bheemla nayak Hindi Version: “భీమ్లా నాయక్” బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. తెలుగు రాష్ట్రాల నుంచి యూఎస్ఏ వరకు భారీ వసూళ్లను నమోదు చేస్తోంది. ‘భీమ్లా నాయక్’ సక్సెస్ తో ఫ్యాన్స్ అండ్ టీం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే, తెలుగులో ఈ మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో ఈ నెల 4న(శుక్రవారం) హిందీలో విడుదల చేయడానికి చిత్ర బృందం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే తెలుగులో హిట్ టాక్‌తో దూసుకుపోతున్న భీమ్లానాయక్ హిందీలో ఏ మేరకు మాయ చేస్తుందో వేచి చూడాల్సిందే.
పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటించిన మూవీ భీమ్లానాయక్. ఈ చిత్రానికి సాగర్ కె దర్శకత్వం వహించగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, కథనం అందించారు. మొత్తానికి ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో భీమ్లానాయక్ ఊపే కనిపిస్తోంది. ఈ సినిమా ప్రభావం బాగా కనిపిస్తోంది. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ థియేటర్స్ దగ్గర హంగామా చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల పవన్ ఫ్లెక్సీలకు పాలాభిషేకాలు చేశారు.
Also Read: ఆ స్టార్ హీరోయిన్ కి అర్జెంట్ గా వరుడు కావాలట !
బాణాసంచా కాల్చి, డ్యాన్సులు చేస్తూ అభిమానాన్ని చాటుకున్నారు. పవన్ సినిమా పై భీమ్లానాయక్‌కు పాజిటివ్ రెస్పాన్స్ రావడం బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవడం హ్యాపీగా ఉందని పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. త్రివిక్రమ్ రైటింగ్ వర్క్, సాగర్ చంద్ర డైరెక్షన్, తమన్ మ్యూజిక్ సినిమాను మరో లెవెల్‌కి తీసుకెళ్లాయి.
కాకపోతే, పవన్ కళ్యాణ్ హీరోగా నటించాడు కాబట్టే.. భీమ్లానాయక్ సినిమాపై జగన్ ప్రభుత్వం కక్ష సాధిస్తోంది. అదే ఈ సినిమాలో మరో హీరో నటించి ఉండి ఉంటే.. అంతా సజావుగా ఉండేది. అందుకే.. ఈ సినిమా విషయంలో అనేక పొరపాట్లు జరిగాయి. జరుగుతూనే ఉన్నాయి. మొత్తానికి పవన్ పై జగన్ ప్రభుత్వం కక్ష్య సాధిస్తోన్నా వసూళ్ల సునామి కురిపిస్తోంది.
Also Read: ఐశ్వర్య రాయ్, త్రిష’ లుక్స్ తో అదరగొట్టిన లెజెండరీ డైరెక్టర్