ఆస్తుల తాకట్టు పై విశాఖ వాసుల ఆగ్రహం..!

గత ప్రభుత్వం ప్రజా పాలన సరిగా నిర్వహించలేదని, తాము అధికారంలోకి వస్తే అన్నీ బాగు చేస్తామని 2019లో అధికారంలోకి వచ్చింది వైసీపీ. ముఖ్యమంత్రిగా జగన్ పీటంపై కూర్చొని రెండేళ్లు అవుతోంది. అయితే అనేక రకాల ప్రభుత్వ, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన జగన్ వాటికి నిధులను సమకూర్చే విధానంపై కొందరు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ప్రభుత్వం సంపదను సృష్టించి, వాటి నుంచి కొంత ప్రజల సంక్షేమానికి వాడాలి.. కానీ ఉన్న ఆస్తులు అమ్మి ప్రజా అవసరాలు తీర్చే ప్రభుత్వాన్ని ఇప్పుడే […]

Written By: NARESH, Updated On : June 13, 2021 2:43 pm
Follow us on

గత ప్రభుత్వం ప్రజా పాలన సరిగా నిర్వహించలేదని, తాము అధికారంలోకి వస్తే అన్నీ బాగు చేస్తామని 2019లో అధికారంలోకి వచ్చింది వైసీపీ. ముఖ్యమంత్రిగా జగన్ పీటంపై కూర్చొని రెండేళ్లు అవుతోంది. అయితే అనేక రకాల ప్రభుత్వ, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన జగన్ వాటికి నిధులను సమకూర్చే విధానంపై కొందరు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ప్రభుత్వం సంపదను సృష్టించి, వాటి నుంచి కొంత ప్రజల సంక్షేమానికి వాడాలి.. కానీ ఉన్న ఆస్తులు అమ్మి ప్రజా అవసరాలు తీర్చే ప్రభుత్వాన్ని ఇప్పుడే చూస్తున్నామని కొందరు లోలోపల చర్చించుకుంటున్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎంతో మంది ముఖ్యమంత్రులు ఎన్నో రకాల ప్రజా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. అయితే ఏనాడు ప్రజా ఆస్తులకు భంగం వాటిల్లనివ్వలేదు. కొత్త ఆదాయాలను సృష్టించి వాటి నుంచి నిధులు సమకూర్చారు. అయితే వైసీపీ ప్రభుత్వం మాత్రం సంక్షేమ పథకాల కోసం నిధులను ఆస్తులను అమ్మి సమకూర్చాలని చూస్తోంది. ముఖ్యంగా విశాఖలోని ఆస్తులపై ప్రయోగం చేపట్టింది. ప్రభుత్వానికి సంబంధించిన భూములు, భవనాలను తాకట్టు పెట్టి మరీ నిధులను సమకూరుస్తోందట.

ఈ లిస్టులో ఎమ్మార్వో కార్యాలయాలు, రైతు బజార్లు ఆఖరికి కలెక్టరేట్ భవనాలను కూడా తాకట్టు పెట్టాలనే ఆలోచనలో ఉందట. అయితే రాను రాను కాలనీలకూ కూడా తాకట్టు పెడుతారేమోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అయితే ఇది సాధ్యం కాదు కదా..? అని కొందరు అంటున్నారు. అయితే ప్రభుత్వ ఆస్తులు కూడా తాకట్టుపెట్టడం సాధ్యం కాదు.. కానీ ఇప్పుడవుతుందిగా.. అని చర్చించుకోవడం మొదలుపెట్టారు.

అయితే ఇలాగే ఆస్తులపై ప్రభుత్వం కన్నెస్తే రాను రాను ప్రజలు ఊరుకుంటారా..? అని కొందరు వాదిస్తున్నారు. విశాఖలోని ప్రభుత్వ ఆస్తుల తాకట్టుపై కొందరు నాయకులు రగిలిపోతున్నారు. అయితే కేసులు, ఇతర కారణాలతో ఎవరూ భయటపడడం లేదు. కానీ ప్రజలంతా ఒక్కరాని తిరగబడితే అసలుకే మోసం ఏర్పడే ప్రమాదముందని కొందరు రాజకీయ విశ్లేషకులు మండిపడుతున్నారు.