Washington Sundar: అక్షర్ పటేల్ ప్లేస్ లోకి వచ్చిన సుందర్..ఫైనల్లో ఉంటాడా..?

నిజానికి అక్షర్ పటేల్ బౌలింగ్ కంటే కూడా బ్యాటింగ్ లో ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తున్నాడు అదే రవీంద్ర జడేజా ని తీసుకుంటే గత కొన్ని సంవత్సరాలుగా వన్డే ఫార్మాట్లో నెంబర్ సెవెన్ లో ఆయన అంతగా పర్ఫార్మ్ చేయట్లేదు.

Written By: Gopi, Updated On : September 17, 2023 11:55 am

Washington Sundar

Follow us on

Washington Sundar: ఏషియా కప్ లో భాగంగా ఈరోజు శ్రీలంక ఇండియా మధ్య ఫైనల్ మ్యాచ్ అనేది జరగనుంది.ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు అనే ఉత్కంఠ అయితే రెండు దేశాల జనాల మధ్యలో విపరీతంగా ఉందనే చెప్పాలి. అయితే ఈ మ్యాచ్ కోసం ఇండియా చేయబోయే కీలకమైన మార్పులు ఏంటంటే ప్రేమదేశ స్టేడియం ఎక్కువగా స్పిన్ కి అనుకూలిస్తుంది అని తెలియడంతో ఇప్పటికే ఎక్స్ట్రా స్పిన్నర్ గా వాషింగ్టన్ సుందర్ కొలంబో చేరుకోవడం జరిగింది. అక్షర్ పటేల్ ని పక్కన పెట్టి ఫైనల్లో వాషింగ్టన్ సుందర్ ని ఆడించే ప్రయత్నంలో కోచ్ గాని, కెప్టెన్ గాని ఉన్నట్లుగా తెలుస్తుంది. బేసిగ్గా ఇది స్పిన్ స్పీచ్ అని కుంటారు కానీ ఇది స్పిన్ పిచ్ కాదు ఫాస్ట్ బౌలింగ్ కి అనుకూలించే పిచ్ కాదు కానీ ఇది ఒక ట్రిక్కి పిచ్ అంటే ఇక్కడ కొంచెం బాగా ఆడితే బ్యాట్స్ మెన్ స్పిన్నర్ లను ఎదుర్కోవచ్చు,ఫాస్ట్ బౌలర్ల ను ఎదుర్కోవచ్చు ఇవి మనం గత మ్యాచ్ లో కూడా చూస్తూనే వచ్చాం… కొంచెం బ్యాట్స్ మెన్ తడబడితే మాత్రం ఈ పిచ్ లో బౌలర్లు చెలరేగే అవకాశం అయితే ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకొని బ్యాట్స్ మెన్స్ ఆడితే ఇక్కడ స్కోర్స్ అయితే ఈజీగా చేయొచ్చు. అయితే అక్షర్ పటేల్ ప్లేస్ లో శార్దూల్ ఠాకూర్ ఉన్నాడు కానీ స్పెషల్ గా వాషింగ్టన్ సుందర్ ని తీసుకోవడం కరెక్టేనా అనేది ఒకసారి ఆలోచించి కెప్టెన్ నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ప్రస్తుతం ఆడేది నార్మల్ మ్యాచ్ కాదు, ఫైనల్ మ్యాచ్ కాబట్టి ఏ చిన్న పొరపాటు చేసినా కూడా మన టీం భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుంది.

నిజానికి అక్షర్ పటేల్ బౌలింగ్ కంటే కూడా బ్యాటింగ్ లో ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తున్నాడు అదే రవీంద్ర జడేజా ని తీసుకుంటే గత కొన్ని సంవత్సరాలుగా వన్డే ఫార్మాట్లో నెంబర్ సెవెన్ లో ఆయన అంతగా పర్ఫార్మ్ చేయట్లేదు. 2019 వరల్డ్ కప్ సెమి ఫైనల్ లో ఒక అద్భుతమైన నాక్ ఆడాడు కానీ 2021 నుంచి వన్డే ఫార్మాట్ లో ఆయన పెద్దగా పెర్ఫార్మ్ అయితే చేయట్లేదు. ఇప్పుడు వాషింగ్టన్ సుందర్ నెంబర్ ఎయిట్ లో ఇండియా టీం లోకి రావాలంటే అక్షర్ పటేల్, శార్దుల్ ఠాకూర్ ని ఇద్దరిని పక్కన పెట్టాల్సి వస్తుంది. మరి నిజంగా ఫైనల్ టీంలో వాషింగ్టన్ సుందర్ ఉంటాడా లేదా శార్దూల్ ఠాకూర్ ఉంటాడా అనేది తెలియాల్సి ఉంది….నాకు తెలిసిన అంత వరకు అయితే రిస్క్ తీసుకోకుండా రోహిత్ శర్మ శార్ధుల్ ఠాకూర్ ని టీమ్ లోకి తీసుకుంటాడు అని అనుకుంటున్న…