https://oktelugu.com/

Vishwanagaram : విశ్వనగరంలో మరో గ్లోబల్‌ సెంటర్‌.. తెలంగాణ ప్రభుత్వంతో అగ్రిమెంట్‌!

Vishwanagaram : హైదరాబాద్‌(Hyderabad).. దేశంలోని మెట్రోపాలిటన్‌ సిటీల్లో ఒకటి. తెలంగాణ(Telandana) రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్‌ వేగంగా అభివృద్ధి చెందుతోంది. అనేక సౌకర్యాల నేపథ్యంలో అనేక అంతర్జాతీయ(International) సంస్థలు హైదరాబాద్‌వైపు చూస్తున్నాయి. ఇప్పటికే గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్‌ వంటి సంస్థలు ఇక్కడికి వచ్చాయి. తాజాగా మరో సంస్థ హైదరాబాద్‌కు వస్తామటోంది.

Written By: , Updated On : March 20, 2025 / 02:08 PM IST
Telangana

Telangana

Follow us on

Vishwanagaram : హైదరాబాద్‌లో మెక్‌డొనాల్డ్స్‌(Mec donalds)గ్లోబల్‌ ఆఫీస్‌ ఏర్పాటు కాబోతోంది. అమెరికాకు చెందిన ప్రముఖ ఫాస్ట్‌ఫుడ్‌ గొలుసు సంస్థ అయిన మెక్‌డొనాల్డ్స్, తన భారతదేశ గ్లోబల్‌ కార్యాలయం మరియు గ్లోబల్‌ కెపాబిలిటీ సెంటర్‌ (GCC)ను హైదరాబాద్‌లో స్థాపించేందుకు తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ నిర్ణయం మార్చి 19, 2025న మెక్‌డొనాల్డ్స్‌ ఛైర్మన్‌. సీఈఓ క్రిస్‌ కెంప్‌జిన్‌స్కీ తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌ రెడ్డి(Revanth Reddy)తో సమావేశం తర్వాత ప్రకటించారు. ఈ గ్లోబల్‌ ఆఫీస్‌ ప్రారంభంలో 2,000 మంది ఉద్యోగులతో పనిచేయనుంది.

Also Read : రూ.3 లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్.. ఏ రంగాలకు ఎంతంటే?

ఎక్కడ అంటే..
హైదరాబాద్‌లోని ఆర్‌ఎంజెడ్‌ నెక్సిటీ టవర్‌ 20లో రెండు అంతస్తులను (సుమారు 2 లక్షల చదరపు అడుగులు) మెక్‌డొనాల్డ్స్‌ లీజుకు తీసుకుంది, ఇది 2025 మధ్య నాటికి పని ప్రారంభించే అవకాశం ఉంది. ఈ కార్యాలయం అమెరికా వెలుపల మెక్‌డొనాల్డ్స్‌ యొక్క అతిపెద్ద GCCగా నిలుస్తుంది. ఇక్కడ నైపుణ్యం గల పనిశక్తి, ఆధునిక మౌలిక సదుపాయాలు, మరియు ఉన్నత జీవన నాణ్యత కారణంగా బెంగళూరు వంటి ఇతర నగరాలను మించి హైదరాబాద్‌ ఎంపికైందని కెంప్‌జిన్‌స్కీ తెలిపారు.

ఉద్యోగవకాశాలు..
ఈ ప్రాజెక్ట్‌ ద్వారా తెలంగాణలో ఉద్యోగ అవకాశాలు(Employement Chnses) పెరగడమే కాకుండా, స్థానిక రైతుల నుంచి వ్యవసాయ ఉత్పత్తులను సేకరించడం ద్వారా రాష్ట్ర వ్యవసాయ ఆర్థిక వ్యవస్థకు కూడా ఊతం లభిస్తుంది. అదనంగా, యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీ ద్వారా శిక్షణ పొందిన యువతను ఈ కార్యాలయం మరియు దేశవ్యాప్తంగా ఉన్న మెక్‌డొనాల్డ్స్‌ రెస్టారెంట్ల కోసం నియమించుకునే అవకాశం ఉంది.

తెలంగాణలో ఇలా..
ప్రస్తుతం తెలంగాణలో 38 మెక్‌డొనాల్డ్స్‌ ఔట్‌లెట్లు ఉన్నాయి, మరియు ప్రతి సంవత్సరం 3–4 కొత్త ఔట్‌లెట్లను టీఆర్‌–2, టీఆర్‌–3 నగరాల్లో కూడా చేర్చాలని సంస్థ యోచిస్తోంది. ఈ ఒప్పందం హైదరాబాద్‌ను ఒక ప్రముఖ గ్లోబల్‌ వ్యాపార కేంద్రంగా మరింత బలోపేతం చేస్తుంది.

Also Read : తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. కొత్త పథకం ప్రకటించిన ప్రభుత్వం.. రూ.3 లక్షల సాయం