https://oktelugu.com/

వైఎస్ వివేకా కేసులో కీలక మలుపు.. సునీల్ తల్లి ఆత్మహత్య హెచ్చరిక!

వైఎస్ వివేకా కేసులో అరెస్ట్ అయిన సునీల్ కుమార్ యాదవ్ వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. అసలు వైఎస్ వివేకానందారెడ్డి హత్య కేసులో సునీల్ సూత్రధారి అని సీబీఐ అభియోగాలు మోపి విచారణ జరుపుతోంది. గోవాలో అరెస్ట్ చేసి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే సునీల్ నిరపరాధి అని.. అన్యాయంగా ఈ కేసులో ఇరుకిస్తున్నారని సునీల్ యాదవ్ తల్లి సావిత్రమ్మ వాపోయారు. తాజాగా ఆమె విలేకరుల ముందుకొచ్చారు. నా కుమారుడు సునీల్ యాదవ్ కు ఏ పాపమూ […]

Written By: , Updated On : August 10, 2021 / 11:57 AM IST
Follow us on

YS Vivekananda Murder Case Suspect Sunil

వైఎస్ వివేకా కేసులో అరెస్ట్ అయిన సునీల్ కుమార్ యాదవ్ వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. అసలు వైఎస్ వివేకానందారెడ్డి హత్య కేసులో సునీల్ సూత్రధారి అని సీబీఐ అభియోగాలు మోపి విచారణ జరుపుతోంది. గోవాలో అరెస్ట్ చేసి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే సునీల్ నిరపరాధి అని.. అన్యాయంగా ఈ కేసులో ఇరుకిస్తున్నారని సునీల్ యాదవ్ తల్లి సావిత్రమ్మ వాపోయారు. తాజాగా ఆమె విలేకరుల ముందుకొచ్చారు.

నా కుమారుడు సునీల్ యాదవ్ కు ఏ పాపమూ తెలియదని ఆయన తల్లి సావిత్రమ్మ చెప్పుకొచ్చారు. విచారణ పేరుతో నా కుమారుని చిత్రహింసలకు గురి చేస్తున్నారని ఆరోపించారు. 24 గంటల్లో నా కుమారుడు ఇంటికి రాకపోతే నా కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంటుందని ఆమె హెచ్చరించారు.
వివేకానంద రెడ్డి మాకు దేవుడు లాంటి వాడు….

వివేకానంద రెడ్డితో నా కుమారుడు సన్నిహితంగా మెలిగింది వాస్తవమేనని.. వివేకానంద రెడ్డి మా ఇంటికి 2 సార్లు వచ్చి వెళ్ళాడని.. అటువంటి మంచి వ్యక్తిని నా కుమారుడు హత్య చేశాడు అనడం అవాస్తవమని తల్లి సావిత్రమ్మ చెప్పుకొచ్చింది..

వాచ్ మన్ రంగయ్య చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని సునీల్ తల్లి తెలిపింది. రెండున్నర సంవత్సరాలుగా నోరువిప్పని రంగయ్య ఈరోజే ఎందుకు నోరు విప్పాడని ప్రశ్నించింది. వివేకానంద రెడ్డి హత్య జరిగిన రోజు నా కొడుకు సునీల్ యాదవ్ ఇంట్లోనే ఉన్నాడని తెలిపింది. హత్య జరిగిన తరువాత అందరిలాగా చూడడానికి మాత్రమే వెళ్ళాడని వివరించింది.