బ్రాండ్ విశాఖ: జగన్ కు లాభమా? నష్టమా?

బ్రాండ్ విశాఖ.. ఏపీకి కాబోయే రాజధానిగా పేరొందింది. వైసీపీ ప్రభుత్వం గద్దెనెక్కాక విశాఖను రాజధానిగా చేసేందుకు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటోంది. అక్కడ కరోనా వైరస్ మొదట్లో బాగా ప్రబలినా ఆ తర్వాత కట్టడి చేసింది వైసీపీ సర్కార్. విశాఖ బ్రాండ్ కు దెబ్బవస్తుందనే ఇక్కడ కరోనా కేసులు నమోదు చేయలేదన్న విమర్శలు వచ్చాయి. కానీ జగన్ సర్కార్ మాత్రం విశాఖ బ్రాండ్ దెబ్బతినకుండా అక్కడ కేసులు లేవంటోందన్నది ప్రతిపక్షాల ఆరోపణ.. ఏదైతేనేం విశాఖకు కరోనా ముప్పు పోయింది. […]

Written By: Neelambaram, Updated On : May 8, 2020 8:14 pm
Follow us on


బ్రాండ్ విశాఖ.. ఏపీకి కాబోయే రాజధానిగా పేరొందింది. వైసీపీ ప్రభుత్వం గద్దెనెక్కాక విశాఖను రాజధానిగా చేసేందుకు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటోంది. అక్కడ కరోనా వైరస్ మొదట్లో బాగా ప్రబలినా ఆ తర్వాత కట్టడి చేసింది వైసీపీ సర్కార్. విశాఖ బ్రాండ్ కు దెబ్బవస్తుందనే ఇక్కడ కరోనా కేసులు నమోదు చేయలేదన్న విమర్శలు వచ్చాయి. కానీ జగన్ సర్కార్ మాత్రం విశాఖ బ్రాండ్ దెబ్బతినకుండా అక్కడ కేసులు లేవంటోందన్నది ప్రతిపక్షాల ఆరోపణ.. ఏదైతేనేం విశాఖకు కరోనా ముప్పు పోయింది. ఇప్పుడు మరో ముప్పు వచ్చింది.

గ్యాస్ లీక్ వెనుక విజయసాయి రెడ్డి!

*వైసీపీ కలల రాజధానిగా విశాఖ సరిపోతుందా?
గత టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు.. ఆయన పార్టీ నేతలంతా ఏర్చికూర్చి అమరావతిని రాజధానిగా చేసి అభివృద్ధి చేశారు. వాళ్లు అభివృద్ధి అయ్యారు. కానీ వైసీపీ సర్కార్ గద్దెనెక్కాక పరిస్థితి మారిపోయింది. మూడు రాజధానులను తెరపైకి తెచ్చిన సీఎం జగన్ అమరావతిని హోల్డ్ చేసి.. విశాఖను పరిపాలన రాజధానిగా చేశారు. సకల సౌకర్యాలున్న విశాఖ ఏపీకి రాజధానిగా పర్ ఫెక్ట్ అని.. హైదరాబాద్ ను తలదన్నేలా అభివృద్ధి చెందిస్తామని తెలిపారు. కానీ వరుస దెబ్బలు విశాఖ రాజధానిగా ఏపీకి సూట్ అవుతుందా లేదా అన్న భయాన్ని సృష్టిస్తున్నాయి..

*గ్యాస్ లీక్ తో విశాఖ బ్రాండ్ కు దెబ్బ
విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి గ్యాస్ లీక్ కావడం.. ఆ వీడియోలు, ఫొటోలు వైరల్ కావడం.. ప్రజలు నిస్సహాయంగా పడిపోవడం.. చనిపోవడం చూసి దేశమే నివ్వెరపోయింది. ఇంతటి దుర్భరమైన జీవితం విశాఖలో ఉందా? గ్యాస్ కు అంతగా ప్రజలు అతలాకుతలం అయ్యారా? అని అందరూ షాక్ కు గురయ్యారు. ఈ నేపథ్యంలోనే ఏపీకి రాజధానిగా విశాఖ పర్ ఫెక్ట్ అని ఇన్నాళ్లు చెప్పిన వైసీపీకి ఇది పెద్ద ఎదురుదెబ్బగా మారింది. గ్యాస్ లీక్ తో విశాఖ బ్రాండ్ కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. గ్యాస్ లీకేజీ కారణంగా విశాఖలో గాలి నాణ్యత అసాధారణంగా క్షీణించడం పర్యావరణ వేత్తలను ఆందోళనకు గురిచేస్తోంది.ఇది పరిపాలన రాజధానిగా మారితే పరిస్థితి ఎలా ఉంటుందోనన్న ఆందోళన ఇప్పుడు అందరిలోనూ నెలకొంది.

కేంద్రం విద్యుత్ బిల్.. రైతుల పాలిట శాపం

*జగన్ కొనసాగిస్తారా? వెనక్కి తగ్గుతారా?
అయితే విశాఖకు పరిపాలను తరలిస్తే మంత్రులు, సీఎం, అధికారులంతా ఇక్కడి నుంచే పరిపాలించాలి. మరి విశాఖ భద్రత పరంగా సేఫేనా అన్న చర్చ మొదలైంది. విశాఖ బ్రాండ్ కు పడ్డ తొలగించుకునేందుకు సీఎం జగన్ నడుం బిగించారు. వెంటనే కాలుష్య నియంత్రణ మండలి సీనియర్ అధికారులతో మాట్లాడి విశాఖను సేఫ్ సిటీగా మలచడానికి ఏం చేయాలనే దానిపై చర్చించారు. చుట్టుపక్కల ఉన్న ప్రమాదకర కర్మాగారాలను గుర్తించాలని అధికారులను ఆదేశించారు. ప్రమాద రహిత విశాఖ కోసం సమగ్ర రోడ్ మ్యాప్ ను సిద్ధం చేయాలని కోరారు. నివాసాలకు దూరంగా పరిశ్రమలను ఉంచాలని ఆదేశించారు. దీన్ని ఎన్ని ఉపద్రవాలు వచ్చినా విశాఖ రాజధాని విషయంలో జగన్ వెనక్కి తగ్గరని తేలింది.

*విశాఖ పరిస్థితులు కఠినం.. అయినా ముందుకే..
విశాఖలో పరిపాలన రాజధానికి అనువైనది కాదని తాజాగా గ్యాస్ లీక్ తో తేలింది. ఇక భూముల వ్యవహారాలు.. ఇతర అడ్డంకులు ఉండనే ఉన్నాయి. అయితే విస్తారమైన భవనాలు.. రాజధాని లక్షణాలు ఉన్నాయి. అందుకే ప్రమాదకర పరిశ్రమలున్నా జగన్ ముందుకే వెళ్లడానికి డిసైడ్ అయ్యారు. రాజధానిగా విశాఖకే మొగ్గు చూపుతున్నారు. విశాఖ బ్రాండ్ దెబ్బపడినా.. నష్టం చేకూరుస్తున్నా కూడా జగన్ విశాఖ రాజధానికే ఓటు వేస్తుండడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.

-నరేశ్ ఎన్నం