https://oktelugu.com/

వైరల్:నోముల నోట ఆఖరి మాటలో కమ్యూనిజం

నోముల నర్సింహాయ్య.. ఒకప్పుడు కమ్యూనిస్టు దిగ్గజం. ఆ సిద్ధాంతాలకు నీళ్లొదిలి నాగార్జున సాగర్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసి గెలిచాడు. నిన్న పరమపదించాడు. అయితే ఆయన చివరి మాటలు తాజాగా వైరల్ అయ్యాయి. Also Read: ‘గ్రేటర్’ గుణపాఠం.. తెరపైకి నిర్బంధ ఓటింగ్..! చనిపోయి ముందు టీఆర్ఎస్ నాగార్జున సాగర్ ఎమ్మెల్యే మాటలు వైరల్ అయ్యాయి. ‘భగవంతుడు నన్ను పిలిచాడు. ఎర్రజెండా నర్సింహయ్యగానే నా అంతిమ సంస్కారాలను నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొంతమందిని తెలిసో, తెలియకో ఇబ్బంది […]

Written By:
  • NARESH
  • , Updated On : December 2, 2020 6:16 pm
    Follow us on

    Nomula Narsimhaiah

    నోముల నర్సింహాయ్య.. ఒకప్పుడు కమ్యూనిస్టు దిగ్గజం. ఆ సిద్ధాంతాలకు నీళ్లొదిలి నాగార్జున సాగర్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసి గెలిచాడు. నిన్న పరమపదించాడు. అయితే ఆయన చివరి మాటలు తాజాగా వైరల్ అయ్యాయి.

    Also Read: ‘గ్రేటర్’ గుణపాఠం.. తెరపైకి నిర్బంధ ఓటింగ్..!

    చనిపోయి ముందు టీఆర్ఎస్ నాగార్జున సాగర్ ఎమ్మెల్యే మాటలు వైరల్ అయ్యాయి. ‘భగవంతుడు నన్ను పిలిచాడు. ఎర్రజెండా నర్సింహయ్యగానే నా అంతిమ సంస్కారాలను నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొంతమందిని తెలిసో, తెలియకో ఇబ్బంది పెట్టి ఉండొచ్చు. అన్యథా భావించొద్దు. నర్రా రాఘవరెడ్డి శిష్యుడిగా, నకిరేకల్ ఎర్రజెండా బిడ్డగా.. ఎర్రజెండా బిడ్డగానే నన్ను సాగనంపుతారని కోరుకుంటున్నాను. ఇదే చివరి రాత్రి. ఆఖరు మాటలుగా భావించండి. రేపటి భవిష్యత్తు అంతా కమ్యునిస్టు పార్టీలది. మీరంతా కమ్యునిస్టు బిడ్డలుగా ఉండాలని కోరుకుంటున్నాను. సెలవు.

    నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య చివరి మాటలతో వైరల్ అవుతున్న ఆడియో క్లిప్పింగ్స్‌పై ఆయన కుటుంబ సభ్యులు స్పందించారు. అవన్నీ ఫేక్ అని పత్రికా ప్రకటన విడుదల చేశారు. కొంతమంది రాజకీయ ప్రత్యర్ధులు దురుద్దేశంతో ఇలాంటి ఫేక్ ఆడియాలు సృష్టించారంటున్నారు. ఈమేరకు ఎమ్మెల్యే నర్సింహయ్య బావమరిది సాదం సంపత్ కుమార్ ప్రకటనలో తెలిపారు.

    Also Read: పోలింగ్ శాతం తగ్గడం ఎవరికి లాభం?

    నోముల నర్సింహయ్య అనారోగ్యంతో మంగళవారం తెల్లవారు జామున గుండె పోటుతో మరణించాడన్న వార్త తెలియడంతో నియోజక వర్గంలోని టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు దిగ్భ్రాంతికి గురయ్యారు. హైదరాబాద్‌ నుంచి మధ్యాహ్నం 2 గంటలకు ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతదేహాన్ని నియోజకవర్గ కేంద్రమైన హాలియాకి తరలించి అంత్యక్రియలు నిర్ణయించారు.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్