీ డైరెక్టర్

    Tags